
శుచి తలాటీ రచించి, దర్శకత్వం వహించిన ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ 40వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌లో జాన్ కాసావెట్ అవార్డును గెలుచుకుంది. హిమాలయన్ బోర్డింగ్ స్కూల్లో చదివే మీరా అనే టీనేజర్ ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే చిత్రం ఇది.
‘నా దృష్టిలో ఇది తల్లీకూతుళ్ల ప్రేమ కథ. అయితే సంక్లిష్టమైన ప్రేమ కథ. ఈ సినిమా ద్వారా రెండు తరాలకు చెందిన మహిళల స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను చెప్పే ప్రయత్నం చేశాం’ అని తన చిత్రం గురించి చెప్పింది శుచి తలాటీ.
జాన్ కాసావెట్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ చరిత్ర సృష్టించింది. మిలియన్ డాలర్‌ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రానికి ఈ అవార్డ్ ఇస్తారు. ప్రముఖ నటులు రిచా చద్దా, అలీ ఫజల్ ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ను నిర్మించారు.
‘ఈ విజయం ఒక కలలా అనిపిస్తోంది. ఎప్పుడో కన్నకల సాకారం అయినట్లుగా అనిపిస్తోంది. ఇది ఒకరి వ్యక్తిగత విజయం కాదు. సమష్టి కృషికి దక్కిన విజయం. ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ నటిగా, నిర్మాతగా ఇది నా విజయం మాత్రమే కాదు వైవిధ్యమైన కథలను రూపొందించడానికి కృషి చేస్తున్న అందరి విజయం’ అంటుంది రిచా చద్దా.‘నా దృష్టిలో ఇది కేవలం అవార్డు కాదు. కథలోని బలానికి దక్కిన గౌరవం’ అంటుంది శుచి తలాటి.
(చదవండి: ఒక్క ఏడాదికే 26 కిలోలు తగ్గాడు..! బాగా చేశారంటూ హీరో హృతిక్ ప్రశంసల జల్లు..)
Comments
Please login to add a commentAdd a comment