స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాల రేట్లను సవరించింది. ఏడాది ఎంసీఎల్‌ఆర్ 0.05 శాతాన్ని (5 బేసిస్ పాయింట్లు) పెంచడంతో 9 శాతానికి చేరింది. గృహ రుణం వంటి దీర్ఘకాల రుణాలకు ఏడాది ఎంసీఎల్‌ఆర్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.
మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్‌నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎంసీఎల్‌ఆర్ రేట్లను ఎస్‌బీఐ రెండుసార్లు పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వ్యయాల పెరుగుదలతో బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment