
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన వాహనాల తాలూకు అన్ని మోడళ్ల ధరలనూ వచ్చేనెల నుంచి పెంచుతోంది. ఈ పెంపు 2 నుంచి 2.2 శాతం మధ్య ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పారీఖ్ వెల్లడించారు. వ్యయ నియంత్రణపై కసరత్తు చేస్తున్నప్పటికీ ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు.
రూ.2.36 లక్షల నానో నుంచి రూ.17.89 లక్షల ఎస్‌యూవీ హెక్సా వరకు వివిధ సెగ్మెంట్లలో టాటా మోటార్స్ కార్లను విక్రయిస్తోంది. గడిచిన 28 నెలలుగా తాము ఇండస్ట్రీని మించి వృద్ధి సాధించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment