వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు | While the hunter alugulu | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు

Published Fri, Feb 21 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు

వేటగాళ్ల ఉచ్చులో ఆలుగులు

  • మన్యంలో విసృ్తతంగా వేట
  •   బలైపోతున్న వన్యప్రాణులు
  •  గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్ : అడవుల్లో  కనిపించే అరుదైన  ఆలుగులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. ఆలుగు వీపుపై ఉండే పెంకుల్లాంటి చిప్పలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఆలుగుల వేటకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. శరీరంపైన గట్టిగా పొలుసుల మాదిరిగా ఉంటాయి.  కిలో చిప్పలకు రూ.3-4 వేలు ధర పలుకుతుంది. ఇదే అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇవి పగలంతా నేలలో బొరియల్లో నివసిస్తూ రాత్రి సమయాల్లోఆహారం కోసం బయటికి వస్తుంటాయి.

    ఇవి సొంతంగా బొరియలు తయారు చేసుకుని వాటిలో నివాసం ఉంటాయి. అయితే ఈ బొరియలను బట్టి వాని నివాసాలను గిరిజనులు గుర్తించి వేటాడుతున్నారు. ఆ బొరియల్లో మంటలు పెడతారు. ఈ పొగకు తాళలేక అవి బయటకురాగానే పట్టుకుంటారు.  

    అంతేకాకుండా బొరియల వద్ద ఉచ్చులు అమర్చడం ద్వారా సైతం వాటిని పట్టుకుంటారు. ఒక్కో ఆలుగుపై 3-5 కిలోల చిప్పలు లభ్యమవుతాయి. ఈ ఆలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష వరకూ ధర ఉంటుందని తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు వాటి కోసం గిరిజనులను మచ్చిక చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న ఈ అరుదైన జీవుతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement