పెట్రోల్ ధర లీటరుకు రూపాయికి పైగా తగ్గే అవకాశం ఉంది. డాలర్‌తో రూపాయి మారక విలువ పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆ మేరకు మన దేశంలో కూడా పెట్రోల్ ధర తగ్గనుంది.
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు రూపాయికి పైగా తగ్గే అవకాశం ఉంది. డాలర్‌తో రూపాయి మారక విలువ పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆ మేరకు మన దేశంలో కూడా పెట్రోల్ ధర తగ్గనుంది. అయితే డీజిల్ ధర మాత్రం ఎప్పటిలాగే 50 పైసలు పెరగనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఈనెల 31న సవరించనున్నాయి. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.61.44 నుంచి రూ.60.50కి పెరిగింది.
అదేసమయంలో అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 118.09 డాలర్ల నుంచి 115.73 డాలర్లకు తగ్గింది. దీంతో ఈ మేరకు పెట్రోల్ ధర తగ్గుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీజిల్ విక్రయాలపై వస్తున్న నష్టాలు పూర్తిగా తొలగిపోయేవరకు ప్రతినెలా 40 పైసల నుంచి 50 పైసల మేర ధర పెంచుకునేందుకు చమురు సంస్థలకు వెసులుబాటు కల్పించిన విషయం విది తమే. ఈ నేపథ్యంలో ఈసారి కూడా డీజిల్ ధర 50 పైసలు పెరగనుంది. చమురు సంస్థలు ఎప్పటిలాగే పెట్రోల్, డీజిల్ ధరలను సవరించుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ స్పష్టంచేశారు