
ప్రాంతీయంగా ఆదరణ
షేర్‌చాట్ సీఎఫ్‌వో చరణ్
న్యూఢిల్లీ: భారత్‌లో స్వల్ప నిడివి వీడియోలకు (షార్ట్ వీడియోలు) బూమింగ్ ఇప్పుడే మొదలైందని షేర్‌చాట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మనోహర్‌సింగ్ చరణ్ పేర్కొన్నారు. సృజనాత్మకతతో కూడిన స్థానిక కంటెంట్‌ను చిన్న పట్టణాల్లోనూ ఆదరిస్తుండడం డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు.
ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన విభిన్నమైన సేవలు స్థిరమైన డిమాండ్‌కు దోహపడుతున్నట్టు, ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు బ్రాండ్లకు కొత్త అవకాశాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. దేశ జనాభాలో ఇంటర్నెట్ చేరువ 60%కి వచి్చనట్టు, 65 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన వారు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు.
లాభాలకు చేరువలో..: కన్సాలిడేటెడ్ స్థాయిలో ఎబిటా పాజిటివ్‌కు కంపెనీ చేరువలో షేర్ చాట్ ఉన్నట్టు చరణ్ తెలిపారు. లాభాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో నియామకాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గూగుల్ మద్దతుతో నడుస్తున్న షేర్‌చాట్ వచ్చే రెండేళ్లలో ఐపీవోకు వచ్చే ప్రణాళికలతో ఉంది. ఆదాయంలో 33% వృద్ధిని సాధించగా, నష్టాలు మూడింట ఒక వంతుకు తగ్గిపోయినట్టు ప్రకటించారు. స్టాండలోన్ ప్రాతిపదికన షేర్‌చాట్ ఎబిటా స్థాయిలో లాభాల్లోకి వచి్చనట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment