గూగుల్ ఈ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ లో భాగంగా ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్ షార్ట్ వీడియోలను తన గూగుల్ సెర్చ్ లో తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సెర్చ్ రిజల్ట్‌లో కనిపించే వెబ్‌సైట్‌ల జాబితాపైన షార్ట్ వీడియోలు కనిపించేలా తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లు అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.(చదవండి: రియల్‌మీ వి15 వచ్చేస్తుంది!)
ప్రస్తుతం గూగుల్ తీసుకొస్తున్న ఈ షార్ట్ వీడియో ఫీచర్... గతంలో తీసుకొచ్చిన గూగుల్ స్టోరీస్‌కు ఎటువంటి పోలిక లేదని పేర్కొంది. ఇప్పటి వరకు యూట్యూబ్, టాంగీ, ట్రెల్‌ల నుంచి మాత్రమే షార్ట్ వీడియోలను మాత్రమే తీసుకునేవారు. తాజాగా వచ్చిన ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌ల షార్ట్ వీడియోలు కనిపించేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోలను క్లిక్ చేస్తే వెబ్‌వెర్షన్‌లో మాత్రమే ఓపెన్ అవుతాయి. దానివల్ల యూజర్ యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని గూగుల్ భావిస్తోందట. గూగుల్ డీస్కవర్ ఫీడ్ యూజర్ యొక్క ఆసక్తుల ఆధారంగా కంటెంట్‌ను చూపుతుంది. ఈ ఫీడ్‌లో కంపెనీ చిన్న వీడియోలను చూపించడం ఇదే మొదటిసారి.
Comments
Please login to add a commentAdd a comment