న్యూఢిల్లీ: గృహ రుణాల ప్రముఖ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీతోపాటు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రుణాల రేట్లను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. కనీస రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును హెచ్‌డీఎఫ్‌సీ 0.25 శాతం పెంచి 9.20 శాతానికి చేర్చింది. అయితే, 760 కంటే మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.70 శాతానికే గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది.
పీఎన్‌బీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 0.10% పెంచింది. దీంతో పీఎన్‌బీ ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.5%కి చేరింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలను ఈ రేటు ఆధారంగానే బ్యాంకు జారీ చేస్తుంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఆర్‌ఎల్ రేటును 0.10% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్‌బీఐ ఎంపీసీ ఫిబ్రవరి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచడం తెలిసిందే. ఇక గతేడాది మే నెల నుంచి చూసుకుంటే మొత్తం పెంపు 2.50 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment