the international market
-
నెంబర్ 1 క్వాలిటీయే కావలె
బహిరంగ వేలంతో ఎర్రబంగారానికిపెరుగుతన్న డిమాండ్ చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నుంచే రిమోట్ చేస్తున్న స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారే మేస్త్రీలు, కూలీలు అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న అత్యంత అరుదైన సహజసిద్ధ జీవ ఖనిజం ఎర్రచందనం. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే ఎర్రచందనానికి జిల్లా పెట్టింది పేరు. అందుకే స్మగ్లర్మ కన్ను ఎప్పటి నుంచో శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనంపై పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఎర్రచందనం బహిరంగ వేలాన్ని ప్రవేశ పెట్టడంతో నాణ్యమైన సరుకు కోసం ఎర్రదొంగలు దుంగల కోసం వేటను మరింత ముమ్మరం చేస్తున్నారు. భాకరాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనాన్ని బహిరంగ వేలం వేయుడంతో అంతర్జాతీయుంగా డిమాండ్ ఏర్పడింది. స్మగ్లర్లు ఇక్కడ పెరిగే ఎర్ర చందనం వృక్షాలను విపరీతంగా నరికివేస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అడవికే వచ్చి నెంబర్ 1 క్వాలిటీ సరుకు తెచ్చే కూలీలకు స్మగ్లర్లు అధిక పారితోషికం ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. గత 20 ఏళ్ల క్రితం ఎర్రచందనం చె ట్లకు ఫారెస్టు శాఖ నెంబర్ ప్లేట్లు వేసింది. ప్రస్తుతం వాటినే కూలీలు నరకి వేస్తుండడంతో ఆ శాఖ ఏమీ చేయాలో దిక్కు తెలియని స్థితిలో ఉంది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచే రిమోట్ చిత్తూరు,కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఎర్రచందనం ఎక్కువగా ఉండడంతో ఈ జిల్లాలకు చెందిన స్మగ్లర్లు అక్కడే ఉంటూ కూలీలను రిమోట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. గతంలో కూలీలు చెట్లను 2 నుంచి 4 అడుగులు వరకు మొదుళ్లు వదలి నరికేవారు. ఇప్పుడు డివూండ్‌తో పాటు క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం వాటిపై కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అరికట్టడంలో విఫలం అరుుందనే చెప్పా లి. సాక్షాత్తు రాష్ట్ర వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడు సొంత జిల్లా వారే ఎర్రచందనం తరలించడంలో సిద ్ధహస్తులు. వీరిని వదలి తమిళనాడులో ఉండే కూలీలకు అవగాహన కల్పించడంపైనా వివుర్శలు వస్తున్నాయి. వేలం లో ఏ గ్రేడ్ ఎర్ర దుంగలు విలువ ఒక్కసారిగా అవూం తం టన్ను ధర రూ.1.40 కోట్లు పలకగా స్మగ్లర్లు టన్ను రూ.60 లక్షలకే సరఫరా చేస్తున్నా రు. దీంతో రాష్ట్రప్రభుత్వం పలు డిపోల్లో ఉన్న ఎర్రచందనం దుంగలకు డ్రెస్సింగ్ చేసి రేణిగుంట డిపోకు తరలించినట్లు సమాచారం . . అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాం అడవికి వెళ్లే వూర్గాల వద్దనే కాపు కాసి అడ్డుకుంటూ, నిరోధించేందుకు కృషి చేస్తున్నాం. గత రెండు నెలల్లోనే సువూరు 10 గ్రూపులను అడవిలోకి వెళ్లక వుుందే నిరోధించాం. అరుుతే పటిష్ట చర్యలు చేపట్టాం. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కూడా చాలా సీరియుస్‌గా ఉంది. - రఘునాథ్, భాకరాపేట ఫారెస్టు రేంజర్ -
మత్తు దించుతాం
► సారా తయారీఅడ్డుకట్టకు సన్నాహాలు ► గంజాయి సాగు నిరోధానికి కార్యాచరణ ► డిఫెన్స్, విదేశీ మద్యంఅక్రమ నిల్వలపై దాడులు ► ‘సాక్షి’తో ఎక్సైజ్ డీసీ గోపాలకృష్ణ సాక్షి: తెలంగాణ నుంచి ఆంధ్ర కేడర్‌కు రావడం ఎలా ఉంది? డీసీ: ఆంధ్ర నా సొంత ప్రాంతం. విశాఖలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. సాక్షి: జిల్లాలో సారా జోరు ఎక్కువగా ఉంది...? డీసీ: అవును. బాధ్యతలు చేపట్టగానే తొలుత సారాను అరికట్టే అంశాన్నే తీసుకున్నాను. రాష్ర్ట ప్రభుత్వం దీని నియంత్రణకు ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సారా తయారీని అడ్డుకుంటాం. ము ఖ్యంగా అనకాపల్లి డివిజన్లో 243 గ్రామాల్లో సారా తయారు చేస్తున్నట్టు గుర్తిం చాం. 22 గ్రామాల్లో ఉధృతంగా ఉంది. అంచెలంచెలుగా దాడులు చేపడతాం. సాక్షి: గంజాయి సాగు, అక్రమ రవాణాకు విశాఖ ఏజెన్సీ ప్రధాన కేంద్రంగా మారిందనే వాదన ఉంది? డీసీ: సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సాగయ్యే గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఏజెన్సీలో గంజాయి సాగు విస్తరించింది. వరంగల్ వంటి తెలంగాణ జిల్లాల్లోనే ఉండే గంజాయి సాగు జిల్లాకు విస్తరించడానికి కూడా ఇదే కారణం. దీని రవాణాను ఎంతగా అడ్డుకున్నా అది తక్కువే అవుతుంది. పంట సాగును నిరోధిస్తేనే ఫలితం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇక్కడికి వచ్చి గిరిజనుల చేత పండిస్తున్నారు. వారిని పట్టుకోవాలి. ముఖ్యంగా పంట వేయకుండా ఉండాలంటే గిరిజనులకు గంజాయి విత్తనాలు దొరక్కుండా చేయాలి. ఇందుకు పోలీస్, ఫారెస్ట్, ఐటిడీఎ, ఎక్సైజ్ శాఖలో సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. మే నుంచి కొత్త పంట సాగు ప్రారంభమవుతుంది. ఈలోగా అన్ని విభాగా సమన్వయంతో అడ్డుకోవడానికి కార్యాచరణ మొదలుపెడతాం. సాక్షి: మద్యం దుకాణాలు నిబంధనలు పాటించేలా తీసుకుంటున్న చర్యలేమిటి? డీసీ: లెసైన్స్ కలిగిన మద్యం షాపులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నాం. అయితే అది తక్కువగా ఉంటోంది. జరిమానా మొత్తాన్ని పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఎక్కువ జరిమానా పడుతుందంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాం. అదే విధంగా విదేశీ, డిఫెన్స్ మద్యం అక్రమ నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి. డిఫెన్స్ మద్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని బ్రాండ్ల విదేశీ మద్యాన్ని మా ఏపీపీసీఎల్లో అందిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
స్పైస్‌జెట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.74 టార్గెట్ ధర: రూ.150 ఎందుకంటే: దాదాపు దివాళా స్థితిలో ఉన్న ఈ కంపెనీ పగ్గాలను గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ చేపట్టారు. కంపెనీ పునరుజ్జీవింపజేయడానికి కొత్త యాజమాన్యం పలు చర్యలు తీసుకుంది. సామర్థ్యాన్ని, ఆదాయాన్ని పెంచడం, విమాన సర్వీసుల హేతుబద్ధీకరణ, విమానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కీలక మార్కెట్లలో విమాన సర్వీసుల పెంపు, వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా విమానాల సంఖ్యను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండడం విమానయాన రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం, వేతనాల పెరుగుదల, ఫస్ట్‌క్లాస్ రైల్వే చార్జీలతో పోల్చితే విమాన చార్జీలు ఒకింత చౌకగా ఉండడం వంటి అంశాల కారణంగా మొత్తం విమానయాన రంగమే టర్న్అరౌండ్ కానున్నదని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 32గా ఉన్న ఉన్న విమానాల సంఖ్య మరో రెండేళ్లలో 52కు పెంచుకోనున్నది. ప్రతి నెలా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్‌ను సాధిస్తోంది. మొత్తం విమాన యాన సంస్థ వ్యయాల్లో 40 శాతంగా ఉంటే ఇంధన వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ మొత్తం ఆదాయంలో 46 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు 33 శాతానికి తగ్గాయి. గత ఏడాది జనవరిలో 9 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ షేర్ అదే ఏడాది నవంబర్‌లో 13 శాతానికి ఎగసింది. 2018 మార్చి కల్లా 18 శాతానికి పెరగగలదని అంచనా. వీటన్నింటి ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 17 శాతం, ఇబిటా 41 శాతం, నికర లాభం 62 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇండస్‌ఇంద్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.921 టార్గెట్ ధర: రూ.1,125 ఎందుకంటే: ముంబై కేంద్రంగా కమర్షియల్, ట్రాన్సాక్షనల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలనందిస్తోంది.1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిడ్ సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 854 బ్రాంచీలు, 1,578 ఏటీఎంలతో ఖాతాదారులకు సేవలందిస్తోంది. లండన్, దుబాయ్, అబూదాబిల్లో ప్రాతినిధ్య కార్యాలయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం 30 శాతం వృద్ధి చెంది రూ.580 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి 29 శాతంగా ఉంది. రిటైల్ రంగ రుణాలు 27 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహన రుణాలు 31 శాతం పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 3.91 శాతానికి చేరాయి. కీలకమైన ఫీజు ఆదాయం 30 శాతం పెరిగింది. కార్పిరేట్ రుణ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండి బకాయిలు 1 శాతానికి దిగువనే ఉన్నాయి. మార్జిన్ల అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలపై దృష్టిసారిస్తోంది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఆదాయ, నికర లాభాల వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం బ్యాంక్‌కు కలసివచ్చే అంశాలు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా రూ.1,125కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. 2017 నాటికి బ్రాంచీల సంఖ్యను 1,200కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.2,264 టార్గెట్ ధర: రూ.2,854 ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ భారత మల్టీ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ. ముంబై కేంద్రంగా ఐటీ, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తోంది. 46కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఇదే టాప్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీ క్యూ3 ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలను అందుకోలేకపోయినా, ఇబిటా, నికర లాభాలు అంచనాలను మించాయి. అంతర్జాతీయ వ్యాపారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 27 శాతం పెరిగింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 0.9 శాతం వృద్ధితో రూ.6,110 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల వినియోగం 85 శాతంగా ఉంది. ఐటీ సేవల్లో ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 15%గా ఉంది. అధిక ఆదాయం వచ్చే ఇద్దరు క్లయింట్లు కలుపుకొని మొత్తం 9 మంది కొత్త క్లయింట్లు ఈ క్యూ3లో లభించినట్లు కంపెనీ పేర్కొంది.ఐటీ బడ్జెట్/వ్యయాలపై తమ క్లయింట్ల నుంచి ఎలాంటి ప్రతికూల లేదా తగ్గింపు సంకేతాలు అందలేదని కంపెనీ చెబుతోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం డాలర్ టర్మ్‌ల్లో 10 శాతం, రూపాయి టర్మ్‌ల్లో 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.98గా ఉన్న షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.138కు పెరుగుతుందని భావిస్తున్నాం. కీలకమైన అమెరికా, యూరప్‌ల్లో మరిన్ని డీల్స్ సాధిస్తామని కంపెనీ ఆశావహంగాఉంది. ఇబిటా మార్జిన్లు 26-28 శాతం రేంజ్లో ఉంటాయని ధీమాగా ఉంది. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 15 శాతం, నికర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. -
వెనామీ.. జాగ్రత్త సుమీ..
యూజమాన్య పద్ధతులతో వెనామీ సాగు లాభదాయం వ్యాధులపై అప్రమత్తత అవసరం కైకలూరు : రొయ్యల సాగు ఒడిదుడుకుల్లో పడింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కలిగిన వెనామీ రొయ్యల సాగు జిల్లాలో ఇటీవల పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 22 వేల ఎకరాల్లో సాగవుతోంది. సరైన శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడంతోనే నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల సాగు లాభాలొస్తే కుబేరుడిని, నష్టాలొస్తే బిచ్చగాడిని చేస్తుందని నానుడి. అందుకే రైతులు యూజమాన్య పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బీ రాజ్‌కుమార్ సూచిస్తున్నారు. చెరువును ఎండ బెట్టడం ఉత్తమం... రొయ్యల చెరువులో మట్టి తన సహజ లక్షణాలను కోల్పోతుంది. ఎండిన తర్వాత మూడు సార్లు దుక్కి దున్ని, దుక్కికి దుక్కికి మధ్య ఏడు రోజులు విరామం ఇవ్వాలి. నేలను రోలర్‌తో చదును చేయాలి. చెరువును బాగా ఎండబెట్టడంతో అడుగున చేపలు, నత్తలు వంటి జీవులు నశిస్తాయి. ఒకవేళ చెరువు పూర్తిగా ఎండని పక్షంలో టీ సీడ్ కేకు, కాపర్ సల్ఫేట్‌ను ఉపయోగించాలి. పూర్తిగా ఆరిన చెరువులో సూర్యరశ్మి వల్ల అడుగున ఉండే వ్యర్థాలు ఆక్సీకరణం చెంది, తొలగించడానికి సులువుగా ఉంటుంది. రొయ్యలు అడుగు భాగాన సంచరించే జీవులు కాబట్టి నేల స్వభావం రొయ్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీవభద్రత వ్యవస్థను పటిష్టం చేయాలి... వెనామీ రొయ్యల చెరువులో జీవ వాతావరణ వ్యవస్థ ఎంతో కీలకం. నేల, నీరు, సీడ్, గాలి, జంతువులు, మనుషులు ఇలా ఆరు మాధ్యమాల ద్వారా సూక్ష్మజీవులు చెరువులోకి ప్రవేశిస్తారుు. పీతలు, తాబేళ్లు, కప్పలు, పాములు, కుక్కలు, నక్కలు వంటివి రొయ్యల చెరువు వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీతలు, నత్తల బొరియల్లో గ్యాస్ బిల్లలు వేసి పూడ్చివేయాలి. చెరువులోకి నీటిని నింపేటప్పుడు 40 లేదా 60 నంబరు మెష్ హపాను కట్టాలి. నీటిని నింపిన తర్వాత 30 లేదా 40 పీపీఎంతో క్లోరినేషన్ చేసుకోవాలి. నత్తలు, పీతలు పైకి ఎక్కకుండా 30-50 సెంటీ మీటర్ల ఎత్తులో క్రాబ్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి. ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థ పదార్థాలను పడవేసినా లోపలికి వెళ్లకుండా ఎరుపు వలలతో బర్డ్ ఫెన్సింగ్ నిర్మించుకోవాలి. రొయ్య పిల్లలను వదిలే ముందు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాలి. రొయ్యల చెరువుకు ఉపయోగించే వల, బకెట్, టబ్స్, పని చేసే సిబ్బంది చేతులు 100 పీపీఎం, అయోడిన్ ద్రావకంతో శుభ్రపర్చుకోవాలి. ఏరియేటర్లు కీలకం... రొయ్యలకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి. దీనికి ఏరియేటర్లను ఉపయోగిస్తారు. వీటిని ఏర్పాటు చేసేటప్పుడు నీటి ప్రవాహ దిశను బట్టి దాని పైపు భూమిలో బలంగా నాటాలి. నీటి ప్రవాహం వృత్తాకారంలో ఉండేలా తగిన మార్పులు చేసి బిగించాలి. ఏరియేటర్లతో చిన్న దశలో రొయ్య పిల్లలకు ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి చెరువు అడుగుభాగాన పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతోంది. బయోమాస్ ఆధారంగా హెచ్‌పీ మోటర్లు వినియోగించాలి. -
సరిహద్దులో పెట్రోల్‌కు డిమాండ్
ఏపీలో వ్యాట్ విధించడంతో కర్ణాటకకు వస్తున్న వాహనాలు బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విధించడం కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల పెట్రోల్ బంకుల యజమానులకు వరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగినంతగా తగ్గించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాట్ రూపంలో ఆంధ్రాలో మరింత భారాన్ని రుద్దడంతో ఈ రెండు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దుకు పెట్రోలు, డీజిల్ కోసం భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ ప్రభావంతో పెట్రోల్ లీటరుకు రూ.4 పెరిగింది. గత పరిస్థితులకు భిన్నం ఆంధ్రప్రదేశ్‌లో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ లేదు. దీంతో ధరలు కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు నాలుగు రూపాయలు తక్కువ ఉండేది. దీంతో పదేళ్లపాటు ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని పెట్రోల్ బంకులకు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్లేవి. ప్రస్తుతం ప్రతి లీటరుకు నాలుగు రూపాయలు ఎక్కువగా ఉండడంతో ఏపీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారు క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్లుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో వచ్చి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లుతున్నారు. -
దిగొచ్చిన డీజిల్ ధర
ఒంగోలు: డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా తగ్గడంతో డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయని అందరూ ఊహించారు.అయితే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా పూర్తికావడంతో శనివారం ధరలు తగ్గిస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో మొత్తం 210 పెట్రోలు బంకులున్నాయి. వీటన్నింటి ద్వారా రోజుకు 13 లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. లీటరు డీజిల్ ప్రస్తుతం రూ.63.63గా ఉంది. దీనిపై వ్యాట్‌ను కలుపుకొని లీటరుకు రూ.4.12 తగ్గనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చే ధర రూ.59.51గా ఉండనుంది. దీని ప్రకారం జిల్లాలోని డీజిల్ కొనుగోలుదారులకు రూ.53.56 లక్షల మేర ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీ రోజుకు జిల్లావ్యాప్తంగా 50 వేల లీటర్ల డీజిల్ కొనుగోలు చేస్తోంది. తగ్గిన ధరల ప్రకారం రూ.2.06 లక్షలు మిగలనున్నాయి. -
తెరుచుకోనున్న ప్రైవేటు బంకులు
డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో రెడీ అవుతున్న కంపెనీలు కలిసొస్తున్న ముడి చమురు ధరల తగ్గింపు నాలుగు నెలల్లో 25% తగ్గిన ధరలు ప్రస్తుత ధరలో డీజిల్‌పై లీటరుకు రూ. 3.5 వరకు లాభం గతంలో నష్టాలు తట్టుకోలేక 3,000 ప్రైవేట్ ఔట్లెట్స్ మూసివేత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీజిల్‌పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవడంతో ప్రైవేటు ఆయిల్ రిఫైనరీ కంపెనీలు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీనికి అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడిచమురు ధర కూడా కలిసిరావడంతో గతంలో మూసేసిన ఔట్లెట్లను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నాయి. గత నాలుగు నెలల్లో ముడి చమురు ధరలు 25 శాతం తగ్గడమే కాకుండా రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా కదులుతుండటంతో ఆయిల్ రిటైలింగ్ వ్యాపారంపై ప్రైవేటు కంపెనీలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఎస్సార్ ఆయిల్, మంగళూరు రిఫైనరీలు ఔట్లెట్లను ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించగా, రిలయన్స్ పాత డీలర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సార్ ఆయిల్ వచ్చే మూడేళ్లలో ఔట్లెట్ల సంఖ్యను 1,400 నుంచి 3,000కి పెంచే ఆలోచనలో ఉన్నామని చెప్పగా, ఓఎన్జీసీ అనుబంధ కంపెనీ మంగళూరు రిఫైనరీ ‘టోటల్’ పేరుతో ఈ రంగంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 500 బంకులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. డీజిల్‌పై తొలిగిన నియంత్రణ ఇప్పటిదాకా చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీలు నష్టాలను తట్టుకోలేక మూసేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్, ఎస్సార్ ఆయిల్, షెల్ కంపెనీలు 2008లో సుమారు 3,000 ఔట్లెట్లను కలిగి ఉండగా, వాటిని క్రమంగా మూసివేశాయి. తర్వాత పెట్రోల్, గ్యాస్ ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో కొన్ని బంకులు తిరిగి తెరుచుకున్నాయి. ఇప్పుడు డీజిల్‌పై కూడా నియంత్రణ ఎత్తివేయడంతో భారీ ఎత్తున ఈ రంగంలోకి ప్రవేశించే యోచనలో కంపెనీలున్నాయి. డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు (ఇండియన్ బాస్కెట్) 87 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం డీజిల్‌పై లీటరుకు రూ.3.50 వరకు కంపెనీలకు లాభాలు వస్తాయి. డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో ఈ రంగంలోకి ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున ప్రవేశించడం ద్వారా పోటీ పెరిగి అంతిమంగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఎస్సార్ ఆయిల్ ఎండీ సీఈవో ఎల్.కె.గుప్తా పేర్కొన్నారు. రిలయన్స్ కంపెనీ డీజిల్ ఔట్లెట్లను ప్రారంభించడానికి చర్చలు జరుపుతున్న మాట వాస్తవమే కానీ, కమీషన్‌పైనే ఇంకా తుది నిర్ణయానికి రాలేదని రిలయన్స్ చమురు డీలర్ ‘సాక్షి’తో అన్నారు. వాహనాల అమ్మకాలు పెరగుతుండటంతో డీజిల్, పెట్రోల్‌కు డిమాండ్ బాగుందని, దీంతో ప్రైవేటు కంపెనీలు ప్రవేశించినా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ డీలర్లకు ఎటువంటి నష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పీఎస్‌యూ ఆయిల్ డీలర్ల ప్రెసిడెంట్ ప్రభాకర్ పేర్కొన్నారు. కానీ ప్రైవేటు కంపెనీలకు ఇచ్చే ఔట్లెట్ల సంఖ్య, కమీషన్లపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ కంపెనీలకు చెందినవి 42,000 ఔట్లెట్లు ఉన్నట్లు అంచనా. ముందు ముందు రూపాయి విలువ కూడా బలపడే అవకాశాలు ఉండటం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడంతో ప్రభుత్వ కంపెనీలు కూడా విస్తరణపై దృష్టిసారిస్తున్నాయి. రానున్న కాలంలో కొత్తగా మరో 16,000 ఔట్లెట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బంగారం..ఊరిస్తోంది
అమ్మకాలకు ఫుల్ జోష్ అంటున్న వర్తకులు ధన్‌తేరాస్, దీపావళి అమ్మకాల్లో 15% వృద్ధి అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్లో బంగారం ధర ఊరిస్తోంది. కొంతకాలంగా బంగారం ధర తగ్గుతూ రావడంతో పుత్తడి కొనేందుకు వినియోగదారులు ఉత్సాహంగా ఉన్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర మరికాస్త తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీపావళి నాటికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.25 వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. ఈసారి దీపావళికి బంగారు అభరణాల అమ్మకం ఊపుమీద జరుగుతుందని వర్తకులు ఆశపడుతున్నారు. క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వ నిబంధనలతో కొన్ని నెలలుగా భారత్‌లో బంగారు ఆభరణాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఆభరణాల విపణిలో ధంతేరాస్, దీపావళి పండుగలు కొత్త వెలుగులు జిమ్ముతాయని వ్యాపారులు విశ్వాసంగా ఉన్నారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందస్తుగా కస్టమర్లు బంగారుకడ్డీలను కొని దాచుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు. కడ్డీలకు డిమాండ్ అంతర్జాతీయ మార్కెట్లో 2014 జూలై 10న 10 గ్రాముల బంగారం ధర రూ.25,800 నమోదైంది. అప్పటి నుంచి క్రమేపీ ధర కిందకు వస్తూనే ఉంది. దీంతో ఆభరణాలకు బదులు పుత్తడి కడ్డీలకు డిమాండ్ పెరిగిందని బులియన్ వర్తకులు అంటున్నారు. జూలై నుంచే ఈ ట్రెండ్ పెరుగుతోందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే కడ్డీల అమ్మకాల్లో వృద్ధి 50 శాతం నమోదైందని రిద్ధిసిద్ధి బులియన్స్(ఆర్‌ఎస్‌బీఎల్) ప్రతినిధి జి.శేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ధర తక్కువ కావడం వల్లే కడ్డీల అమ్మకాలు పెరిగాయని, ఇదంతా కస్టమర్ల ముందు జాగ్రత్త చర్యలని ఆయన చెప్పారు. పెళ్లి సమయానికి కడ్డీలను మార్చుకొని మళ్లీ ఆభరణాలను తీసుకుంటారని వివరించారు. సాధారణ కస్టమర్లు మాత్రం ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ధన్‌తేరాస్, దీపావళికల్లా ఈ మార్కెట్ పుంజుకుంటుందని ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్‌పేట్ షోరూం జ్యువెల్లరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ అన్నారు. 15 శాతం దాకా వృద్ధి.. ధన్‌తేరాస్, దీపావళి కోసం ఆభరణాల వర్తకులు రెడీ అవుతున్నారు. దీంతో ముడి బంగారానికి డిమాండ్ పెరగడంతో 10 రోజుల్లో ధర కాస్త పెరిగింది. అయితే పండుగల సీజన్‌కు 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.25 వేలకు వచ్చే అవకాశముందని హైదరాబాద్ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్ స్తబ్దుగా ఉందని, దీపావళికి తిరిగి పుంజుకుంటుందని ఆల్ ఇండియా జెమ్స్ జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే పండుగలకు 15 శాతం దాకా వృద్ధి అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయంగా అక్టోబర్ 3న 10 గ్రాముల ధర కాస్తా రూ.23,400లకు వచ్చి చేరింది. తిరిగి పుంజుకుని సోమవారం (అక్టోబర్ 13) నాడు రూ.24,130 వద్ద ట్రేడైంది. పన్నులు, ప్రీమియం కలిసి ఈ ధర ముంబై మార్కెట్లో రూ.27,115 వద్ద ఉంది. ప్రభుత్వం దిగి వస్తే.. 2012 మార్చిలో బంగారంపై దిగుమతి సుంకం 2 శాతం మాత్రమే. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గణనీయంగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం దిగుమతులకు కళ్లెం వేయడానికి 2013 ఆగస్టులో సుంకాన్ని 10 శాతానికి చేర్చారు. బంగారం భారీ దిగుమతుల కారణంగా 2012-13లో క్యాడ్ చరిత్మ్రాక గరిష్టానికి(4.8 శాతం) ఎగబాకింది. సుంకాల పెంపు ఇతరత్రా ప్రభుత్వ చర్యల కారణంగా 2013-14లో ఇది 1.7 శాతానికి దిగొచ్చింది. ప్రస్తుతం క్యాడ్ కట్టడిలోకి వచ్చింది. ముడి చమురు ధరలు పడిపోవడం, రూపాయి స్థిరంగా ఉండడంతో బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గిస్తుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇదే గనక జరిగితే పసిడి ధరలు మరింత పడిపోవడం ఖాయం. దానికి తగ్గట్టు అమ్మకాలు పెరుగుతాయని వర్తకులు అంటున్నారు. అయితే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతున్నా, చైనా, భారత్ నుంచి మద్దతు లభిస్తుందని చెబుతున్నారు. అవసరం ఉంటే నెమ్మదిగా కొనొచ్చు... అంతర్జాతీయంగా ఇలా... గత కొంత కాలంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు కింది స్థాయిలో ఒక పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర సుమారుగా ఉత్పత్తి ధర వద్ద ట్రేడ్ అవుతుండటం, అంతర్జాతీయంగా ఇంకా ఆర్థిక వ్యవస్థలు పూర్తిస్థాయిలో కోలుకోకపోవడం వంటి విషయాలు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. దీంతో మరికొంత కాలం ఔన్స్ బంగారం ధరలు 1150-1250 డాలర్ల శ్రేణిలోనే కదలొచ్చు. కానీ దీర్ఘకాలంలో బంగారం ధరలు 1,050-1,100 శ్రేణికి వచ్చిన తర్వాతనే తదుపరి దిశను తీసుకుంటుందని అంచనా. దేశీయంగా చూస్తే... ఇక దేశీయంగా చూస్తే బంగారం ధరలు తగ్గే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తుండటంతో ద్రవ్యోలోటు అదుపులోకి వస్తోంది. బ్యారెల్ క్రూడ్ ధరలు 90 డాలర్ల దిగువన మరికొంత కాలం కొనసాగితే ప్రభుత్వం బంగారం దిగుమతులపై పెంచిన పన్నులను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మోదీ ప్రభుత్వ చర్యల వల్ల దీర్ఘకాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే దేశీయంగా బంగారం ధరలు తగ్గుదలనే సూచిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరలు స్వల్పకాలానికి రూ. 26,500 - 27,500 శ్రేణిలో కదులుతాయని అంచనా వేస్తున్నాం. ఇప్పుడేం చేద్దాం? రెండు మూడు నెలల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకోసం బంగారం కొనాలి అనుకునే వాళ్లు ప్రస్తుత ధరలో నెమ్మదిగా కొనచ్చు. అదే దీర్ఘకాలిక అవసరాల కోసమయితే ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున కొనొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే బంగారం ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపించడం లేదు. దీర్ఘకాలంలో బ్యాంకు ఎఫ్డీని మించి రాబడిని ఇచ్చే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. -
పెట్రోల్‌పై రూపాయి తగ్గింపు
అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధర డీజిల్‌పై త్వరలో రూ. 2.50 తగ్గించనున్న కేంద్రం న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిడంతో ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున ధర (స్థానిక పన్నులు మినహాయించి) తగ్గించాయి. తగ్గించిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ధర తగ్గింపుపై చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా బుధవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఒక రోజు ముందే నిర్ణయాన్ని ప్రకటించాయి. ఈ నెలలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి. చమురు సంస్థలు ఈ నెల 1న పెట్రోల్‌పై లీటర్‌కు 54 పైసల చొప్పున ధర తగ్గించాయి. స్థానిక పన్నులతో కలుపుకొని పెట్రోల్ ధర ఢిల్లీలో లీటర్‌కు రూ.1.21 తగ్గి రూ.66.65కి చేరింది. హైదరాబాద్‌లో రూ.74.15 నుంచి రూ. 72.83 కు తగ్గింది. కాగా కేంద్రం డీజిల్ ధరను ఐదేళ్ల వ్యవధిలో తొలిసారి తగ్గించనుంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌న ఉపసంహరించగానే ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 చొప్పున తగ్గించే అవకాశం ఉంది. చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కొడ్ అమల్లో ఉందని...అందువల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. -
