చమురు ధరలు మరింత కిందకు..
♦ మంగళవారం 3 శాతం పతనం
లండన్: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింతగా తగ్గుతున్నాయి. మంగళవారం ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 3.5 శాతం వరకూ పతనమై 30.43 డాలర్ల ధరను తాకింది. పదేళ్లలో ఎన్నడూ చూడని ధర ఇదని, ధరలు మరింతగా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు ధరలు 20 శాతం మేర పడిపోయాయి. సరఫరాలు అధికంగా ఉండడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆ దేశ స్టాక్ మార్కెట్ క్షీణించడం, డాలర్ బలపడుతుండడం వంటి కారణాల వల్ల చమురు ధరలు తగ్గుతున్నాయి.