నెంబర్ 1 క్వాలిటీయే కావలె
బహిరంగ వేలంతో ఎర్రబంగారానికిపెరుగుతన్న డిమాండ్
చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నుంచే రిమోట్ చేస్తున్న స్మగ్లర్లు
తమిళనాడుకు చెందిన వారే మేస్త్రీలు, కూలీలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న అత్యంత అరుదైన సహజసిద్ధ జీవ ఖనిజం ఎర్రచందనం. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే ఎర్రచందనానికి జిల్లా పెట్టింది పేరు. అందుకే స్మగ్లర్మ కన్ను ఎప్పటి నుంచో శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనంపై పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఎర్రచందనం బహిరంగ వేలాన్ని ప్రవేశ పెట్టడంతో నాణ్యమైన సరుకు కోసం ఎర్రదొంగలు దుంగల కోసం వేటను మరింత ముమ్మరం చేస్తున్నారు.
భాకరాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనాన్ని బహిరంగ వేలం వేయుడంతో అంతర్జాతీయుంగా డిమాండ్ ఏర్పడింది. స్మగ్లర్లు ఇక్కడ పెరిగే ఎర్ర చందనం వృక్షాలను విపరీతంగా నరికివేస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అడవికే వచ్చి నెంబర్ 1 క్వాలిటీ సరుకు తెచ్చే కూలీలకు స్మగ్లర్లు అధిక పారితోషికం ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. గత 20 ఏళ్ల క్రితం ఎర్రచందనం చె ట్లకు ఫారెస్టు శాఖ నెంబర్ ప్లేట్లు వేసింది. ప్రస్తుతం వాటినే కూలీలు నరకి వేస్తుండడంతో ఆ శాఖ ఏమీ చేయాలో దిక్కు తెలియని స్థితిలో ఉంది.
చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచే రిమోట్
చిత్తూరు,కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఎర్రచందనం ఎక్కువగా ఉండడంతో ఈ జిల్లాలకు చెందిన స్మగ్లర్లు అక్కడే ఉంటూ కూలీలను రిమోట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. గతంలో కూలీలు చెట్లను 2 నుంచి 4 అడుగులు వరకు మొదుళ్లు వదలి నరికేవారు. ఇప్పుడు డివూండ్‌తో పాటు క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం వాటిపై కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అరికట్టడంలో విఫలం అరుుందనే చెప్పా లి. సాక్షాత్తు రాష్ట్ర వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడు సొంత జిల్లా వారే ఎర్రచందనం తరలించడంలో సిద ్ధహస్తులు. వీరిని వదలి తమిళనాడులో ఉండే కూలీలకు అవగాహన కల్పించడంపైనా వివుర్శలు వస్తున్నాయి. వేలం లో ఏ గ్రేడ్ ఎర్ర దుంగలు విలువ ఒక్కసారిగా అవూం తం టన్ను ధర రూ.1.40 కోట్లు పలకగా స్మగ్లర్లు టన్ను రూ.60 లక్షలకే సరఫరా చేస్తున్నా రు. దీంతో రాష్ట్రప్రభుత్వం పలు డిపోల్లో ఉన్న ఎర్రచందనం దుంగలకు డ్రెస్సింగ్ చేసి రేణిగుంట డిపోకు తరలించినట్లు సమాచారం .
.
అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాం
అడవికి వెళ్లే వూర్గాల వద్దనే కాపు కాసి అడ్డుకుంటూ, నిరోధించేందుకు కృషి చేస్తున్నాం. గత రెండు నెలల్లోనే సువూరు 10 గ్రూపులను అడవిలోకి వెళ్లక వుుందే నిరోధించాం. అరుుతే పటిష్ట చర్యలు చేపట్టాం. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కూడా చాలా సీరియుస్‌గా ఉంది. - రఘునాథ్, భాకరాపేట ఫారెస్టు రేంజర్