The oil companies
-
పెట్రోల్‌పై రూపాయి తగ్గింపు
అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధర డీజిల్‌పై త్వరలో రూ. 2.50 తగ్గించనున్న కేంద్రం న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిడంతో ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున ధర (స్థానిక పన్నులు మినహాయించి) తగ్గించాయి. తగ్గించిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ధర తగ్గింపుపై చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా బుధవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఒక రోజు ముందే నిర్ణయాన్ని ప్రకటించాయి. ఈ నెలలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి. చమురు సంస్థలు ఈ నెల 1న పెట్రోల్‌పై లీటర్‌కు 54 పైసల చొప్పున ధర తగ్గించాయి. స్థానిక పన్నులతో కలుపుకొని పెట్రోల్ ధర ఢిల్లీలో లీటర్‌కు రూ.1.21 తగ్గి రూ.66.65కి చేరింది. హైదరాబాద్‌లో రూ.74.15 నుంచి రూ. 72.83 కు తగ్గింది. కాగా కేంద్రం డీజిల్ ధరను ఐదేళ్ల వ్యవధిలో తొలిసారి తగ్గించనుంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌న ఉపసంహరించగానే ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 చొప్పున తగ్గించే అవకాశం ఉంది. చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కొడ్ అమల్లో ఉందని...అందువల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. -
బెయిల్ వచ్చింది.. ప్రాణం పోయింది
వారణాసి నాగేశ్వరరావు (35) జాతీయ రహదారి చెంతనే సోడా కొట్టు, మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. రెండు వారాల కిందట మద్యం సీసాలతో పోలీసులకు దొరికిపోయాడు. అప్పటి నుంచీ రిమాండులో ఉన్న అతడు బెయిల్ రావడంతో గురువారం సాయంత్రమే తిరిగి వచ్చాడు. శుక్రవారం తెల్లవారకముందే లేచి షాపు తెరవడానికి వచ్చాడు. అదే సమయంలో మంటలు దుకాణాన్ని చుట్టుముట్టడంతో సజీవదహనమయ్యాడు. బెయిల్ రాక పోయినా నాగేశ్వరరావు బతికేవాడని కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు -
భద్రత లేని గ్యాస్ పైపులు
ప్రమాదం జరిగితే భారీ ప్రాణ నష్టం తప్పదు! తాడేపల్లిగూడెం: మీ వంటిం టికే గ్యాస్ వస్తుంది. నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అవుతుంది. ఎంత వాడితే అంతే సొమ్ము చెల్లించవచ్చు. ఇదీ సహజవాయువు, ఎల్పీజీ, లిక్విడ్ హైడ్రోజన్ సరఫరాకు గెయిల్ గ్యాస్ పైపు లైన్లు వేసే సమయంలో చెప్పిన విషయాలు. గ్యాస్ లైను వెళ్లింది. వంట ఇంటికి మాత్రం గ్యాస్ రాలేదు. పైగా, గ్యాస్ పైపులు, గ్యాస్ స్టేషన్ల వద్ద భద్రత చర్యలు నామమాత్రంగానే చేపట్టారు. నగరం గ్రామం వద్ద జరిగిన పెనుప్రమాదం గ్యాస్ లై న్ల భద్రతలో డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న గ్యాస్ స్టేషన్లు, పైపు లైన్ల భద్రత చర్యలపై చర్చ మొదలైంది. ఈ పైపులు జనావాసాల మధ్య నుంచి వెళ్తున్నాయి. ఇవి ఏ కంపెనీ పైపు లైన్లు, వాటి వద్ద తవ్వాలంటే ఎవరిని సంప్రదించాలో తెలుపుతూ బోర్డులు పెట్టారు. కానీ, గ్యాస్ లీకైతే ఏం చేయాలి, ఏ రక్షణ చర్యలు చేపట్టాలనే విషయాలు ఎక్కడా లేవు. తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లికి వెళ్లే రహదారి పక్కన గెయిల్ ఎస్వీ-4 గ్యాస్ స్టేషన్ ఉంది. ఈ పైపులైను పెదతాడేపల్లిలో జనసమ్మర్థం ఎక్కువగా ఉండే మేకల సంత, విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుకనుంచి ఉంది. ఐదేళ్ల క్రితం వ్యవసా య క్షేత్రాలు, జనావాసాల మీదుగా రిలయన్స్ గ్యాస్ పైపులైనును వేశారు. ఇక్కడ కూడా తవ్వకాలు చేపట్టొద్దని చెప్పారు తప్ప ప్రమాదాలపై అవగాహన కల్పించలేదు. -
పొంచి ఉన్న ముప్పు!
విశాఖ నుంచి హైదరాబాద్‌కు సుదీర్ఘ గ్యాస్, పెట్రోలియం పైపులు విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం విశాఖపట్నం నుంచి ప్రస్తుత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వరకు ఉన్న గెయిల్, హెచ్‌పీసీఎల్ పైపులైన్లు ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ భారీ పైపులైన్ల ద్వారా నిరంతరం గ్యాస్, చమురు సరఫరా అవుతాయి. ఇవి ఏళ్ల కిందవి కావడం, ఊళ్లు, గ్రామాలు, పంట పొలాల మధ్య నుంచే వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచు కు వస్తుందోననే భయం ప్రజలను వెంటాడుతోంది. విశాఖ నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు నల్లగొండ జిల్లాల్లోని వందలాది గ్రామాల మీదుగా ఈ పైపులైన్లు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. గెయిల్ సంస్థ విశాఖ నుంచి హైదరాబాద్‌కు 2003లో ఎల్పీజీ పైపులైను నిర్మించింది. 600 కిలోమీటర్ల ఈ పైపులైనుకు సంబంధించి గ్యాస్ పంపింగ్, ప్రెజర్ కంట్రోల్ అంతా విశాఖ నుంచే జరుగుతుంది. ఈ పైపులైనుకు రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపే సామర్థ్యం ఉంది. అంతటి కీలకమైన ఈ పైపులు ఇప్పటికే చాలావరకు పాతబడిపోయాయి. దీనికి సమాంతరంగా హెచ్‌సీపీఎల్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు పెట్రోలియం ఉత్పత్తులను తరలించే మరో పైపులైన్ నిర్మించింది. ఈ రెండు పైపులైన్లు పాతబడి చాలాచోట్ల లీకులు తలెత్తుతున్నాయి. చమురు చోరులు కూడా పైపులైన్ల భద్రతకు ముప్పుగా మారారు. ఇక విశాఖ నగర ప్రజలైతే నిరంతరం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక్కడ స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, ఐవోఎల్ తదితర కంపెనీలు నగరం నడిబొడ్డునే గ్యాస్ పైపులైన్లను నిర్మించాయి. కంపెనీలకు చెందిన రిజర్వు భూముల మీదుగా వెళ్లే ఈ పైపులైన్లు చాలా చోట్ల బలహీనపడి ప్రమాదకరంగా మారాయి. -
మృతుల వివరాలివీ..
వానరాశి శ్రీరాములు (53), వానరాశి ఆదినారాయణ (23), వానరాశి నరసింహమూర్తి (22), తాటికాయల సత్యనారాయణ (44), సత్యనారాయణ కుమార్తె ఏడాది చిన్నారి, రుద్ర నాగవేణి (45), వానరాశి నాగేశ్వరరావు (48), ఘటికంటి కుమారి (60), ఘటికంటి కోకిల (34), సాయిగణేష్ (4), సుజాత (6), మధు (35), గోపిరెడ్డి దివ్యతేజ (23), మాదాల బాలాజీ (16), తాటికాయల లక్ష్మీ జ్యోత్స్నాదేవి (5), 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి. క్షషతగాత్రుల వివరాలు...+ వానరాశి మధుసూదన్ (8), వానరాశి మోహన వెంకట కృష్ణ (7), తాటికాయల రాజ్యలక్ష్మి (20), మహ్మద్ తఖ్వీ (42), కాశి చిన్న (19), రేకపల్లి సత్యనారాయణ (20), బోనం పల్లాలమ్మ (65), వానరాశి వెంకటరత్నం (46), బోనం రత్నకుమారి (35), బోనం పెద్దిరాజు (40), రుద్ర సూరిబాబు (50), వానరాశి సూర్యకుమారి, వానరాశి వెంకటప్రసాద్, బోనం కల్యాణి (18) , రేకపల్లి సత్యవతి (50), బోనం హర్షిత (14), బోనం శాంతకుమారి (12), వానరాశి దుర్గాదేవి (36), వానరాశి వెంకటేశ్వరరావు (32), బోనం పద్మావతి, వాకా సత్యనారాయణ, వాకా పద్మావతి, పి.సుశీల, వానరాశి సత్య, వానరాశి చంటి, మహ్మద్ ఖుర్షీద్ హుస్సేన్, రేకపల్లి సూర్యనారాయణ. -
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
మామిడికుదురు/కాకినాడ క్రైం: గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, చెప్పారు. ఇందులో ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, గెయిల్ నుంచి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. వాటిలో ఐదేసి లక్షల రూపాయలతో ఆయా కుటుంబాలకు శాశ్వత సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందిస్తామన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. శుక్రవారం నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన విషయం తెలియగానే హస్తిన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్‌తో కలిసి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వచ్చి, అక్కడి నుంచి నగరం గ్రామానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కాకినాడ చేరుకొని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీసే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయువు వెలికి తీసే దేశాల్లో పర్యటించి అక్కడ అవలంబిస్తున్న భద్రత చర్యలను పరిశీలిస్తామని, మనదేశంలో కూడా వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంపై విచారణకు హైపవర్ కమిటీని నియమించినట్టు చంద్రబాబు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల ఆవేదన.. చంద్రబాబు తొలుత నగరం గ్రామంలో ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు. ఈ సమయంలో బాధితులు సీఎంను, కేంద్ర మంత్రిని చుట్టుముట్టారు. చమురు సంస్థలు తమ రక్షణను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఓఎన్జీసీ అధికారుల వైఖరి వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం, కేంద్ర మంత్రి తమ ఇళ్లకు రావాలని పట్టుబట్టారు. బాధితుల ఇళ్లకు వారు వెళ్లకపోవడంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ సీఎం పట్టించుకోకుండా వారినుద్దేశించి మాట్లాడారు. ఈ ప్రమాదం విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లానని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు. వైద్య నిపుణులను రప్పిస్తాం: మంత్రి కామినేని కాకినాడలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు హైదరాబాద్ నుంచి నిపుణులైన వైద్యులను రప్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామన్నారు.