శ్రీగంధం.. శ్రీమంతుడు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : చాలామంది రైతులు తక్షణ ఆదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి చూపుతారు. వాటినే పండిస్తుంటారు. కానీ అందరు రైతుల్లా కాకుండా తన కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బహుదూరపు పంట శ్రీగంధం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాడో రైతు. ఆయనే బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన అజ్మీరా శ్రీనివాస్. శ్రీగంధం మొక్కల పెంపకంపై ఆయన మాటల్లోనే.. నాకు లంబాడితండా గ్రామ చిరకలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం శ్రీగంధం మొక్కలు నాటాను. ఈ కర్రకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు రూ.10 లక్షల నుంచి రూ.15.లక్షల వరకు పలుకుతోంది. భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి చదువు, పెళ్లిళ్లకు భవిష్యత్‌లో ఎలాంటి ఢోకా లేదు. గతంలో పత్తి, కంది, తదితర పంటలు సాగు చేశాను. కానీ ఆశించినంతగా లాభం రాలేదు. శ్రీగంధం మొక్కల పెంపకాన్ని నా స్నేహితుడు ప్రోత్సహించాడు. దీంతో ఈ మొక్కల పెంపకంపై దృష్టి సారించాను. ఒక్కో మొక్కను రూ.164 చెల్లించి బెంగళూరు నుంచి 520 మొక్కలు కొనుగోలు చేశాను. మొక్కల కొనుగోలుకు రూ.85.280 వరకు ఖర్చయింది. రవాణా, గుంతలు తవ్వడానికి, కూలీలు తదితర ఖర్చు మరో రూ.55వేల వరకు వచ్చింది. మొక్కలు నాటుకునే ముందు వాటికి ఎరువుగా ఆవుపేడ, యాపపిండి గుంతలో వేసిన. ఏడాదికి ఒకసారి చెట్టు మొదట్లో కిలో యాపపిండి వేస్తా. రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. అటవీశాఖ లెక్కల ప్రకారం ఎకరానికి 580 మొక్కలు నాటు కోవచ్చు. కానీ 520 మొక్కలు నాటిన. 15ఏళ్ల వరకు 30 నుంచి 35 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని మొక్కల అమ్మకందారుడు తెలిపాడు. నేను ఈ చెట్లను 20ఏళ్ల వరకు పెంచాలనుకుంంటున్న. అప్పుడు ప్రతీ మొక్క కనీసం 200 కిలోల వరకు దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఎకరంలో నాటిన 520 మొక్కల నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్న. టన్నుకు రూ.15లక్షల వరకు వచ్చినా రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ధర తగ్గవచ్చు. మరింత పెరగవచ్చు. ఇవన్నీ అంచనా లెక్కలు మాత్రమే. భవిష్యత్ తరాల వారికి మంచి ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీగంధం సాగుపై దృష్టి సారించాను. దీనికి నీరు, విద్యుత్ వంటి సమస్యలేవీ ఉండవు. మొక్కల పెంపకానికి నేల అనువైనదిగా ఉందని మొక్కల విక్రయ కేంద్రం వారు వచ్చి పరిశీలిస్తారు. మొక్కలు నాటే ముందు వారు భూమి స్వభావం, మొక్కలకు అనుకూలంగా ఉందా లేదా అని చూసిన తర్వాతనే మొక్కలు అందజేశారు. మొక్కలు విక్రయించిన వారే భవిష్యత్‌లో కొనుగోలు చేస్తారు. అంతర పంటగా.. శ్రీగంధం మొక్కల మధ్యలో పసుపు, ఆలు, పెసలు వంటివి అంతర పంటగా సాగు చేస్తున్న. ఈ ఏడాది పసుపు పంట విత్తుకున్న. దీని ద్వారా కూడా ఏడాదికి రూ.35 వేల నుంచి రూ.45వేల వరకు ఆదాయం వస్తుంది. బోరు, విద్యుత్ మోటారు సౌకర్యం ఉండడంతో అంతరపంటకు శ్రీకారం చుట్టాను. గత ఏడాది అర ఎకరం భూమిలో పసుపు పండించాను. 5క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.38వేల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా పసుపు సాగు చేసిన. -
బంగారానికి తగ్గిన డిమాండ్
2014 జనవరి-మార్చి మధ్య 190 టన్నులు గతేడాది ఇదే కాలంలో 257 టన్నులు డబ్ల్యూజీసీ తాజా నివేదిక ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2014 మొదటి క్వార్టర్ జనవరి- మార్చి నెలల మధ్య 2013 ఇదే కాలంతో పోల్చితే 26 శాతం పడిపోయింది. ఈ కాలాల మధ్య బంగారం డిమాండ్ 257.5 టన్నుల నుంచి 190.3 టన్నులకు తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి మంగళవారం పేర్కొంది. కరెంట్ అకౌంట్ కట్టడి(సీఏడీ)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతిపై విధించిన అధిక దిగుమతి సుంకాలు, సరఫరాల్లో కట్టడి అంశాలు దీనికి కారణమని నివేదిక పేర్కొంది. డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ఆవిష్కరించిన నివేదిక ముఖ్యాంశాలను సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సోమసుందరం ఇక్కడ తెలిపారు. విలువ రూపంలో చూస్తే, మొదటి త్రైమాసికాల్లో బంగారం డిమాండ్ విలువ 33 శాతం పడిపోయింది. ఇది రూ.73,184 కోట్ల నుంచి రూ. 48,853 కోట్లకు తగ్గింది. దేశీయంగా భారీ సుంకాల వల్ల అంతర్జాతీయ మార్కెట్ రేటుతో పోల్చితే దేశీయంగా ధర దాదాపు 3 వేల వరకూ అధికంగా ఉంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా భారీగా కొనసాగింది. దేశంలో బంగారంపై ఆంక్షల వల్ల ఈ పరిశ్రమపై కొంత ప్రతికూల ప్రభావం కనబడుతోంది. దేశీయంగా ధరల తీవ్రత వల్ల భారతీయులు యూఏఈలో బంగారం కొనుగోళ్లు జరిపి, దేశానికి తీసుకురావడం అధికమైంది. దీనితో యూఏఈలో బంగారం డిమాండ్ 13 శాతం పెరిగింది. క్యూ1లో ఆభరణాల డిమాండ్ విషయానికి వస్తే, ఈ పరిమాణం 9 శాతం తగ్గి 159.5 టన్నుల నుంచి 145.6 టన్నులకు క్షీణించింది. విలువ రూపంలో ఇది 18% పడిపోయి రూ.45,331.2 కోట్ల నుంచి రూ.37,377.8 కోట్లకు తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 54% తగ్గి 98 టన్నుల నుంచి 44.