టయోటా రేట్లు పెరుగుతున్నాయ్
జనవరి నుంచి 1-3% మధ్య పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నారుు. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరుగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. ‘స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ వంటి ముడిపదార్థాల ధరలు గత ఆరు నెలలుగా పెరగుతూ వస్తున్నారుు. దీంతో తయారీ వ్యయం బాగా పెరిగింది.
దీని వల్ల మేం వాహన ధరలను పెంచాల్సి వస్తోంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ డెరైక్టర్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్.రాజా వివరించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో జపనీస్ కరెన్సీ యెన్ మారకపు విలువ పెరగడం కూడా కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. యెన్ బలపడటం వల్ల జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వాహన విడిభాగాల ధర పెరిగిందని, దీని వల్ల కంపెనీ తయారీ వ్యయంపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు-రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రరుుస్తోంది.