దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఎస్‌బీఐ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా వడ్డీ రేట్లు పెంచడం ఇది వరుసగా మూడో నెల. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చాయి.
మూడేళ్ల కాలవ్యవధికి ఎస్‌బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) ఇప్పుడు 9.10 శాతానికి పెరిగింది. ఇది ఇంతకుముందు 9% ఉండేది. ఇక ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ గతంలో 8.10 శాతం ఉండగా ఇప్పుడు 8.20% శాతానికి చేరింది. ఎస్‌బీఐ గత జూన్ నుంచి కొన్ని టెన్యూర్‌లలో 30 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది.
ఎంసీఎల్‌ఆర్ అనేది ఒక బ్యాంకు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. అంటే దాని కంటే తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకు రుణాలు ఇవ్వదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించే కొన్ని నిర్దిష్ట సందర్భాలలో దీనికి మినహాయింపు ఉంటుంది. రుణ రేట్లను బెంచ్‌మార్కింగ్ చేయడానికి గతంలో ఉపయోగించిన బేస్ రేట్ సిస్టమ్ స్థానంలో 2016 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment