హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్ల కోత | Mortgage leader HDFC lowers lending rates by 30 basis points | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్ల కోత

Published Mon, May 15 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్ల కోత

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్ల కోత

న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకింగ్‌ దిగ‍్గజాలు  గృహ కొనుగోలుదారులకు  వరుసగా బంపర్‌ఆఫర్‌ ప్రకటిస్తున్నాయి. తాజాగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొ(హెచ్‌డీఎఫ్‌సీ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లకోతను హెచ్‌డీఎఫ్‌సీ  సోమవారం ప్రకటించింది.   గృహరుణాలపై వడ్డీరేట్లు 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు రూ. 30 లక్షల వరకు గృహ రుణాల వడ్డీ రేటును 8.35 శాతం గా నిర్ణయించింది. ఇతరులకు ఈ వడ్డీరేటు 8.40 శాతంగా బ్యాంకు  ప్రకటించింది.

 ఇప్పటికే  ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  హోం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది.   అలాగే ప్రయివేటు బ్యాంక్‌ మేజర్‌ ఐసిఐసిఐ   కూడా గృహ రుణాలపై 30 బేసిస్‌  పాయింట్ల కోతను నేడు ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement