Financial officer
-
మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్
కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఏం జరిగిందంటే?..సౌత్ చైనాలోని హంకాంగ్‌కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్ చేసి చూపించాడు. అతను హాంకాంగ్‌లోని అమోలి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు. అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే బెటర్‌గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్, వాకింగ్ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్, భారత్ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు. అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్‌లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్ ఫంక్షన్ టెక్నిక్‌ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్ తింటానని చెప్పారు. అలాగే లంచ్, డిన్నర్లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు. చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్‌లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్‌ని కట్టడి చేశారు రవిచంద్ర. (చదవండి: చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..) -
కెనడాలో హువావే సీఎఫ్‌వో అరెస్ట్
ఒటావా: చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా హువావే నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని తెలియవచ్చింది. మెంగ్ వాంఝూను అప్పగించాల్సిందిగా అమెరికా కోరుతోందని, ఆమె బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుందని కెనడా న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా... ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టే విధంగా చైనా వ్యవహరిస్తోందని, దీన్ని తాము చూస్తూ కూర్చోబోమని అమెరికా సెనేటర్ బెన్ సాసీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తద్వారా వాంఝూ అరెస్ట్ వెనుక ఇరాన్ కోణం ఉన్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. అటు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా చట్టాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని హువావే పేర్కొంది. ఈ మధ్యే వాణిజ్య యుద్ధాలపై తాత్కాలిక సంధి కుదుర్చుకున్న చైనా, అమెరికా మధ్య ఈ పరిణామంతో మరోసారి అగ్గి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరిన రోజు డిసెంబర్ 1వ తేదీ నాడే వాంఝూను కెనడాలో అరెస్ట్ చేశారు. మెంగ్‌ను తక్షణం విడుదల చేయాలంటూ కెనడాలోని చైనా దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. సంధి చర్యలు సత్వరం అమలుపై చైనా దృష్టి.. అమెరికాతో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి చర్యలను సత్వరం అమలు చేయనున్నట్లు చైనా వెల్లడించింది. నిర్దేశిత 90 రోజుల్లోగా డీల్ కుదుర్చుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. సుంకాలపరమైన పోరుతో వాణిజ్య యుద్ధానికి దారి తీసిన వివాదాల పరిష్కారానికి ఇరు దేశాలు 90 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. సంధి ఒప్పందం ప్రకారం గడువు తీరేదాకా 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలను 25 శాతానికి పెంచకుండా 10% స్థాయిలోనే అమెరికా కొనసాగించనుంది. అటు చైనా తన వంతుగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు మరి న్ని అమెరికన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుంది. -
ఏం.. తమాషాలు చేస్తున్నారా?
♦ ఆర్థిక శాఖ అధికారిపై సీఎం చంద్రబాబు శివాలు ♦ కాంట్రాక్టర్ల బిల్లులపై కొర్రీలు వేయడం పట్ల అసహనం సాక్షి, హైదరాబాద్: ‘‘ఏం.. పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? ప్రతి ఫైల్లో ఇష్టానుసారంగా రాస్తారా.. ఇలాగైతే పరిపాలన ఎలా చేయాలి?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారిపై నోరుపారేసుకున్నారు.ఆ అధికారి చేసిన తప్పల్లా... బడ్జెట్లో కేటాయింపులు లేని బిల్లులను చెల్లించేందుకు నిరాకరించడమే. ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా సీఎం చెప్పిన వారికి దోచిపెట్టేందుకు అధికారులు సిద్ధంగా లేరు. కాంట్రాక్టర్లకు బిల్లులను ఇష్టారాజ్యంగా చెల్లించేందుకు ఆర్థికశాఖ విముఖత వ్యక్తం చేస్తోంది.ఇది చంద్రబాబుకు రుచించడం లేదు. పోలవరం, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ఫైళ్లకు ఇద్దరు సీఎస్‌లు అడ్డుతగలడంతో ఆయన రగిలిపోతున్నారు. బిల్లులు వస్తేనే ‘ముఖ్య’ నేతకు కమీషన్లు ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనుంది. కాంట్రాక్టర్లతోపాటు అన్ని శాఖలకు బిల్లుల చెల్లింపులను ఆర్థికశాఖ నిలిపివేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే గానీ ‘ముఖ్య’ నేతకు కమీషన్లు ముట్టవు. ఈ నేపథ్యంలో శనివారం ఆర్థిక శాఖ అధికారిని సీఎం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు.ఆ అధికారిని చూడగానే తిట్ల దండకం అందుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం తీరు చూసిన ఆయన కార్యాలయ ఉన్నతాధికారి కూడా కంగుతిన్నారు. ఇక ఆర్థిక శాఖ అధికారికైతే నోట మాట రాలేదు. ఇబ్బందులొస్తే ఎవరు జవాబుదారీ? ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనుండడంతో పనులకు సంబంధించిన బిల్లులను ఆలోగా పొందాలని కాంట్రాక్టర్లు ఆత్రుత పడుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు లేని బిల్లులను చెల్లించేందుకు ఆర్థిక శాఖ ససేమిరా అంటోంది. కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని సీఎం చెవిన వేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సాగునీటి శాఖ ఫైళ్లను ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన నేపథ్యంలో పలు శాఖల ఉన్నతాధికారులూ నిబంధనల మేరకే ఫైళ్లను ఆమోదిస్తున్నారు. నిబంధనలను సడలించుకోవాల్సి ఉంటే ఆ పని ముఖ్యమంత్రి చేసుకోవాలని, అలా కాకుండా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఫలితం ఉండదనే భావన ఉన్నతాధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.