Short Video
-
పాఠాలు మానేసి ఇన్‌స్టా రీల్స్
లక్నో: స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లు సోషల్ మీడియా రీల్స్‌లో మునిగి తేలుతున్నారు. ఒక టీచర్ కెమెరా ముందు యాక్షన్ చేస్తే, మరో టీచర్ దానిని షూట్ చేయడం, ఇంకో టీచర్ ఎడిటింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లు పోస్టు చేయడం ఇదీ తంతు. అక్కడితో వారు ఆగలేదు. తమ చానెల్‌ను లైక్, షేర్ చేసి సబ్‌స్క్రైబ్ చేయాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది నెలలుగా ఇదే జరుగుతూ వస్తోంది. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లి దండ్రులు ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం)కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘మా టీచర్స్ అంబికా గోయెల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ ప్రతి రోజూ రీల్స్ చేస్తారు. వాటిని లైక్ చేసి షేర్ చేయాలని మాపై ఒత్తిడి తెస్తారు. అలా చేయకపోతే కొడతామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు’’ అని అన్ను అనే విద్యార్థిని తన గోడు చెప్పుకుంది. తమ చేత టీ పెట్టించుకోవడం, వారి కోసం వండి పెట్టడం వంటి పనులు కూడా చేయించుకుంటారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే టీచర్లు ఈ ఆరోపణల్ని కొట్టి పారేశారు. -
యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!
వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్, ‘యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) ద్వారా డబ్బులు సంపాదించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకుందుకు సంబంధించిన అర్హత అవసరాలను సగానికి తగ్గించేసింది.ముఖ్యంగా పేమెంట్ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్ చేసింది. ఇదీ చదవండి: Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్లు ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్స్క్రైబర్లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4,000 వాచ్ హవర్స్, 10 మిలియన్లతో పోలిస్తే ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్ లేదా 3వేలు వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది తెలిసిన సంగతే. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్ నివేదించింది. ఇతర ప్రదేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు. ఇలాంటిమరిన్ని ఆసక్తికర క థనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్.. రూ. 75 వేలు గెలుచుకునే ఛాన్స్
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడిపోయారు. రోజులో కనీసం ఒకటి రెండు గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ట్విట్టర్.. దేన్ని వదలడం లేదు. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ‘రీల్స్ ఫీచర్’ పై జనాలు ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. చిన్నచిన్న వీడియోలు సైతం వైరల్‌గా మారుతున్నాయి. ఇది సామాన్యులను సైతం కంటెంట్ సృష్టికర్తలుగా మార్చేస్తోంది. రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌డమ్‌ను తీసుకొస్తుంది. తాజాగా తెలంగాణ సర్కార్ రీల్స్ చేసే వారికి తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువైతుండటంతో.. తామ కాన్సెప్ట్‌కు తగ్గట్టు ఆకట్టుకునే విధంగా రీల్స్ చేస్తే.. భారీ మొత్తం నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మాదక ద్రవ్యాల వినియోగం, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’’ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, దీనికి బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను తమ రీల్స్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ పోటీ ఉద్దేశం. 18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని తెలిపింది. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. కాగా జూన్ 20లోపు వీడియోలను పంపాల్సి ఉంటుంది.ఈ పోటీలో విజేతలకు బహుమతులు కూడా అందిజచున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 వేల నగదు బహుమతి ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొంది. చదవండి: వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్ -
రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! గవర్నమెంట్ బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వంటి సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రీల్స్ చేసి ఆకట్టుకోగల సత్తా ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేసి ఆకట్టుకున్న వారికి లక్ష బహుమతి అందివ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అందించిన సమాచారం ప్రకారం.. రీల్స్ చేసే వారి కోసం ఒక ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో గెలిచిన వారికి ఒక లక్ష నగదు బహుమతి లభిస్తుంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా చూపరులను ఆకట్టుకునే విధంగా 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ చేసే వీడియోలో @DigitalMediaTS అని ట్యాగ్ చేయాలి. అంతే కాకుండా ఇలాంటి వీడియోలను dir_dm@telangana.gov.in కి కూడా మెయిల్ చేయవచ్చు. ఏప్రిల్ 30 చివరి నాటికి వీడియోలను పంపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. మరిన్ని వివరాలు కోసం https://it.telangana.gov.in/contest/ వెబ్సైట్ సందర్శించవచ్చు. గతంలో డబ్ ష్మాష్, టిక్ టాక్ వంటివి మంచి ట్రెండింగ్‌లో నడిచాయి, అయితే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియోలో, రీల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. రీల్స్ చేస్తూ కాలం గడిపేవారికి ఇది ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి. వీడియోలన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిని తెలియజేయాలి. Great with Reels? Love Hyderabad? Here's something exciting for you! Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS Win cash prizes worth Rs 1,00,000/- Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y — Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023 -
Reels: నయా ట్రెండ్.. ‘రీల్స్’ చుట్టేస్తున్నారు..
కాస్త సృజనాత్మకత.. ఇంకాస్త సరదా.. కలగలిపిన వీడియో ‘రీల్స్’ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న కొన్ని షార్ట్ వీడియోలు వినోదం పంచుతుంటే.. ఇంకొన్ని ప్రజల చెంతకు విజ్ఞానాన్ని చేరుస్తున్నాయి. సరదాగా చేసిన షార్ట్ వీడియో.. షార్ట్ టైమ్‌లో స్టార్లను చేస్తోంది. సాక్షి, అమరావతి: సోషల్ మీడియా సామాన్యులను సైతం కంటెంట్ సృష్టికర్తలుగా మార్చేస్తోంది. చిన్నచిన్న రీల్స్‌లో ‘రియల్ లైఫ్’ డైరెక్షన్ చేయిస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ‘రీల్స్ ఫీచర్’ వినియోగంలో ప్రపంచంతో పోలిస్తే భారతదేశం అగ్రస్థానంలో స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో 230.25 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఉంటే.. ఇందులో ఏకంగా 200 మిలియన్ల ప్రజలు రోజుకు 45 నిమిషాల పాటు షార్ట్ ఫామ్ వీడియోల్లో గడుపుతున్నారు. ఈ సంఖ్య త్వరలో 600 మిలియన్లకు చేరుతుందని ఇన్స్టాగ్రామ్ తన సర్వేలో వెల్లడించింది. కాదేదీ రీల్స్‌కు అనర్హం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇతర వీడియో రీల్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే యువతకు ఎక్కువ శ్రమ, నైపుణ్యం అవసరం లేకుండా చిన్న వీడియోలను రూపొందించడానికి చక్కని వేదికగా మారింది. డబ్బింగ్, రీమిక్స్, సోషల్ ఛాలెంజెస్, షాపింగ్ ప్రమోషన్లు, ప్రతిభా ప్రదర్శనలు, రచులు, అభిరుచులు, డబ్‌స్మాష్‌లు, ఫ్యాషన్, మేకప్, ఆరోగ్య చిట్కాలు, వైద్యం, విద్య, ట్రావెలింగ్ ఇలా.. ఒకటేమిటి కాదేదీ రీల్స్‌కు అనర్హం అన్నట్టు మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విశేషాలను పంచుకునే సమాచార, విజ్ఞాన వేదికగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ గుర్తింపు పొందింది. ప్రతినెలా 200 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు రీల్స్‌లో మునిగితేలుతున్నారు. ఇది 2023 నాటికి 2.5 బిలియన్ యూజర్లకు చేరుకుంటుందని అంచనా. ఇన్స్టాగ్రామ్ ప్రేక్షకుల్లో ఎక్కువ మంది (31.5 శాతం) 25–34 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారు. అత్యధిక డౌన్లోడ్లలో రెండోది 2022లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్‌లలో ఇన్స్టాగ్రామ్ రెండో స్థానంలో నిలిచిందంటే రీల్స్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో 15 సెకన్ల నిడివి నుంచి ఇప్పుడు 90 సెకన్లు వరకు వీడియో రీల్స్ సమయం పెరిగింది. ఇటీవల 15 నిమిషాల్లోపు వీడియోలను కూడా రీల్స్‌గా ఇన్స్టాగ్రామ్ పరిగణిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సాధారణ వీడియో పోస్టింగ్‌ల కంటే రీల్స్ 22 శాతం ఎక్కువగా ఉంటున్నాయి. రీల్స్ ప్రారంభం అయిన తర్వాత బ్రెజిల్లో ఇన్స్టాగ్రామ్ వినియోగం 4.3 శాతం పెరిగింది. 2020లో ప్రారంభమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్ రెండేళ్లలో బిలియన్ల ప్రజలను ఆకట్టుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో 30–50 నిమిషాలు గడుపుతున్నారు. కేవలం రీల్స్ ద్వారా ప్రకటనలు 675.3 మిలియన్ల మందికి వేగంగా చేరుకోగలుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ సగటు వీడియో వీక్షణ రేటు 2.54 శాతం. ఇది సాధారణ వీడియో వీక్షణలతో పోలిస్తే 0.8 శాతం ఎక్కువగా ఉంది. -
యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి అప్డేట్!
సాక్షి, ముంబై: యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి వార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది. ఇది చదవండి: Tata Nexon:సేల్స్‌లో అదరహ! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది టిక్‌టాక్ (మన దేశంలో బ్యాన్) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్డేట్ను తీసు కొచ్చింది. షార్ట్-ఫారమ్వీడియోపై డబ్బు సంపాదించడానికి క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. మారుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్‌లో (సృష్టికర్తలకు) భారీ మద్దతునిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ రారాజు. తన యూజర్లకు ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్ ప్రకటనల ద్వారా 14.2 బిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. -
ఒక్క నిమిషం వీడియో.. ఆస్కార్ ఆవకాశం
సాక్షి,సిటీబ్యూరో: సినిమానే జీవితాశయంగా మార్చుకుని, సినిమా రంగంలో అవకాశాల కోసం వినూత్న శైలిలో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్న నేటి తరం సినిమా ప్రేమికులు ఎందరో... కానీ అలాంటి ఔత్సాహికుల కళను, ఆసక్తిని ప్రదర్శించే వేదిక ఇప్పటి వరకు లేదు. అలాంటి వారి కోసమే దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాల వేదికగా ప్రఖ్యాతిగాంచిన జోష్ యాప్ ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో ఓ వేదికను రూపొందించింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ ఏకంగా ఆస్కార్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడమేకాకుండా అక్కడి సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగం కానుంది. (చదవండి: భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య) చిన్న సినిమా.. పెద్ద వేదిక... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిల్మ్ రూపొందించాలి. దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహాకులు తెలిపారు. రోమ్కామ్, మ్యూజికల్, కామెడీ, యాక్షన్, ఫ్యాషన్ మరేదైనా కథాంశంతో షార్ట్ ఫిల్మ్ రూపొందించి, నవంబర్ 1వ తేదీలోపు జోష్ యాప్‌లో సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఎంట్రీలలోని ఉత్తమమైన షార్ట్ ఫిల్మ్‌ను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తారలు ఫరాఖాన్, కునాల్ కోహ్లీ, ప్రభుదేవాలు వ్యవ్హరిస్తున్నారు. నవంబర్ 12న గోవాలో జరిగే గ్రాండ్ ఫినాలేలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ తారలు వివేక్ ఒబేరాయ్, ఉర్వశి రౌతేల హోస్ట్‌గా.., సునీల్ శెట్టి, అలయా ఎఫ్, డినో మోరియా, సోనియా మెహరా, సోనాలి రౌత్ తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారు. ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ ఆస్కార్ సెలబ్రేషన్స్‌కు వెలుతుందని, అక్కడ జరిగే సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగమవుతుందని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహాకులు తెలిపారు. (చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్!) -
యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్
న్యూఢిల్లీ: టీవీల్లోనూ యూట్యూబ్ వీక్షణం పెరుగుతోంది. మే నెలలో 20 కోట్లకు పైగా కుటుంబాలు టీవీ తెరపై యూట్యూబ్‌ను వీక్షించాయని కంపెనీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదల అని వివరించింది. ‘హిందీ, తెలుగు, తమిళం వంటి దేశీయ భాషల కంటెంట్‌ను ఆస్వాదించే వారి సంఖ్య అధికం అవుతోంది. యూట్యూబ్ వీక్షకుల్లో వీరి వాటా 93 శాతం. యూట్యూబ్‌ను చూసేందుకు మొబైల్ ఫోన్ నుంచి టీవీల వైపు మళ్లుతున్నారు. క్రితంతో పోలిస్తే కోవిడ్–19 సమయంలో యూట్యూబ్‌ను అధికంగా ఆస్వాదిస్తున్నట్టు 85 శాతం మంది వీక్షకులు తెలిపారు. వీడియోల ద్వారా తాము ఆసక్తి ఉన్న విభాగాల్లో నైపుణ్యం పెంచుకున్నట్టు 85 శాతం మంది చెప్పారు. మే నెలలో కెరీర్ సంబంధ వీడియోల వీక్షణ సమయం 60 శాతం పెరిగింది. వ్యవసాయం, ఆర్థిక, ఆహారం, ఇంజనీరింగ్ వంటి విభాగాలు కొత్తగా వృద్ధి చెందుతున్నాయి. సాంకేతికత, సౌందర్యం, హాస్యం వంటి విభాగాల్లో స్థానిక భాషల కంటెంట్ అధికం అవుతోంది. 140 చానెళ్లకు ఒక కోటికిపైగా, 4,000లకుపైగా చానెళ్లకు 10 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. షార్ట్స్ ప్లేయర్లో ప్రపంచవ్యాప్తంగా రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్ వ్యూస్ నమోదవుతున్నాయి’ అని యూట్యూబ్ తెలిపింది. చదవండి : యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి! -
షార్ట్‌వీడియో యూజర్ల జోరు !
రీల్స్, జోష్, మోజ్, రొపోసో వంటి షార్ట్‌వీడియో యాప్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 4–4.5 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని.. 2025 నాటికి ఈ సంఖ్య 65 కోట్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేసింది. కొత్తగా 30 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు చేరడమే ఈ వృద్ధి అంచనాలకు ప్రధాన కారణమని తెలిపింది. ఫేస్బుక్, గూగుల్ వంటి ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌ల తర్వాత ఏడాదిలో వినియోగదారులు క్రియాశీలంగా గడిపిన రెండవ అతిపెద్ద విభాగం షార్ట్వీడియోలేనని పేర్కొంది. యూజర్ల సంఖ్యతో పాటు యాప్స్ వినియోగ సమయం కూడా పెరుగుతుందని పేర్కొంది. -
YouTube Shorts: చేస్తున్నారా.. అయితే..
టిక్..టాక్ దూరమైన తరువాత ఇప్పుడు యూత్ ‘యూట్యూబ్ షార్ట్స్’ వీడియోలపై మనసు పారేసుకుంది. జస్ట్ 60 సెకండ్లలో ‘ఆహా ఏమి క్రియేటివిటీ!’ అనిపిస్తే... మనసు నిండే ప్రశంసలే కాదు, పర్స్ నిండే డబ్బు కూడా మీ సొంతమవుతుంది..... డబ్బు ఉన్న దగ్గరికి మనం వెళతాం. కానీ క్రియేటివిటీ ఉన్న దగ్గరికి డబ్బు వెళుతుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేయకపోవచ్చుగానీ, పర్స్ బరువును పెంచుతుంది. భరోసా ఇస్తుంది! వరల్డ్ బిగ్గెస్ట్ ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ మన దినచర్యల్లో ఒకటి. మన రచ్చబండ కూడా. కాస్తో కూస్తో క్రియేటివిటీ ఉన్న యువతరానికి ఇదొక సువర్ణవేదిక అయింది. ఎందరికో ఎన్నో అవకాశాలు వచ్చాయి. సినిమా తీయడం గొప్ప. అంత పెద్ద సినిమాను నవలగా రాయడం గొప్ప. అంత పెద్ద నవలను కథగా రాయడం గొప్ప. అంత పెద్ద కథను మూడు ముక్కల్లో మినీ కవితగా రాయడం గొప్ప. మాధ్యమం మారుతున్నప్పుడు అచ్చులో అయితే ‘స్థలపరిధి’కి, దృశ్యాల్లో అయితే ‘కాలపరిధి’కి ప్రాధాన్యత ఏర్పడుతుంది. మెరుపు వేగంతో చానల్స్, వీడియోలు మార్చేస్తున్న ఈ కాలంలో ప్రేక్షక మహానుభావుల మనసును క్షణాల్లో దోచేయాలి. ‘అరే ఇదేదో బాగుందే’ అని అక్కడే ఆగిపోవాలి. అదే ‘క్లుప్తత’ గొప్పతనం. అందుకే టిక్.. టాక్ పొట్టి వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. టిక్..టాక్‌ను అచ్చంగా అనుకరిస్తూ కొన్ని బోల్తా పడ్డాయి. కొన్ని ఫరవాలేదనిపించుకున్నాయి. ‘యూట్యూబ్ షార్ట్స్’కు మాత్రం మంచి స్పందన మొదలైంది. ఈ స్పందనను మరోస్థాయికి తీసుకెళ్లడానికి తాజాగా ‘షార్ట్స్ ఫండ్’ ప్రకటించింది యూట్యూబ్. దీని ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా సొమ్ము చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు టిక్... టాక్ లేదు కాబట్టి చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపారు. ‘ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో యూట్యుబ్ సహాయపడుతుంది. మా ప్రయాణంలో షార్ట్ఫండ్స్ అనేది తొలి అడుగు మాత్రమే’ అంటున్నారు యూట్యూబ్ షార్ట్స్ డైరెక్టర్ ఎమీ సింగర్. ఎప్పుడు మొదలవుతుంది? ఎంత సొమ్ము ఇస్తారు..? మొదలైన విషయాలను ఇంకా ప్రకటించనప్పటికీ బహుమతికి అర్హమైన షార్ట్స్ వీడియోల గురించి వస్తే... ప్రేక్షకులను మెప్పించే కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండాలి. బెస్ట్ ఆఫ్ లక్ మరి! మీ కోసం... కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్ సాంకేతిక సహాకారం అందిస్తోంది. కొన్ని టూల్స్... ∙మ్యూజిక్ అండ్ సౌండ్: వీడియోకు ఒక పాట లేదా ఆడియో యాడ్ చేయవచ్చు ∙స్పీడ్: రికార్డింగ్ స్లోడౌన్ చేయడం ∙టైమర్: ఎక్కువ, తక్కువ సమయం తీసుకోకుండా నిర్ణీత సమయంలో ఆటోమెటిక్‌గా రికార్డింగ్ ఆగిపోవడం ∙యాడ్ క్లిప్స్ ఫ్రమ్ ఫోన్ గ్యాలరీ ∙బేసిక్ ఫిల్టర్లు -
గూగుల్‌లో సరికొత్త ఫీచర్
గూగుల్ ఈ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ లో భాగంగా ఇన్స్టాగ్రాం, టిక్‌టాక్ షార్ట్ వీడియోలను తన గూగుల్ సెర్చ్ లో తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సెర్చ్ రిజల్ట్‌లో కనిపించే వెబ్సైట్ల జాబితాపైన షార్ట్ వీడియోలు కనిపించేలా తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లు అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.(చదవండి: రియల్మీ వి15 వచ్చేస్తుంది!) ప్రస్తుతం గూగుల్ తీసుకొస్తున్న ఈ షార్ట్ వీడియో ఫీచర్... గతంలో తీసుకొచ్చిన గూగుల్ స్టోరీస్‌కు ఎటువంటి పోలిక లేదని పేర్కొంది. ఇప్పటి వరకు యూట్యూబ్, టాంగీ, ట్రెల్ల నుంచి మాత్రమే షార్ట్ వీడియోలను మాత్రమే తీసుకునేవారు. తాజాగా వచ్చిన ఫీచర్ ద్వారా ఇన్స్టాగ్రాం, టిక్‌టాక్‌ల షార్ట్ వీడియోలు కనిపించేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోలను క్లిక్ చేస్తే వెబ్‌వెర్షన్‌లో మాత్రమే ఓపెన్ అవుతాయి. దానివల్ల యూజర్ యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని గూగుల్ భావిస్తోందట. గూగుల్ డీస్కవర్ ఫీడ్ యూజర్ యొక్క ఆసక్తుల ఆధారంగా కంటెంట్‌ను చూపుతుంది. ఈ ఫీడ్‌లో కంపెనీ చిన్న వీడియోలను చూపించడం ఇదే మొదటిసారి. -
టిక్‌టాక్‌పై వేటు.. లోకల్ ‘జోష్’!
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌లకు ఊహించని అవకాశం తలుపుతట్టినట్టయింది. టిక్‌టాక్‌కు ఉన్న భారీ యూజర్లను సొంతం చేసుకునేందుకు చాలా సంస్థలు వేగంగా ఈ మార్కెట్ వైపు అడుగులు వేశాయి. షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లను (స్వల్ప కాల నిడివితో కూడిన వీడియోలను సృష్టించి ఇతర యూజర్లతో పంచుకునే వేదికలు) తీసుకురావడమే కాదు.. వీటిల్లో కొన్ని విజయాన్ని సాధించడం 2020లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. దేశీయ వినియోగదారుల డేటా రక్షణ, దేశ భద్రతతోపాటు, చైనా ద్వంద్వ వ్యవహారశైలికి తగిన చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది చైనా మద్దతు కలిగిన యాప్‌లను ఈ ఏడాది నిషేధ జాబితాలో పెట్టేసింది. అందులో భాగంగానే టిక్‌టాప్‌పై జూన్‌లో వేటు పడింది. టిక్‌టాక్‌కు యూజర్లు భారీగా జత కూడుతున్న తరుణంలో ఈ నిషేధం ఆ సంస్థకు మింగుడుపడలేదు. కానీ, ఇది కొత్త వేదికలకు ప్రాణం పోసింది. డైలీహంట్‌కు చెందిన ‘జోష్’ యాప్ సహా దేశీయ షార్ట్ వీడియో యాప్‌లు 40% వాటాను ఇప్పటికే సొంతం చేసుకున్నట్టు బెంగళూరుకు చెందిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికలో వెల్లడించింది. నాలుగు రెట్ల వృద్ధి.. 2020 జూన్‌లో నిషేధం విధించే నాటికి చైనాకు చెందిన టిక్‌టాక్ (బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్)కు 16.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కానీ, సరిగ్గా అంతకు రెండేళ్ల క్రితం నాటికి 2018 జూన్ వరకు.. ఈ సంస్థకు 8.5 కోట్ల వినియోగదారులే ఉండడం గమనార్హం. రెండేళ్లలోనే యూజర్లను రెట్టింపు చేసుకుని వేగంగా దూసుకుపోతున్న టిక్‌టాక్‌కు బ్రేక్ పడింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికల కోసం యూజర్ల అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో జోష్, ఎమ్ఎక్స్ టకాటక్, రోపోసో, చింగారి, మోజ్ మైట్రాన్, ట్రెల్ ఇలా ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి. షార్ట్ వీడియో మార్కెట్‌పై దిగ్గజ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్ కూడా ఆశపడ్డాయి. ఫలితంగా రీల్స్ పేరుతో ఫేస్బుక్, షార్ట్స్ పేరుతో యూట్యూబ్ సంస్థలు కొత్త వేదికలను తీసుకొచ్చాయి. టిక్‌టాక్ మార్కెట్ వాటాలో 40 శాతాన్ని భారత ప్లాట్‌ఫామ్‌లు సొంతం చేసుకున్నట్టు రెడ్‌సీర్ సంస్థ తెలిపింది. ఇందులో జోష్ ముందంజలో ఉందని.. నాణ్యమైన కంటెంట్, విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ జోష్ బలాలుగా పేర్కొంది. ‘‘భారత సంస్థలు ప్రతి రోజూ తాజా నాణ్యమైన సమాచారాన్ని ఆఫర్ చేయగలవు. దీంతో షార్ట్ వీడియో మార్కెట్ వచ్చే ఐదేళ్లలో నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందుతుంది’’ అని రెడ్‌సీర్ సీఈవో అనిల్ కుమార్ ప్రకటించారు. విస్తరణపై చూపు.. ఇన్‌మొబి గ్రూప్ సబ్సిడరీ సంస్థ, రొపోసో యజమాని అయిన గ్లాన్స్ ఈ వారంలోనే 145 మిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్, మిత్రిల్ క్యాపిటల్ నుంచి సమీకరించడం ద్వారా మరింత విస్తరించే ప్రణాళికలతో ఉండడం గమనార్హం. గ్లాన్స్, రోపోసో ప్లాట్ఫామ్ల్లో మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతోపాటు ఆర్టిïఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రొపోసోను గ్లాన్స్ గత ఏడాది బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ వినియోగించే వారు 60 కోట్ల మంది ఉండగా.. ఇందులో షార్ట్ వీడియో కంటెంట్‌ను 45 శాతం మంది (27 కోట్లు) వినియోగిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంటర్నెట్ యూజర్లు 60 కోట్ల నుంచి 97 కోట్లకు పెరగనున్నారు. స్వల్పకాల నిడివితో కూడిన కంటెంట్ మార్కెట్ 4 రెట్లు వృద్ది చెందుతుంది. ప్రస్తుతం నెలవారీగా 110 బిలియన్ నిమిషాలను వీటిపై వెచ్చిస్తుండగా.. 400–500 బిలియన్ నిమిషాలకు విస్తరిస్తుంది’’ అంటూ రెడ్‌సీర్ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఒకవేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసినట్టయితే పరిస్థితుల విషయంలో పలు ప్రశ్నలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయని రెడ్‌సీర్ పేర్కొంది. -
సుకుమార్ దర్శకత్వంలో షార్ట్ వీడియో
ఆగస్టు 15... మన భారతీయులకు నిజమైన పండగ రోజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన వీరులను స్మరించుకోవాల్సిన రోజు. అంత ముఖ్యమైన రోజున తన వంతుగా ఏదైనా చేయా లనుకున్నారు అల్లు అర్జున్. అందుకే ఓ షార్ట్ వీడియోను నిర్మిస్తూ, నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. సమాజం పట్ల ఎలాంటి బాధ్యత ఉండాలి? సమాజ శ్రేయస్సు కోసం ఏం చేస్తే బాగుంటుంది? అనే విషయాలను ఈ వీడియోలో చూపించనున్నారు. దీనికి అమోల్ రాథోడ్ చాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు. సమాజం మేలు కోరి ఇలా ఓ హీరో స్వచ్ఛందంగా ఓ ప్రయత్నం చేయడం బహుశా దక్షిణాదిన ఇదే ప్రథమం అని చెప్పొచ్చు.