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో రూ.27,852 కోట్ల నుంచి 11,475 కోట్లకు పడింది. మోడీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. బంగారం దిగుమతులపై స్వల్పకాలిక ఆంక్షలు తొలగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. 2014లో బంగారం డిమాండ్ 900 నుంచి 1000 టన్నుల వరకూ నమోదవుతుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా... కాగా ప్రపంచ వ్యాప్తంగా 2014 మొదటి క్వార్టర్లో బంగారం డిమాండ్ దాదాపు స్థిరంగా 1,074.5 టన్నులుగా కొనసాగింది. 2013 ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 1,077.2 టన్నులు. -
వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు
మన్యంలో విసృ్తతంగా వేట బలైపోతున్న వన్యప్రాణులు గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్ : అడవుల్లో కనిపించే అరుదైన ఆలుగులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. ఆలుగు వీపుపై ఉండే పెంకుల్లాంటి చిప్పలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఆలుగుల వేటకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. శరీరంపైన గట్టిగా పొలుసుల మాదిరిగా ఉంటాయి. కిలో చిప్పలకు రూ.3-4 వేలు ధర పలుకుతుంది. ఇదే అంతర్జాతీయ మార్కెట్లో రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇవి పగలంతా నేలలో బొరియల్లో నివసిస్తూ రాత్రి సమయాల్లోఆహారం కోసం బయటికి వస్తుంటాయి. ఇవి సొంతంగా బొరియలు తయారు చేసుకుని వాటిలో నివాసం ఉంటాయి. అయితే ఈ బొరియలను బట్టి వాని నివాసాలను గిరిజనులు గుర్తించి వేటాడుతున్నారు. ఆ బొరియల్లో మంటలు పెడతారు. ఈ పొగకు తాళలేక అవి బయటకురాగానే పట్టుకుంటారు. అంతేకాకుండా బొరియల వద్ద ఉచ్చులు అమర్చడం ద్వారా సైతం వాటిని పట్టుకుంటారు. ఒక్కో ఆలుగుపై 3-5 కిలోల చిప్పలు లభ్యమవుతాయి. ఈ ఆలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష వరకూ ధర ఉంటుందని తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు వాటి కోసం గిరిజనులను మచ్చిక చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న ఈ అరుదైన జీవుతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
పామాయిల్ నిల్..
= ఆరునెలలుగా పత్తాలేని నూనె = రేషన్‌దుకాణాల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు = పట్టింపులేని ఉన్నతాధికారులు సాక్షి,సిటీబ్యూరో: పేదలకు అంత చేస్తున్నాం..ఇంత చేస్తున్నాం..రూ.185కే తొమ్మిదిసరుకులు...ఇక హాయి గా ఉండండి.. అన్న ప్రభుత్వ ఆర్భాటపు నినాదాలు నీటి మూటలవుతున్నాయి. 9 సరుకుల సంగతి దేవుడెరుగు.. ఇస్తున్న సరుకుల్లోనే సర్కారు కోత పెడుతోంది. ఫలితంగా రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కటికాదు..రెండుకాదు..ఆరునెలలుగా పామాయిల్‌ను దుకాణాలకు సరఫరా చేయడం లేదు. ప్రతినెలా డీలర్లు ఆయిల్ కోసం డీడీలు కడుతున్నా పౌరసరఫరాల అధికారులు పామాయిల్‌ను పంపించడం లేదు. దీంతో చేసేదిలేక కార్డుదారులు బహిరంగమార్కెట్లో అధిక ధరలకు పామాయిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలోని 12 సర్కిళ్లలో సుమారు 15లక్షల వరకు తెల్లకార్డుదారులు ఉండగా, ప్రతినెలా కనీసం సగటున 15లక్షల లీటర్ల వరకు పామాయిల్ డిమాండ్ ఉంటుంది. డీలర్లు ప్రతిసారి డీడీలు కడుతున్నప్పటికీ సరఫరా మాత్రం సకాలంలో జరగడం లేదు. అయితే పలుమార్లు ఆలస్యంగా సరఫరావుతున్న పామాయిల్ డీలర్ల చేతివాటంతో పక్కాదారి పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో ఇతర కంపెనీల ధర రూ.58 నుంచి 65 వరకు పలుకుతోంది. బహిరంగమార్కెట్లో వేరుశనగ, సన్‌ఫ్లవర్ నూనె లీటర్ రూ.85 నుంచి 95 పలుకుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పామాయిల్ లీటర్ రూ.40కే లభిస్తుండడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. కొరత వాస్తవమే : డీఎం నెల్లూరు నుంచి తగిన సరఫరా లేకపోవడంతో పామాయిల్ కొరత ఉన్నమాట వాస్తవమేనని సివిల్సప్లై డీఎం లక్ష్మీ అంగీకరించారు. పూర్తిస్థాయి కోటాను త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. ఒక్కోకార్డుకు ఒక ప్యాకెట్ చొప్పున ఈనెల కోటాలో ఇచ్చేలా సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.