Good News YouTube Lowers Monetization Eligibility For Creators To Make Money - Sakshi
Sakshi News home page

యూట్యూబర్లకు గుడ్‌ న్యూస్‌, 500 చాలట!

Published Wed, Jun 14 2023 4:34 PM

Good NewsYouTube lowers monetization eligibility for creators to make money - Sakshi

వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌, ‘యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) ద్వారా డబ్బులు సంపాదించేవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. షార్ట్‌ వీడియోస్‌ చేసి డబ్బులు సంపాదించుకుందుకు సంబంధించిన  అర్హత అవసరాలను  సగానికి తగ్గించేసింది.ముఖ్యంగా పేమెంట్‌  చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్‌లతో సహా షార్ట్ వీడియో  క్రియేటర్లకు  మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్‌ చేసింది. 

ఇదీ చదవండి: Adipurush Promotions: స్పెషల్‌ శాలువాతో కృతి సనన్‌, దీని విశేషాలు తెలిస్తే

సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్‌లు ఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా  వెయ్యి  సబ్‌స్క్రైబర్‌లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4,000 వాచ్‌ హవర్స్‌, 10 మిలియన్లతో పోలిస్తే  ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్‌ లేదా  3వేలు వాచ్‌ అవర్స్‌ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు  మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్‌ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనేది  తెలిసిన సంగతే. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్‌ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!)

ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్‌, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్‌ నివేదించింది.  ఇతర ప్రదేశాలలో  కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ  భారత్‌లో ఈ నిబంధన  ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు.

ఇలాంటిమరిన్ని ఆసక్తికర క థనాలు, బిజినెస్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌ 
 

Advertisement
 
Advertisement
 
Advertisement