లక్నో: స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లు సోషల్ మీడియా రీల్స్‌లో మునిగి తేలుతున్నారు. ఒక టీచర్ కెమెరా ముందు యాక్షన్ చేస్తే, మరో టీచర్ దానిని షూట్ చేయడం, ఇంకో టీచర్ ఎడిటింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లు పోస్టు చేయడం ఇదీ తంతు. అక్కడితో వారు ఆగలేదు. తమ చానెల్‌ను లైక్, షేర్ చేసి సబ్‌స్క్రైబ్ చేయాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది నెలలుగా ఇదే జరుగుతూ వస్తోంది.
దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లి దండ్రులు ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం)కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘‘మా టీచర్స్ అంబికా గోయెల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ ప్రతి రోజూ రీల్స్ చేస్తారు. వాటిని లైక్ చేసి షేర్ చేయాలని మాపై ఒత్తిడి తెస్తారు. అలా చేయకపోతే కొడతామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు’’ అని అన్ను అనే విద్యార్థిని తన గోడు చెప్పుకుంది. తమ చేత టీ పెట్టించుకోవడం, వారి కోసం వండి పెట్టడం వంటి పనులు కూడా చేయించుకుంటారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే టీచర్లు ఈ ఆరోపణల్ని కొట్టి పారేశారు.
Comments
Please login to add a commentAdd a comment