కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్.
ఏం జరిగిందంటే?..సౌత్ చైనాలోని హంకాంగ్‌కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్ చేసి చూపించాడు. అతను హాంకాంగ్‌లోని అమోలి ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు.
అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే బెటర్‌గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్, వాకింగ్ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్, భారత్ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్‌లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు.
అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్‌లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్ ఫంక్షన్ టెక్నిక్‌ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్‌లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్ తింటానని చెప్పారు. అలాగే లంచ్, డిన్నర్‌లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు.
చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్‌లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్‌ని కట్టడి చేశారు రవిచంద్ర.
Comments
Please login to add a commentAdd a comment