ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై స్వల్పంగా 5 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచింది. పెరిగిన రేటు జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది.
ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్‌ఆర్ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు. తాజా ఎస్‌బీఐ రుణ రేటు పెంపు రుణ గ్రహీతలపై ఆ మేరకు ఈఎంఐ భారం (ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన) పెరగనుంది. తాజా నిర్ణయం ప్రకారం...
- ఏడాది రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరుగుతుంది.
- ఓవర్‌నైట్ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలవుతాయి.
- ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.45 శాతంగా ఉంటుంది.
- రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ 8.65%కి చేరుతుంది.
- మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment