
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న చమురు ధరలతో కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ కోవలో హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన కార్ల ధరలను పెంచేసింది. జూన్ నుంచి 2 శాతం మేర పెంచుతున్నట్టు హ్యుందాయ్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ మినహాయించి దాదాపు అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్టు తెలిపింది.
ఇంధన ధరల పెంపు, పన్నులు, ఇన్‌పుట్ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని హెచ్ఎంఐఐఎల్ డైరెక్టర్ - సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. 9.44 లక్షల రూపాయల ధరలో కొత్తగా లాంచ్ చేసిన హ్యుందాయ్ ఎస్‌యూవీ క్రెటా ధర అన్ని కార్లపై ధరలను పెంచినట్టు చెప్పారు.