
బెయిల్ వచ్చింది.. ప్రాణం పోయింది
వారణాసి నాగేశ్వరరావు (35) జాతీయ రహదారి చెంతనే సోడా కొట్టు, మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. రెండు వారాల కిందట మద్యం సీసాలతో పోలీసులకు దొరికిపోయాడు. అప్పటి నుంచీ రిమాండులో ఉన్న అతడు బెయిల్ రావడంతో గురువారం సాయంత్రమే తిరిగి వచ్చాడు. శుక్రవారం తెల్లవారకముందే లేచి షాపు తెరవడానికి వచ్చాడు. అదే సమయంలో మంటలు దుకాణాన్ని చుట్టుముట్టడంతో సజీవదహనమయ్యాడు. బెయిల్ రాక పోయినా నాగేశ్వరరావు బతికేవాడని కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు