vehicle prices
-
కియా కార్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు అమలులోని రానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ముడిసరుకు ధరలు, సరఫరా సంబంధిత వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ధరలను పెంచడం ఈ ఏడాది ఇదే తొలిసారి అని కియా తెలిపింది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల కార్లు, వాహనాల ధరలను పెంచేసింది. వాహన ధరల సగటు పెరుగుదల 0.8 శాతంగా ఉంది. పెరిగిన తయారీ ఖర్చులు, నియంత్రణ వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ మార్చి 23నే ప్రకటించింది. (తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!) అంతకు ముందు జనవరిలో కంపెనీ తమ వాహనాల ధరలను 1.1 శాతం పెంచింది. మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్‌తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి వాహనాలు ఆన్ బోర్డ్ స్వీయ నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఇందుకు గాను ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) కంపెనీ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 1,70,071కి చేరుకున్నాయి. దేశీయ విపణిలో డీలర్లకు వాహనాల సరఫరా 3 శాతం క్షీణించి 1,39,952 యూనిట్లకు చేరుకుంది. ఇక గత నెలలో ఎగుమతులు 14 శాతం పెరిగి 30,119 యూనిట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,52,653 యూనిట్ల నుంచి గతేడాది 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్ల అత్యధిక టోకు విక్రయాలను నమోదు చేసింది. 2022-23 సంవత్సరంలో డొమెస్టిక్ డిస్పాచెస్ 17,06,831 యూనిట్లు కాగా ఎగుమతులు 2,59,333 యూనిట్లు. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) కాగా కంపెనీ విదేశీ ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు మారుతీ సుజుకీ బాలెనో వాహనాన్ని ఎగుమతి చేసి ఈ రికార్డు సాధించిది.1986-87లో మారుతీ సుజుకీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 100 దేశాలకు తమ వాహనాలు ఎగుమతి చేస్తోంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్) -
వాహన రేట్ల పెంపు యోచనలో వీఈసీవీ
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి మరింత కఠినతర ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను 5 శాతం వరకూ పెంచాలని వీఈ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) యోచిస్తోంది. బీఎస్–4, బీఎస్–6 ప్రమాణాలతో పోలిస్తే రేట్ల పెంపు తక్కువ స్థాయిలోనే.. 3–5 శాతం శ్రేణిలో ఉండవచ్చని అనలిస్టులతో సమావేశంలో కంపెనీ ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మోడల్స్‌లో కూడా దశలవారీగా మార్పులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. యూరో–6 ప్రమాణాలకు సరిసమానమైన భారత్ స్టేజ్ 6 (బీఎస్–6) రెండో దశకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దడంపై దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మరింత అధునాతనమైన పరికరాలను ఫోర్ వీలర్లు, వాణిజ్య వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉద్గారాల పరిశీలించేందుకు వాహనంలో సెల్ఫ్–డయాగ్నోస్టిక్ డివైజ్ కూడా ఉండాలి. ఒకవేళ ఉద్గారాలు నిర్దిష్ట స్థాయి దాటితే వార్నింగ్ లైట్ల ద్వారా తక్షణం సర్విసుకు ఇవ్వాలనే సంకేతాలను డివైజ్ పంపుతుంది. -
జనవరి 1 నుంచి హోండా కార్ల ధరల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం హోండా కంపెనీ వచ్చే నెల జనవరి 1 నుంచి భారత్‌లో తన వాహన ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ధరల పెంపు నిర్ణయంపై ఇప్పటికే కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరెన్సీ అనిశ్చితులు, ఉత్పత్తి వ్యయం ఒత్తిళ్లతో కంపెనీ జనవరి నుంచి ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు కంపెనీ డీలర్లు తెలిపారు. తన అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) ద్వారా దేశంలో ఈ కంపెనీ కాంపాక్ట్, సెడాన్, అమెజ్ నుంచి ప్రీమియం ఎస్యూవీ సీఆర్–వీ వరకు పలు వాహనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద అమెజ్ ప్రారంభ ధర రూ.6.17 లక్షలుండగా, ఎంట్రీ లెవల్ సీఆర్వీ ధర రూ.28.71 లక్షలుగా ఉంది. -
పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్
ముంబై, సాక్షి: మార్కెట్లు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఫలితంగా రికార్డ్ గరిష్టాలను తాకాయి. ఈ నేపథ్యంలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) కారణంగా పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మరోపక్క వచ్చే జనవరి 1 నుంచి వివిధ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి పీఎన్బీ కౌంటర్ నష్టాలతో డీలాపడగా..ఎంఅండ్ఎం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం సమావేశమైన మూలధన పెట్టుబడుల సమీకరణ కమిటీ క్విప్ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఇందుకు రూ. 37.35 ఫ్లోర్ ధరను ప్రకటించింది. క్విప్‌లో భాగంగా అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ ఇప్పటికే అనుమతులు పొందింది. అయితే ఫ్లోర్ ధరకు 5 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వబోమని బ్యాంక్ తెలియజేసింది. క్విప్ ధర, షేర్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 8.3 శాతం పతనమై రూ. 37.25ను తాకింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 38.60 వద్ద ట్రేడవుతోంది. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 1 నుంచి ప్రయాణికుల, వాణిజ్య వాహన ధరలను పెంచనున్నట్లు ఎంఅండ్ఎం తాజాగా వెల్లడించింది. ముడిసరుకులు, తదితర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. పెంపు వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు తొలుత ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 746ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. -
మారుతీ కార్ల ధరలు పెంపు..
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని ఇక నుంచి కస్టమర్లకు బదలాయించక తప్పదని, గడిచిన ఏడాది కాలం నుంచి ధరల భారం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని స్టాక్ ఎక్స్చేంజిలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 జనవరి నుంచి పెరిగే ధరలు మోడల్ ఆధారంగా ఉండనున్నట్లు వివరించింది. ప్రస్తుతం సంస్థ ఎంట్రీ లెవెల్ స్మాల్ కార్ ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్ వాహనం ఎక్స్ఎల్6 వరకు విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 2.89 లక్షల నుంచి రూ. 11.47 లక్షల వరకు ఉంది. -
టాటా మోటార్స్ వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన వాహనాల తాలూకు అన్ని మోడళ్ల ధరలనూ వచ్చేనెల నుంచి పెంచుతోంది. ఈ పెంపు 2 నుంచి 2.2 శాతం మధ్య ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పారీఖ్ వెల్లడించారు. వ్యయ నియంత్రణపై కసరత్తు చేస్తున్నప్పటికీ ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు. రూ.2.36 లక్షల నానో నుంచి రూ.17.89 లక్షల ఎస్యూవీ హెక్సా వరకు వివిధ సెగ్మెంట్లలో టాటా మోటార్స్ కార్లను విక్రయిస్తోంది. గడిచిన 28 నెలలుగా తాము ఇండస్ట్రీని మించి వృద్ధి సాధించామని చెప్పారు. -
చమురు సెగ: హ్యుందాయ్ కార్ల ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న చమురు ధరలతో కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ కోవలో హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన కార్ల ధరలను పెంచేసింది. జూన్ నుంచి 2 శాతం మేర పెంచుతున్నట్టు హ్యుందాయ్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన ఎస్యూవీ మినహాయించి దాదాపు అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ఇంధన ధరల పెంపు, పన్నులు, ఇన్పుట్ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని హెచ్ఎంఐఐఎల్ డైరెక్టర్ - సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. 9.44 లక్షల రూపాయల ధరలో కొత్తగా లాంచ్ చేసిన హ్యుందాయ్ ఎస్యూవీ క్రెటా ధర అన్ని కార్లపై ధరలను పెంచినట్టు చెప్పారు. -
పెరగనున్న హోండా కార్ల ధరలు
న్యూఢిల్లీ : ఇయర్-ఎండ్ అమ్మకాల్లో భాగంగా వాహన కంపెనీలన్నీ భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటే.. దానికి భిన్నంగా హోండా కార్స్ ఇండియా తన మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి హోండా కారు మోడల్స్‌పై రూ.25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో, మోడల్స్‌పై ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది. ''జనవరి నుంచి తమ అన్ని మోడల్స్‌పై 1 శాతం నుంచి 2 శాతం వరకు ధరలు పెంచాలని మేము ప్లాన్ చేస్తున్నాం'' అని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అధికార ప్రతినిధి ప్రకటించారు. బేస్ మెటల్స్ వ్యయాలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. హోండా కార్స్ రూ.4.66 లక్షల నుంచి హ్యాచ్‌బ్యాక్ బ్రియోను విక్రయిస్తుండగా.. అకార్డ్ హైబ్రిడ్‌ను రూ.43.21 లక్షలకు విక్రయిస్తోంది. అడ్వెంచర్ యుటిలిటీ వెహికిల్ వీ క్రాస్ మోడల్ రూ.13.31 లక్షలుగా ఉంది.. గత నెలలో స్కోడా ఆటో ఇండియా కూడా జనవరి 1 నుంచి తన వాహనాలపై 2 శాతం నుంచి 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. -
నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
ముంబై : ఎస్టీ ఎఫెక్ట్‌తో వాహన దిగ్గజ కంపెనీలన్ని వరుసపెట్టి తన వాహనాల రేట్లను తగ్గించడంలో క్యూ కడుతున్నాయి. తాజాగా నిస్పాన్ ఇండియా కూడా తన వాహనాలపై రేట్లను తగ్గిస్తున్నట్టుప్రకటించింది. నిస్సాన్ తన ఎక్స్-షోరూమ్ వాహనాల ధరలు సగటున 3 శాతం తగ్గించింది. నిస్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్ర మాట్లాడుతూ, ఆటోమొబైల్ తయారీదారులు, కస్టమర్లకు జీఎస్టీ అమలు సానుకూలమని చెప్పారు. లాభాలను తమ వినియోగదారులకు లాభాలను అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. జూలై 1 జీఎస్టీ పరిధిలో ఆటోమొబైల్స్ ప్రభుత్వం 28 పన్నురేటును నిర్ణయించింది. దీంతో ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్ కంపెనీలు బైక్‌లు,కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఫోర్డ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూలు వంటి కార్ల కంపెనీలు ఇటీవలే కార్ల ధరలు తగ్గుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ మహిమ: దిగొచ్చిన రెనాల్ట్ కార్ల రేట్లు
న్యూఢిల్లీ : జీఎస్టీ మహిమతో రెనాల్ట్ కార్ల రేట్లు కిందకి దిగొచ్చాయి. ఫ్రెంచ్కు చెందిన ఈ కారు దిగ్గజం తమ వాహనాలన్నింటిపైనా భారత్‌లో 7 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్టు నేడు(బుధవారం) ప్రకటించింది. దీంతో రూ.5,200 నుంచి రూ.1.04 లక్షల శ్రేణిలో ధరలు తగ్గాయి. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయాలనే లక్ష్యంతో తాము వాహనాల ధరలను తగ్గించామని రెనాల్ట్ ఇండియా చెప్పింది. రెనాల్ట్ హ్యాచ్ బ్యాక్ క్విడ్ క్లెంబర్ ఏఎంటీ ధరలు రూ.5,200 నుంచి రూ.29,500 మధ్యలో తగ్గగా.. ఎస్యూవీ డస్టర్ ఆర్ఎక్స్జెడ్ ఏడబ్ల్యూడీ ధర రూ.30,400 నుంచి రూ.1,04,700 వరకు తగ్గింది. అదేవిధంగా లాడ్జి స్టెప్‌వే ఆర్ఎక్స్జెడ్ ధర కూడా రూ.25,700 నుంచి రూ.88,600 మధ్యలో కిందకి దిగొచ్చింది. తమ కస్టమర్-ఫస్ట్ విధానం కింద, జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీచేయాలని నిర్ణయించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సావ్నీ ఓ ప్రకటనలో చెప్పారు. జీఎస్టీని అమలుచేయడం ప్రభుత్వ అతిపెద్ద విజయాల్లో ఒకటని ఆయన కొనియాడారు. ఇది వ్యాపారాల్లో అనుకూల వాతావరణ వృద్ధిని నెలకొల్పుతుందన్నారు. మొత్తం వ్యవస్థ ఒకేసారి దీనిలోకి మారడంలో స్వల్పకాలిన కొంత అంతరాయం కలిగే అవకాశముందని, కానీ దీర్ఘకాలికంగా ఇది కార్పొరేట్ ఇండియా, ఆర్థిక వ్యవస్థలో చాలా సానుకూలంగా ఉంటుందని సావ్నీ చెప్పారు. -
ఆడి ధరలు తగ్గాయ్..
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి ఇండియా’ తాజాగా తన వాహన ధరలను రూ.10 లక్షల దాకా తగ్గించింది. డీలర్ల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. వాహన ధరల తగ్గింపు రూ.50,000– రూ.10 లక్షల శ్రేణిలో ఉంది. కాగా ఈ ధరల తగ్గింపు జూన్ వరకు అందుబాటులో ఉండనుంది. -
జనవరి నుంచి ఎంఅండ్ఎం వాహనాలు ప్రియం
న్యూఢిల్లీ: జవవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఎంఅండ్ఎం ప్రకటించింది. పెరి గిన ముడి సరుకుల వ్యయంలో కొంత మేర ధరల పెంపు రూపంలో సర్దుబాటు చేసుకోనున్నట్టు తెలిపింది. ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను 0.5 శాతం నుంచి 1.1 శాతం శ్రేణిలో వచ్చే నెల నుంచి పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. ప్యాసింజర్ వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.3,000 నుంచి రూ.26,000 వరకు పెరగనున్నాయి. చిన్న పాటి వాణిజ్య వాహనాల ధరలు సైతం రూ.1,500 నుంచి రూ.6,000 వరకు పెరుగుతాయి’’ అని ఎంఅండ్ఎం ఆటో విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్షా తెలిపారు. -
ఇప్పుడు బజాజ్ ఆటో వంతు
జనవరి నుంచి రూ.1,500 వరకు వాహన ధరల పెంపు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా వాహన ధరలను రూ.700 నుంచి రూ.1,500 శ్రేణిలో పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ధరలపెంపునకు ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణమని వివరించింది. ‘దేశంలోని టూవీలర్ కంపెనీలన్నీ వాటి వాహనాలను బీఎస్–4 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్నెలను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఇతర కంపెనీల కన్నా ముందే మేమే ఈ మార్క్‌ను చేరుకోవాలని భావిస్తున్నాం’ అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ విభాగం) ఎరిక్ వాస్ తెలిపారు. కొన్ని మోడళ్లను ఇప్పటికే బీఎస్–4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, మిగిలిన వాటిని కూడా వచ్చే నెలలో బీఎస్–4 ప్రమాణాలకు అనువుగా అప్‌గ్రేడ్ చేస్తామని వివరించారు. ఈ అంశం కూడా వాహన ధరలపెంపుపై ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం భారత్‌లో టూవీలర్ వాహనాలు బీఎస్–3 ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. కాగా హ్యుందాయ్, నిస్సాన్, రెనో, టయోటా, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ వంటికంపెనీలు కూడా వాహన ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
టయోటా రేట్లు పెరుగుతున్నాయ్
జనవరి నుంచి 1-3% మధ్య పెంపు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నారుు. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరుగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. ‘స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ వంటి ముడిపదార్థాల ధరలు గత ఆరు నెలలుగా పెరగుతూ వస్తున్నారుు. దీంతో తయారీ వ్యయం బాగా పెరిగింది. దీని వల్ల మేం వాహన ధరలను పెంచాల్సి వస్తోంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ డెరైక్టర్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్.రాజా వివరించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో జపనీస్ కరెన్సీ యెన్ మారకపు విలువ పెరగడం కూడా కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. యెన్ బలపడటం వల్ల జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వాహన విడిభాగాల ధర పెరిగిందని, దీని వల్ల కంపెనీ తయారీ వ్యయంపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు-రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రరుుస్తోంది. -
జీఎం కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్(జీఎం) ఇండియా తాజాగా వాహన ధరలను రూ.51,000 వరకు పెంచింది. బడ్జెట్లో లగ్జరీ ట్యాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ధరల పెంపునకు కారణమని కంపెనీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.3,500-రూ.51,000 శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ధరల పెంపు తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. -
బెంజ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..
రూ. 5 లక్షల వరకూ పెంపు... న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కారు ధరలు పెరగనున్నాయి. మార్చి 15 నుంచి వాహన ధరలను రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు, అదనపు లగ్జరీ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించడ మే కారణమని తెలిపింది. మోడల్‌ను బట్టి ధర పెరుగుదల 3-5%(రూ.లక్ష-5 లక్షలు) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఏ-క్లాస్ నుంచి మేబ్యాక్ వరకు పలు రకాల మోడ ళ్లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ.28 లక్షలు-రూ.1.67 కోట్లు. ప్రభుత్వపు కొత్త పన్నులు, బలహీనమైన రూపాయి, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వంటి తదితర అంశాల కారణంగా కంపెనీపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, అందుకే ధరల్ని పెంచక తప్పడం లేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా చీఫ్ రోనాల్డ్ ఫాల్గెర్ తెలిపారు. కాగా, టాటా మోటార్స్ ఇప్పటికే ప్యాసెంజర్ వాహన ధరలను పెంచింది. హ్యుందాయ్, హోండా కూడా కారు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు
న్యూఢిల్లీ : జనరల్ మోటార్స్ ఇండియా వాహనాల ధరలను మళ్లీ పెంచడానికి రంగం సిద్ధంచేస్తోంది. దీంతో వచ్చే నెల నుంచి కంపెనీకి చెందిన పలు వాహనాల ధరలు 2 శాతంమేర పెరగనున్నాయి. వాహన ధరల పెంపునకు విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదుడుకులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎంట్రీ లెవెల్ కారు స్పార్క్‌తో కలుపుకొని జనరల్ మోటార్స్ దేశంలో ఎనిమిది మోడళ్లను విక్రయిస్తోంది. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియడం వల్ల కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో (జనవరిలో) వాహనాల ధరలను రూ.61,000 వరకూ పెంచిన విషయం తెలిసిందే. -
టాటా మోటార్స్ వాహన ధరలు 1% అప్!
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి ప్రయాణికుల(ప్యాసింజర్) వాహన ధరలను 1%మేర పెంచాలని ఆటో దిగ్గజం టాటా మోటార్స్ యోచిస్తోంది. అయితే వాణిజ్య వాహనాలకు సంబంధించి ధరలను పెంచే విషయంలో మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ విషయంలో నిర్ణయాన్ని తీసుకునేందుకు మరికొంత సమయం వేచి చూడనుంది. వాణిజ్య వాహనాల విషయంలో మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ అవసరమైనప్పుడు ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ప్యాసింజర్ వాహన ధరలను మాత్రం 2014 జనవరి నుంచి 1%మేర పెంచనున్నట్లు చెప్పారు. కంపెనీ నానో, ఇండికా తదితర బ్రాండ్ కార్లతోపాటు, వివిధ రకాల ట్రక్కులు, బస్సులను తయారు చేసే సంగతి తెలిసిందే. కాగా, జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, హోండా, మారుతీ, హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించాయి.