lowers
-
యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!
వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్, ‘యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) ద్వారా డబ్బులు సంపాదించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకుందుకు సంబంధించిన అర్హత అవసరాలను సగానికి తగ్గించేసింది.ముఖ్యంగా పేమెంట్ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్ చేసింది. ఇదీ చదవండి: Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్లు ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్స్క్రైబర్లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4,000 వాచ్ హవర్స్, 10 మిలియన్లతో పోలిస్తే ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్ లేదా 3వేలు వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది తెలిసిన సంగతే. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్ నివేదించింది. ఇతర ప్రదేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు. ఇలాంటిమరిన్ని ఆసక్తికర క థనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్ల కోత
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజాలు గృహ కొనుగోలుదారులకు వరుసగా బంపర్ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తాజాగా హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొ(హెచ్డీఎఫ్సీ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లకోతను హెచ్డీఎఫ్సీ సోమవారం ప్రకటించింది. గృహరుణాలపై వడ్డీరేట్లు 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు రూ. 30 లక్షల వరకు గృహ రుణాల వడ్డీ రేటును 8.35 శాతం గా నిర్ణయించింది. ఇతరులకు ఈ వడ్డీరేటు 8.40 శాతంగా బ్యాంకు ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది. అలాగే ప్రయివేటు బ్యాంక్ మేజర్ ఐసిఐసిఐ కూడా గృహ రుణాలపై 30 బేసిస్ పాయింట్ల కోతను నేడు ప్రకటించింది. -
పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
-
పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
ముంబై: పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రిటైర్మెంట్ నిధి సంస్థ, ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) వడ్డీరేట్లలో భారీగా కోత పెట్టింది. సోమవారం బెంగళూరులో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ ట్రస్టీ భేటీలో 2016-17ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతంగా ప్రకటించింది. గత ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుత రేటు ఏడేళ్ల కనిష్టం. దీంతో సుమారు 4 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది. ఈపీఎఫ్ వో కేంద్ర ట్రస్టీల బోర్డు సభ్యులు ప్రస్తుత వడ్డీరేట్లను ఆశించనంతగా పెంచలేదు. కనీసం యధాతథ స్థితిని కూడా కొనసాగించక పోవడంతో ఖాతాదారులు షాకయ్యారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో సంస్థ నిర్ణయం వారిలో భారీ నిరాశను మిగిల్చింది. కాగా 2015-16 సం.రానికిగాను గత ఏడాది 8.7 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.8 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ కోతతో మార్కెట్ వర్గాలను విస్మయ పరిస్తే .. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కీలక పాలసీ రేట్లను తగ్గించిన కొద్ది గంటల్లోనే ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. తామిస్తున్న రుణాలపై 0.05 శాతం మేర వడ్డీ తగ్గిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఎంసీఎల్ ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ రేట్) 8.90 నుంచి 8.85 కి తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వివరించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 9.10 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. అంతేకాదు ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. కాగా ఆర్బీఐ చరిత్రలో తొలిసారిగా మానిటరీ పాలసీ కమిటీ నిర్వహించిన పాలసీ రివ్యూ లో రెపో రేటు పావు శాతం తగ్గించింది. తాజా కోతతో కలిపి జనవరి 2015 నుంచి రెపో రేటు 175 బేసిస్ పాయింట్లను తగ్గించగా బ్యాంకుల బేస్ రేటు 60 బేసిస్ పాయింట్లును తగ్గించింది. రెపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తూ, ఆ ప్రయోజనాన్ని బ్యాంకు ఖాతాదారులకు వెంటనే అందించాలని ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన
గుంటూరు: గుంటూరు జిల్లా కోర్టులో విచారణలు జరగాల్సిన అన్నీ కేసులు ఐదురోజులుగా అటకెక్కాయి. మంగళగిరి న్యాయమూర్తి, గుంటూరు న్యాయవాది మధ్య గురువారం నుంచి జరుగుతున్న వివాదం ముదిరి పాకాన పడింది. గత ఐదు రోజులుగా విధులను బహిష్కరించి నిరసనలు తెలుపుతున్న న్యాయవాదులు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించాలని గుంటూరు బార్ అసోసియేషన్ నిర్ణయించింది.