
ఆగస్ట్ 15న పెట్రో రేట్ల తగ్గింపు!
స్వాతంత్య్ర దినోత్సవం రోజు వాహనదారులకు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వల్ల ఆగస్టు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజు వాహనదారులకు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వల్ల ఆగస్టు 15న పెట్రోల్ ధరను తగ్గిస్తూ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)’ నిర్ణయం తీసుకోనుంది. ‘సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి. ధర ఎంత తగ్గించాలి అనే విషయం 15న జరిగే సమావేశంలో నిర్ణయిస్తాం’ అని ఐఓసీ చైర్మన్ బీ అశోక్ మంగళవారం వెల్లడించారు.