దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల కార్లు, వాహనాల ధరలను పెంచేసింది. వాహన ధరల సగటు పెరుగుదల 0.8 శాతంగా ఉంది. పెరిగిన తయారీ ఖర్చులు, నియంత్రణ వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ మార్చి 23నే ప్రకటించింది.
(తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!)
అంతకు ముందు జనవరిలో కంపెనీ తమ వాహనాల ధరలను 1.1 శాతం పెంచింది. మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్‌తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి వాహనాలు ఆన్ బోర్డ్ స్వీయ నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఇందుకు గాను ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది.
(The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..)
కంపెనీ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 1,70,071కి చేరుకున్నాయి. దేశీయ విపణిలో డీలర్లకు వాహనాల సరఫరా 3 శాతం క్షీణించి 1,39,952 యూనిట్లకు చేరుకుంది. ఇక గత నెలలో ఎగుమతులు 14 శాతం పెరిగి 30,119 యూనిట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,52,653 యూనిట్ల నుంచి గతేడాది 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్ల అత్యధిక టోకు విక్రయాలను నమోదు చేసింది. 2022-23 సంవత్సరంలో డొమెస్టిక్ డిస్పాచెస్ 17,06,831 యూనిట్లు కాగా ఎగుమతులు 2,59,333 యూనిట్లు.
(వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్‌లోనే కంట్రోలింగ్)
కాగా కంపెనీ విదేశీ ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు మారుతీ సుజుకీ బాలెనో వాహనాన్ని ఎగుమతి చేసి ఈ రికార్డు సాధించిది.1986-87లో మారుతీ సుజుకీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 100 దేశాలకు తమ వాహనాలు ఎగుమతి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment