సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఫెస్టివ్ సీజన్‌లో వినియోగదారులకు చేదు వార్త అందించింది. రుణాలపై వడ్డీరేటును పెంచుతున్నట్టు వెల్లడించింది. తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లను పెంచింది. అన్ని రకాల రుణీలపై ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. నవంబరు 1నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా పెంపుతో పీఎన్‌బీ అందించే ఒక సంవత్సర కాలపు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.50 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిధి రుణాలపై పీఎన్‌బీ వసూలు చేసే వడ్డీరేటు 8.7శాతంగాను, ఆరునెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8.45శాతంగాను, మూడు నెలల కాలానికి 8.25శాతం గాను ఉంది.
Comments
Please login to add a commentAdd a comment