lending rates
-
ఎస్బీఐ కస్టమర్లకు చేదువార్త.. ఆ లోన్లు మరింత భారం!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా వడ్డీ రేట్లు పెంచడం ఇది వరుసగా మూడో నెల. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చాయి.మూడేళ్ల కాలవ్యవధికి ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) ఇప్పుడు 9.10 శాతానికి పెరిగింది. ఇది ఇంతకుముందు 9% ఉండేది. ఇక ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ గతంలో 8.10 శాతం ఉండగా ఇప్పుడు 8.20% శాతానికి చేరింది. ఎస్బీఐ గత జూన్ నుంచి కొన్ని టెన్యూర్లలో 30 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ను పెంచింది.ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. అంటే దాని కంటే తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకు రుణాలు ఇవ్వదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించే కొన్ని నిర్దిష్ట సందర్భాలలో దీనికి మినహాయింపు ఉంటుంది. రుణ రేట్లను బెంచ్‌మార్కింగ్ చేయడానికి గతంలో ఉపయోగించిన బేస్ రేట్ సిస్టమ్ స్థానంలో 2016 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్: పెరగనున్న ఈఎంఐలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఈఎంఐల భారం పెరగనుంది. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఫ్రేమ్‌వర్క్‌తో ముడిపడి ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి.ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం.. జూన్ 15 నుంచి అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (0.1%) పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.00 శాతం నుంచి 8.10 శాతానికి, నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.గృహ, వాహన రుణాలతో సహా చాలా రిటైల్ రుణాలు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో ముడిపడి ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ ఈల్డ్ వంటి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌లతో ముడిపడి ఉన్న రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంపు ఎలాంటి ప్రభావం చూపదు. -
ఆర్బీఐ కంటే ముందే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని కాలపరిమితుల రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా 0.05 శాతం (ఐదు బేసిస్ పాయింట్లు) పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడచిన ఐదు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లోనూ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5%) పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, హెచ్డీఎఫ్సీ తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి ఎగసింది. కాగా, సాధారణంగా అధిక రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది రుణ రేటు మాత్రం 9.20 శాతం వద్ద స్థిరంగా ఉంది. -
ఎస్బీఐ రుణ రేటు పెంపు.. పెరగనున్న ఈఎంఐ భారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై స్వల్పంగా 5 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచింది. పెరిగిన రేటు జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు. తాజా ఎస్బీఐ రుణ రేటు పెంపు రుణ గ్రహీతలపై ఆ మేరకు ఈఎంఐ భారం (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన) పెరగనుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఏడాది రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలవుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా ఉంటుంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.65%కి చేరుతుంది. మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుంది. -
హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, బీవోఐ రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: గృహ రుణాల ప్రముఖ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీతోపాటు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రుణాల రేట్లను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. కనీస రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును హెచ్డీఎఫ్సీ 0.25 శాతం పెంచి 9.20 శాతానికి చేర్చింది. అయితే, 760 కంటే మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.70 శాతానికే గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. పీఎన్బీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.10% పెంచింది. దీంతో పీఎన్బీ ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.5%కి చేరింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలను ఈ రేటు ఆధారంగానే బ్యాంకు జారీ చేస్తుంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఆర్ఎల్ రేటును 0.10% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ ఎంపీసీ ఫిబ్రవరి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచడం తెలిసిందే. ఇక గతేడాది మే నెల నుంచి చూసుకుంటే మొత్తం పెంపు 2.50 శాతంగా ఉంది. -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
ఐఓబీ రుణ రేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా పెంచింది. అన్ని కాలపరిమితులపై ఈ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 10వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణ రేటుకు ప్రధానంగా ప్రామాణికంగా ఉండే ఏడాది రుణ రేటు 7.45% నుంచి 7.55%కి చేరింది. రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 7.55% కి చేరింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 నుంచి 7.50% శ్రేణిలో ఉన్నాయి. -
నెల వ్యవధిలోనే మరో షాకిచ్చిన ఐసీఐసీఐ
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన వినియోగదారులకు మరోసారి భారీ షాకిచ్చింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 20 బీపీఎస్ పాయింట్లు పెంచింది. పెంచిన రేట్లు నేటి( జూలై 1, 2022) నుంచే అమల్లోకి వచ్చాయి. రుణాలపై వడ్డీ రేట్ల తాజా సవరణతో మూడు నెలల లోపు రుణాలపై వడ్డీరేటు 7.55 శాతం, ఆరు నెలల 7.70 శాతం, వార్షిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. అన్ని కాల వ్యవధి రుణాలపై ఈ పెంపు వర్తిస్తుంది. గత నెలలోనే (జూన్ 1) రుణాలపై వడ్డీరేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ డిపాజిట్, రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపుబాట నేపథ్యంలో... భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన డిపాజిట్, రుణ రేట్లను పెంచింది. మే తొలి వారం తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో ఆర్బీఐ 0.50 శాతం రెపో పెంపు నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... ►ఎంపిక చేసిన కాలపరిమితులకు సంబంధించి రూ. 2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం వరకూ పెరిగాయి. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చింది. ►211 రోజుల నుంచి ఏడాది మధ్య డిపాజిట్ రేటు ప్రస్తుతం 4.40% ఉంటే ఇది 4.60%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం 4.90% వడ్డీరేటు తీసుకుంటుండగా, ఇది 5.10%కి పెరగనుంది. ►ఇక ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్ రేటు 0.20 శాతం పెరిగి 5.30%కి చేరింది. ఈ విభాగంలో సీనియర్ సిటిజన్లు 5.80% వడ్డీ అందుకుంటారు. ►రెండు నుంచి మూడేళ్ల మధ్య వడ్డీరేటు 5.20 శాతం నుంచి 5.35 శాతానికి ఎగసింది. సీనియర్ సిటిజన్లు పొందే రేటు 5.70 శాతం నుంచి 5.85 శాతానికి పెరుగుతుంది. రూ. రెండు కోట్లపైన డిపాజిట్లు దాటితే... రూ.2 కోట్లు ఆపైబడిన డిపాజిట్లకు సంబంధించి వివిధ కాలపరిమితులపై వడ్డీరేటు 0.75%వరకూ పెరిగింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య రేటు 4% నుంచి 4.75%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 4.50% నుంచి 5.25 శాతానికి పెరుగుతుంది. రుణ రేట్ల పెరుగుదల ఇలా.. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. జూన్ 15 నుంచి తాజా పెంపు అమల్లోకి వస్తుంది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలకు దాదాపు ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.20% నుంచి 7.40% కి పెరగనుంది. వెబ్సైట్ ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంచింది. ఐడీబీఐ బ్యాంక్ కూడా... మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్ల దిగువన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లపై 15వ తేదీ నుంచి తాజా పెంపు నిర్ణయం అమలవుతుంది. తాజా నిర్ణయం ప్రకారం, 91 రోజుల నుంచి 6 నెలల మధ్య డిపాజిట్లపై రేటు 3.75% నుంచి 4%కి పెరుగుతుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.60%కి చేరింది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య రేటు 5.60% నుంచి 5.75%కి ఎగసింది. -
హోమ్‌లోన్.. భారంగా మారుతోంది!
నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది. ఎస్బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..? వేచి చూస్తే లాభం లేదు.. వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్‌తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు. రుణ కాలవ్యవధి గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్‌లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా. లోన్ టు వ్యాల్యూ ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం. ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా? కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్బీఎఫ్సీలు టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. . భారం దింపుకోవాలంటే..? కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్‌లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. టాపప్ రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్‌లోన్ తీసుకోవచ్చు. టాపప్‌పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా హోమ్‌లోన్ టాపప్లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి. -
బ్యాంకుల బాదుడు.. పెరుగుతున్న వడ్డీరేట్లు..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన బెంచ్‌మార్క్ లెండింగ్ (రుణాలు) రేట్లను 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈ మేరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంకు సైతం 0.40 శాతం రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనికంటే ముందు ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు ప్రకటించడాన్ని గమనించాలి. అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు గత వారం ప్రకటించడం తెలిసిందే. అలాగే, సీఆర్ఆర్ను 0.50 శాతం పెంచింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై 30 బేసిస్ పాయింట్లు పెంచినట్టు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి 7% నుంచి 7.45 శాతం మధ్య రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి 0.30 శాతం పెంపు అమలవుతుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఈ సంస్థ 6.70–7.15% మధ్య రేట్లను అమలు చేస్తోంది. హెచ్డీఎఫ్సీ తన రుణాలకు మూడు నెలల సైకిల్‌ను అమలు చేస్తుంటుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణాలపై రేట్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సవరణకు గురవుతుంటాయి. ఇండియన్ బ్యాంకు పెంపుబాట.. ఇండియన్ బ్యాంకు రెపో అనుసంధానిత లెండింగ్ రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రెపో రుణాల రేట్లు ఆర్బీఐ రెపో రేటును సవరించిన ప్రతిసారీ మార్పునకు లోనవుతాయి. ‘‘బ్యాంకు అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ రెపో రేటుకు లింక్ అయిన అన్ని రుణాల రేట్లను సమీక్షించింది. రెపో రేటును 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది’’అని ఇండియన్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. -
పీఎన్బీ వినియోగదారులకు దీపావళి షాక్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు చేదు వార్త అందించింది. రుణాలపై వడ్డీరేటును పెంచుతున్నట్టు వెల్లడించింది. తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లను పెంచింది. అన్ని రకాల రుణీలపై ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. నవంబరు 1నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా పెంపుతో పీఎన్బీ అందించే ఒక సంవత్సర కాలపు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.50 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిధి రుణాలపై పీఎన్బీ వసూలు చేసే వడ్డీరేటు 8.7శాతంగాను, ఆరునెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8.45శాతంగాను, మూడు నెలల కాలానికి 8.25శాతం గాను ఉంది. -
రెపో షాక్: ఆ రుణాలు ఇక భారమే
సాక్షి,ముంబై: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో బుధవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గత నాలుగేళ్లలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారి రెపో రేటును పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే 2016 జూన్ లో మానిటరీ పాలసీ ఏర్పడినప్పటి నుంచీ రెపో రేటుపెంచడం ఇదే మొదటిసారి. రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచి దీన్ని 6.25 శాతంగా నిర్ణయించింది. దీనితోపాటు రివర్స్ రెపోను సైతం 0.25 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది. ఆర్బీఐ ఎంపిసి సభ్యులందరూ రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సామాన్య వినియోగదారుడి నెత్తిన రుణ పిడుగు పడగనుంది. కీలక వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. సాధారణ రెండు రోజులకు బదులుగా ఈసారి మూడు రోజులపాటు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. ముడి చమురు ధరల పెరుగుదల, సీపీఐ బలపడుతుండటం వంటి ప్రతికూల అంశాల నడుమ పావు శాతం రెపో రేటు పెంపునకు నిర్ణయించామని ఉర్జిత్ ప్రకటించారు. ఈ బెంచ్‌మార్క్ రేట్లను చివరిసారి జనవరి 2014 లో పెంచారు. రిపో రేటు పెరుగుదల బ్యాంకుల నుంచి రుణాలను తీసునేవారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రెపో రేటు పెంపుతో ఆయా బ్యాంకులు రుణాలపై వడ్డీ పెంచడం ఖాయం. ముఖ్యంగా గృహ రుణ, కారు లేదా, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును పెంచుతాయి. రెపో, రివర్స్ రెపో రేటు అంటే? ఆర్బీఐనుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీరేటు రెపో రేటు. బ్యాంకులు స్వల్పకాలానికి రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు అందుకునే వడ్డీ రివర్స్ రెపో. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ నెలవారీ ద్రవ్య విధాన సమీక్షకు కొద్ది రోజుల ముందే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఐసిఐసిఐ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు ఇప్పటికే రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇది ఆరంభం మాత్రమే ఇది ఇలా ఉంటే ఆర్బీఐ కీలక వడ్డీ రేటు పెంపు క్రమంలో ఇది ఆరంభమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎంపీసీ ప్రకటనకు ముందే రెపో రేటు పెంపును హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. అంతేకాదు 2018 ఆర్థిక సంవత్సరంలో రివర్స్, రెపో రేట్లపై 25 బేసిస్ పాయింట్లు పెంపు రెండుసార్లు వుంటుందని ఉంటుందని పేర్కొంది. ఇదే అభిప్రాయాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ట్విటర్లో వెల్లడించింది. -
అలహాబాద్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్ బ్యాంకు రుణ వడ్డీరేట్లపై గుడ్‌న్యూస్ చెప్పింది. బేస్ రేటును, బెంచ్‌మార్కు ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను 45 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గిస్తున్నట్టు అలహాబాద్ బ్యాంకు పేర్కొంది. దీంతో తక్కువ ఈఎంఐలకు రుణాలకు లభించనున్నాయి. తగ్గింపు నిర్ణయంతో బేస్ రేటు 9.60 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది. బెంచ్‌మార్కు ప్రైమ్ లెండింగ్ రేటు కూడా 13.85 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. బేస్ రేటును, బీపీఎల్ఆర్ను 45 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించాలని బ్యాంకు అసెట్ లైబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించిందని బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమీక్షించిన రేట్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. -
భారీగా పెరగనున్న బ్యాంకుల లెండింగ్ రేట్లు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో దేశంలోని ఇతర బ్యాంకులు అధిక లెండింగ్ రేట్లతో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయా? తాజా పరిణామాలు ఈ అంచనాలకు బలం చేకూర్చుతున్నాయి. ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ కొత్త సవాలు ఎదురు కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. తాజాగా భారత దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బుధవారం తన లెండింగ్ రేట్లలో 10 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించింది. ఇదే బాటను ఇతర ప్రయివేటు బ్యాంకులు అనుసరించనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జూలైనుండి బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల దిగుబడి 100 బీపీఎస్ కంటే ఎక్కువ పెరగడం బ్యాంకులకి పెద్దగా ఆందోళన కలిగించే అంశమనీ ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం బాండ్లకు దెబ్బతీసిందని, ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నబ్యాంకులకు ఇది మరో సవాల్ అని పేర్కొన్నారు. బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో లెండింగ్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ముఖ్య ఆర్థిక అధికారి సౌమ్య కాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో బాండ్ ఈల్డ్స్‌ను పెరుదలను చల్లబర్చేందుకు వడ్డీ రేట్లు పెంపు తప్పదన్నారు. -
గృహ, వాహన రుణాలు ఇక భారమే!
సాక్షి, ముంబై: హోంలోన్లు, వెహికల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. దీనికి రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు తమ కీలక లెండింగ్ రేట్లను పెంచేసిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటను అనుసరించనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో గృహ, కార్లకోసం రుణాలు మరింత భారం కానున్నాయని భావిస్తున్నారు. ముఖ్య ప్రయివేటు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్, ఎస్ బ్యాంకు తమ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించాయి. ఈ పెంపు జనవరినుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశాయి. 2016, ఏప్రిల్ లో కొత్త ఎంసీఎల్ ఆర్ విధానంలోకి ప్రవేశించిన తరువాత ఇదే మొదటి పెంపు అని బ్యాంకులు వివరించాయి. ముఖ్యంగా డిపాజిట్లపై ఎక్కువ వడ్డీరేట్లు చెల్లిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పెంపు తప్పలేదని పేర్కొన్నాయి. ఆర్బీఐ సంకేతాల మేరకు ఎంసీఎల్ఆర్ రేటు ఇంతకంటే కిందిగి దిగివచ్చే అవకాశం లేదని కోటక్ మహీంద్ర జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా వెల్లడించారు. కాగా యాక్సిస్బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 5శాతం పెంచగా, కోటక్‌మహీంద్ర 5-10శాతం, ఎస్‌బ్యాంక్, ఇందస్ బ్యాంకు 10శాతం పెంచాయి. -
హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్ల కోత
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజాలు గృహ కొనుగోలుదారులకు వరుసగా బంపర్ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తాజాగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొ(హెచ్డీఎఫ్సీ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లకోతను హెచ్డీఎఫ్సీ సోమవారం ప్రకటించింది. గృహరుణాలపై వడ్డీరేట్లు 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు రూ. 30 లక్షల వరకు గృహ రుణాల వడ్డీ రేటును 8.35 శాతం గా నిర్ణయించింది. ఇతరులకు ఈ వడ్డీరేటు 8.40 శాతంగా బ్యాంకు ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది. అలాగే ప్రయివేటు బ్యాంక్ మేజర్ ఐసిఐసిఐ కూడా గృహ రుణాలపై 30 బేసిస్ పాయింట్ల కోతను నేడు ప్రకటించింది. -
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
-
జనవరిలోనే వడ్డీరేట్లపై గుడ్ న్యూస్!
ముంబాయి : కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త కార్లు, ఇళ్లు కొనుకోవాలనుకునే వారు శుభవార్త వినిబోతున్నారట. 2017 మొదటినెలలోనే ప్రముఖ అగ్రగామి బ్యాంకులన్నీ వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. ఈ రేట్లు తగ్గించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం ఏర్పడిన నగదు కొరతకు వినియోగత్వం దెబ్బతిన్నది. నిత్యావసరం కాని వస్తువుల కొనుగోళ్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో వినియోగత్వాన్ని పెంచడానికి బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించబోతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి చౌకైన వడ్డీరేట్లు లభించనున్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బీఐ స్పందించడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకి భారీ మొత్తంలో డిపాజిట్లు సమకూరాయి. బ్యాంకుల లిక్విడిటీ కూడా భారీగా పెరిగింది. గతవారం ఇండియన్ బ్యాంకు అసోసియేషన్‌తో భేటీ అయిన బ్యాంకులు వడ్డీరేట్ల కోత విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. దేశీయ అగ్రగామి బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమయ్యే మార్గాలను వారు చర్చించారని, ఆర్థికమంత్రిత్వశాఖతో కూడా రుణాలపై వడ్డీరేట్లు తగ్గించే విషయంపై చర్చించారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. డీమానిటైజేషన్‌తో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్‌ను పునరుద్ధరించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. మరోవైపు డిసెంబర్ 30 తర్వాత కూడా నగదు విత్‌డ్రాలపై విధించిన పరిమితులు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. -
రుణ రేట్లను సవరించిన నాలుగు బ్యాంక్‌లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాయి. రెపో తగ్గిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను 9-9.35% రేంజ్లో నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 3 నెలల కాలానికి 9.2 శాతం,ఆరు నెలల కాలానికి 9.25 శాతం, ఏడాది కాలానికి 9.35 శాతంగా ఎంసీఎల్ఆర్ను నిర్ణయించామని వివరించింది. ఇక సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను 9.3-9.45 శాతంగా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల ఏడు నుంచి వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్ 9.05-9.6% రేంజ్లో ఉంది. ఇది ఈ నెల 1 నుంచే వర్తిస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ ఎంసీఎల్ఆర్ 9.3-9.75% రేంజ్లో ఉంది. ఈ నెల 5 నుంచి ఇది వర్తిస్తుంది. -
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ కోతతో మార్కెట్ వర్గాలను విస్మయ పరిస్తే .. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కీలక పాలసీ రేట్లను తగ్గించిన కొద్ది గంటల్లోనే ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. తామిస్తున్న రుణాలపై 0.05 శాతం మేర వడ్డీ తగ్గిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఎంసీఎల్ ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ రేట్) 8.90 నుంచి 8.85 కి తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వివరించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 9.10 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. అంతేకాదు ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. కాగా ఆర్బీఐ చరిత్రలో తొలిసారిగా మానిటరీ పాలసీ కమిటీ నిర్వహించిన పాలసీ రివ్యూ లో రెపో రేటు పావు శాతం తగ్గించింది. తాజా కోతతో కలిపి జనవరి 2015 నుంచి రెపో రేటు 175 బేసిస్ పాయింట్లను తగ్గించగా బ్యాంకుల బేస్ రేటు 60 బేసిస్ పాయింట్లును తగ్గించింది. రెపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తూ, ఆ ప్రయోజనాన్ని బ్యాంకు ఖాతాదారులకు వెంటనే అందించాలని ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే. -
వడ్డీరేట్లకు ముందుంది మంచికాలం..!
ముంబై : కార్లు, గృహాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ కొనుగోలు చేపట్టిన వారికి శుభవార్త. వీటి కొనుగోలుపై తీసుకున్న రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయట. ఎమర్జింగ్ బాండ్ మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గుతాయనే బలమైన సంకేతాలు వస్తున్నాయి. గత మూడు నెలల్లో, స్వల్పకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు సౌత్ వర్డ్ డ్రిఫ్ట్ లో కదలాడుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం.. గత కొన్ని నెలలుగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎమ్ఓ)లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దూకుడుగా నిర్వర్తించడమే. మార్కెట్లోకి నగదును ఎక్కువగా పంప్ చేయడంతో తేలికగా ద్రవ్య పరిస్థితిలోకి మార్చుకునే అవకాశం కల్పిస్తూ...ఆర్ బీఐ ఆ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీంతో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడితే, షార్ట్ టర్మ్ రేట్లు దిగొస్తాయని చెబుతున్నారు.. దీంతో తక్కువ రేట్లకే రుణాలు లభ్యమవుతాయని అంచనా వేస్తున్నారు. నికర ద్రవ్య అవసరాలు బ్యాకింగ్ సిస్టమ్ లో రూ.1.06 లక్షల కోట్ల నుంచి గత వారంలో రూ.10,361 కోట్లకు పడిపోయాయి. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో కూడా 91 రోజుల ప్రభుత్వ ట్రెజరీ బిల్లు రేట్లు కూడా 6.90శాతం నుంచి 6.50శాతానికి తగ్గాయి. కాల్ మనీ రేట్లు కూడా 6.40 శాతం నుంచి 5.91శాతానికి దిగొచ్చాయి. 80వేల కోట్ల ఓఎమ్ఓ కొనుగోలుతో ఆర్ బీఐ కావాల్సిన తటస్థ ద్రవ్యాన్ని మొదటి త్రైమాసికంలో సాధించిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, క్రెడిట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి తెలిపారు. అదేవిధంగా 2016 జూన్ లో నగదు సర్క్యులేన్ తగ్గించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్విడిటీ సిస్టమాటిక్ మారిన దగ్గర్నుంచి ఎక్కువ ఓఎమ్ఓలు జరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ విశ్వసిస్తోంది. ఒకవేళ ఓఎమ్ఓలను ఆర్ బీఐ ఇలానే కొనసాగిస్తే.. సెప్టెంబర్ కల్లా 50 బేసిస్ పాయింట్లను బ్యాంకు రేట్లలో కోత విధిస్తాయని ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ఇంద్రానిల్ సేన్ గుప్తా అభిప్రాయపడుతున్నారు. -
రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. గృహ, వాహన రుణాలపై గరిష్టంగా ఒక శాతం వరకు, బంగారు రుణాలపై 3.50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయుం తీసుకుంది. పది లక్షలలోపు గృహరుణాలపై ప్రస్తుతం 11.25%గా ఉన్న వడ్డీరేటును బేస్‌రేటుకు సవూనంగా అంటే 10.25%కి తగ్గించింది. పది లక్షల నుంచి రూ. 30 లక్షల లోపు గృహరుణాలపై వడ్డీరేటును ప్రస్తుత స్థారుు 10.50% నుంచి బేస్ రేటుకు సవరించింది. అదే కార్‌లోన్స్ విషయూనికి వస్తే వడ్డీరేట్లు 11.75% నుంచి 10.75 శాతానికి తగ్గారుు. గృహరుణం తీసుకొని సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి కార్లోన్స్పై అదనంగా వురో పావు శాతం తగ్గింపును ఆంధ్రాబ్యాంక్ ఆఫర్ చేస్తోంది. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకునే రుణాలపై వడ్డీరేట్లను 16.5% నుంచి 13%కి తగ్గించింది. తగ్గిన వడ్డీరేట్లు డిసెంబర్ 11 నుంచి అవుల్లోకి వచ్చినట్లు ఆంధ్రాబ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.