Diabetes Control
-
ఆయన పుట్టినరోజు నాడు.. వరల్డ్ డయాబెటిస్ డే
మధుమేహం (డయాబెటిస్) బాధితులు దాదాపు ప్రతి కుటుంబంలో ఉంటున్నారు. ఇంతగా వ్యాప్తి చెందుతున్నా ప్రజలు దీని నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసుగల వారిలో గుర్తించిన మధుమేహం, ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల్లోపే గుర్తించడం కనిపిస్తోంది. ఇది భారతీయులకు ఆందోళన కలిగించే విషయమే.మధుమేహ సమస్య గ్లోబల్ సమస్య. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్ ఆవిష్కర్తలలో ఒకరైన సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ జన్మదినమైన నవంబర్ 14వ తేదీన ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’ (వరల్డ్ డయాబెటిస్ డే)గా ప్రకటించింది. అధిక శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గి పోయింది. చాలామందిలో మానసిక ఒత్తిడి తప్ప, శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత్వం, జీవన సరళిలో వచ్చిన అసంగత మార్పులు... మధుమేహం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తల్లిదండ్రులలో ఇద్దరికీ మధుమేహం ఉన్నా, వారి పిల్లలలో కేవలం 7% మందిలో మాత్రమే జీవిత కాలంలో మధుమేహం బారిన పడ్డట్టు పరిశోధనలు చెప్పడం ఇందుకు నిదర్శనం.మన తాత ముత్తాతలు దంచిన లేదా తక్కువ పాలిష్ పట్టిన బియ్యం, చిరుధాన్యాలు తినేవారు. వాటిలో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుతున్నాం. చిరుధాన్యాలు తినడం మానేశాం. దీనికి తోడు ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడకం పెరిగిపోయింది. కాలినడక తగ్గిపోయింది. వాహనాల వినియోగం పెరిగిపోయింది. చాలామందిలో కుటుంబ, వృత్తి, సామాజిక పర సమస్యలు పెరిగి పోయి మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధిక మయ్యాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణాలే. ఊబకాయం తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుందని అర్థం. బీఎంఐ ఎక్కువగా కలవారే ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?చేసే పనికి తగ్గ పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి. ఊబకాయస్థుల శరీరం బరువు 7 శాతం తగ్గితే మధుమేహం వచ్చే అవకాశాలు 60 శాతం తగ్గిపోతాయని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమి షాలైనా నడక, అవకాశం ఉన్నవారు ఈదటం, పరుగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్య లేచి నాలుగు అడుగులు వేయడం మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల నుండి లభించే శాకాహారం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రజారోగ్యం పైన, ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపే మధుమేహం నిరోధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతగా వ్యహరించాలి.– డాక్టర్ టి. సేవకుమార్ ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ వ్యవస్థాపకులు(నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే) -
మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్
కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఏం జరిగిందంటే?..సౌత్ చైనాలోని హంకాంగ్‌కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్ చేసి చూపించాడు. అతను హాంకాంగ్‌లోని అమోలి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు. అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తే బెటర్‌గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్, వాకింగ్ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్, భారత్ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు. అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్‌లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్ ఫంక్షన్ టెక్నిక్‌ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్ తింటానని చెప్పారు. అలాగే లంచ్, డిన్నర్లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు. చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్‌లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్‌ని కట్టడి చేశారు రవిచంద్ర. (చదవండి: చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..) -
శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్‌యునీ వియెన్సాస్ సెంటర్ జరిపిన రీసెర్చ్‌లో వెల్లడైంది. దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శాకాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు. మాంసాహారంలో అధికంగా ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వంటివి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని తెలిపారు. -
ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. స్టెరాయిడ్స్ వాడటం వల్లేనా?
ఒకప్పుడు ఫలానా వ్యక్తికి షుగర్ (చక్కెర) వ్యాధి వచ్చిందంట అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఈయనకు కూడా షుగర్ వచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు. షుగర్ జబ్బు ఇప్పుడు సాధారణమైంది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు డయాబెటీస్ వ్యాధి (షుగర్) పట్టణ వాసుల్లోనే అధికంగా కనిపించేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వారిలోనూ ఈ వ్యాధి అధికమవుతోంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలో మారుల వల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 14వ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూల్: ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది మధుమేహం రోగులున్నట్లు తేలింది. ఈ రోగం ఉందన్న విషయం తెలియని వారు మరో 25 శాతం మంది ఉండే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చేసిన రక్తపరీక్షల్లో ఎక్కువ శాతం మందికి చక్కెర వ్యాధి బయటపడుతోంది. ఇలా జిల్లాలో ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు మరో 15 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజి విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాలు ఓపీ చికిత్స చేస్తారు. ప్రతి ఓపీకి 200 మంది చికిత్సకు రాగా అందులో వంద మందికి ఇన్సులిన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. మొత్తం ఓపీలో 80 శాతం మంది షుగర్ రోగులే ఉండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఎండోక్రైనాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు సైతం ప్రతి యేటా 16 వేల మంది చికిత్స కోసం వస్తున్నట్లు అంచనా. డయాబెటీస్ రకాలు టైప్ 1 డయాబెటీస్ : శరీరం అతి తక్కువ ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ రకం మధుమేహం గల వ్యక్తులు ఇన్సులిన్‌ను విధిగా తీసుకోవాలి. లేకపోతే ప్రాణాంతకమైన డీకేఏ అనే పరిస్థితిలోకి జారుకుంటారు. ఇది చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది. లక్షణాలు ఇందులో అధిక దాహం, ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ ఆకలి, హటాత్తుగా బరువు తగ్గిపోవడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ శరీరానికి తగినంత ఇన్సులిన్ ఉతత్తి కాదు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఈ సమస్య ప్రారంభం అవుతుంది. స్థూలకాయం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు దీనికి కారణాలు. లక్షణాలు ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. తర్వాత తీవ్ర అలసట, చేతులు,కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, తరచూ మూత్రవిసర్జన, లైంగిక అసమర్ధత, గాయాలు త్వరగా మానకపోవడం, అతిగా ఆకలి, అతిగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరీక్షలు చేయించాలి. ☛ షుగర్ పేషెంట్లు రక్తంలో షుగర్ స్థాయిని తెలుసుకునే పరీక్ష నెలకొకసారి చేయించాలి. ☛ సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాల పనితనం (బ్లడ్ యూరియా, క్రియాటినిన్) చేయించాలి. ☛ ఆరు నెలలకోసారి రక్తంలోని కొవ్వుశాతం చేయించుకోవాలి. ☛ మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ చేయించుకోవడం మంచిది. తెల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి తెల్లగా కనిపించే ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చక్కెర, పిండి పదార్థాలు, తెల్లగా కనిపించే నూనెలు, మైదాతో చేసిన పదార్థాలు, జంక్‌ఫుడ్ లాంటివి మానేయాలి. దానికి బదులుగా ఆకుకూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ వ్యాయామం తపనిసరి ప్రతిరోజూ అరగంట వాకింగ్‌తో మధుమేహం నియంత్రణలోకి వస్తుందని వైద్యులు చెబుతున్నా రు. దీంతో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం సైతం ఎంతో మేలు చేస్తాయి.వ్యాయామం వల్ల గుండెపోటు, గుండెకవాటాల వ్యాధుల ముప్పు తగ్గి టైప్–2 మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో షుగర్ వ్యాధికి అవసరమైన షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఆర్ఎఫ్టీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తోంది. ప్రస్తుతం షుగర్ ఉన్న వారికి ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే గాక ఇప్పటికీ దాని తాలూకు నష్టం వెంటాడుతూనే ఉంది. ఇందులో ముందుగా షుగర్వ్యాధి మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే షుగర్ ఉన్న వారికి కోవిడ్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరగగా, కొత్తగా షుగర్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కోవిడ్ సమయంలో స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, ఇతర ఔషధాలు అధికంగా వాడటంతో పాటు అధికంగా మాంసాహారం, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల షుగర్ కేసులు పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. పీ డయాబెటీస్ రోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ప్రీ డయాబెటీస్ రోగుల సంఖ్య 15 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆందోళనకర విషయం. పరిస్థితి మారకపోతే భవిష్యత్‌లో దేశ జనాభాలో సగం మంది షుగర్బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఈ గణాంకాలను బట్టి అర్థం అవుతోంది. ఇది అటు దేశ, ఇటు కుటుంబ ఆర్థిక, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సి ఉంది. –డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజి హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డయాలసిస్ రోగుల్లో 60 శాతం షుగర్ రోగులే...! ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో 50 నుంచి 60 శాతం షుగర్ రోగులే ఉంటున్నారు. దీనిని బట్టి కిడ్నీలపై షుగర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం అవుతుంది. మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటే జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఇప్పటికే షుగర్ ఉన్న వారు నెలకోసారి మూత్రపరీక్ష చేయించుకోవాలి. ముందుజాగ్రత్తగా షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. –డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
షుగర్ పేషెంట్స్.. పచ్చి కూరగాయలు, పండ్లు తింటున్నారా?
ఇటీవలి కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వంశపార్యపరంగాగా, ఒత్తిడి..ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ప్రస్తుతం వయసులో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటిస్ సమస్య వస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ అనేది మెటబాలిక్ కండిషన్. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలంటే మీ డైట్లో తప్పకుండా ఫైబర్ ఫుడ్‌ని చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగిన పరిమాణంలో ఉంటాయి. స్టార్(సర్వే ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ విత్ ఫైబర్-రిచ్ న్యూట్రిషన్ డ్రింక్) జరిపిన అధ్యాయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్ ఉన్న సుమారు 3,042మంది రోగులపై ఈ పాన్ ఇండియా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు ఫైబర్ రిచ్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిని ఒక గ్రూపుగా, సప్లిమెంట్ తీసుకోనివారిని మరో గ్రూపుగా విభజించి వారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. గ్లూకోజ్ స్థాయి గణనీయంగా తగ్గింది ►HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)స్థాయి గణనీయంగా 8.04 నుండి 7.32కి తగ్గింది ► సుమారు 82% మంది రోగులలో 3కిలోల వరకు బరువు తగ్గడం కనిపించింది. ► సప్లిమెంట్ తీసుకున్న వారు ఉత్సాహంగా ఉన్నట్లు గమనించారు. దీని ప్రకారం..ఫైబర్ రిచ్ సప్లిమెంట్ రోజువారి వినియోగంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎలా నియంత్రిస్తుందన్నది సర్వే ఆధారంగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కంట్రోల్లో ఫైబర్ పాత్ర ఎంత ముఖ్యం అన్నది ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిపోయింది. RSSDI, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా మధుమేహం ఉన్నవారు తమ డైట్లో రిచ్ ఫైబర్(పీచు పదార్థం) ఫుడ్స్‌ని తీసుకోవాల్సిందిఆ సిఫార్సు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రోజుకి 25-40 గ్రా.ల ఫైబర్ తీసుకోవాల్సిందిగా RSSDI సిఫార్సు చేసింది. మధుమేహం నియంత్రణలో సనైన పోషకాహారం పాటించడం ఎంతో అవసరమని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీస్ (SAFES) ప్రెసిడెంట్, డాక్టర్ సంజయ్ కల్రా అన్నారు. మధుమేహంతో బాధపడేవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని పెంచుకోవాల్సిందిగా తెలిపారు. ఫైబర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడమే కాకుండా, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే.. ►పచ్చి కూరగాయలు, పండ్లు ► గోధుమలు, ఓట్స్ ► బ్రౌన్ రైస్,క్వినోవా, బార్లీ ► జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ ► బీన్స్, ధాన్యాలు ► అవిసె గింజలు ► బ్రకోలి,యాపిల్ ► స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు,బ్లూబెర్రీలు ► అరటి పండు, అవకాడో మొదలైనవి. -
మాటలతోనే మధుమేహాన్ని పట్టేస్తుంది!
మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి! మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు. అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది. సూక్ష్మస్థాయి తేడాలు... ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధను జోడించారు... క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది. పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్మాన్ తెలిపారు. స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
Health Benefits of Onions: ఉల్లితో మధుమేహం దూరం!
కాలిఫోర్నియా: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ డియోగాలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలో డెల్టా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోని ఒజిహె అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలుకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉల్లిపాయ తక్కువ ధరకి లభిస్తుంది. డయాబెటీస్‌కి వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పని చేస్తుంది. అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగింది’’ అని ఆంటోని వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలస్ట్రాల్ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్ ఫర్ డయోబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్‌స్పాట్‌గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు. -
ముందే గుర్తిస్తే... డయాబెటిస్‌ను నివారించవచ్చు
ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల షుగర్ వ్యాధి మనల్ని బానిసను చేసుకుంటోంది. అయితే తరచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌ను మన దరి చేయనీకుండా చేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు నూనెలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది ఇన్సులిన్ నిరోధకత, మధుమేహానికి దారితీస్తుంది. లక్షణాలు తరచు మూత్ర విసర్జన, పొడి గొంతు లేదా తరచు దాహం వెయ్యడం, కంటి చూపు మందగించడం, కారణం లేకుండా ఆకస్మికంగా బరువు పెరగటం లేదా తగ్గడం, ఒక్కసారిగా నీరసంగా లేదా అలసటగా అనిపించడం, అధికంగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తే సుగర్ వ్యాధికి సంకేతాలుగా గుర్తించి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ప్రీ డయాబెటిక్ అంటే బార్డర్లో ఉన్నట్లయితే కొన్ని ఎక్సర్సైజులు, ఆహార నియమాలు పాటించడం ద్వారా షుగర్ వ్యాధిని కొంతకాలంపాటు వాయిదా వేయవచ్చు. మధుమేహం ఉన్న వ్యక్తులకు నడక మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే రాత్రి వేళల్లో నడిస్తే వారికి మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఆహారాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవల్స్ భారీగా తగ్గుతాయని గుర్తించారు. ఎక్కువగా మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయులు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ పరిశోధన ప్రకారం.. అలా నడిచిన వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పరిశోధకులు కొలిచారు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలకు మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12 శాతం అధికంగా తగ్గిపోయాయి. ఇక రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు తెలిపారు. -
కాకరకాయ కూర తరచూ తింటే షుగర్ అదుపులోకి వస్తుందా?
చక్కెరవ్యాధి ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటూ ఉండటంగానీ లేదా రోజూ కాకరను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల... చక్కెర అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. ఇది ఒకరకంగా అపోహ లేదా పాక్షిక సత్యం మాత్రమే అని చెప్పవచ్చు. నిజానికి కాకరలో ఉండే రెండు ప్రధాన పోషకాలైన ‘కరాటిన్’, ‘మమోర్డిసిన్’లకు రక్తంలోని చక్కెరపాళ్లను కొంతవరకు తగ్గించే సామర్థ్యం ఉన్నమాట వాస్తవమే. అలాగే కాకర గింజలలో పాలీపెపై్టడ్–పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం కూడా ఉంటుంది. అది కూడా ఇన్సులిన్‌లాగా ప్రవర్తించి కొంతవరకు చక్కెరపాళ్లను అదుపు చేస్తుంది. అయితే... ఒకసారి డయాబెటిస్ వ్యాధి వచ్చిదంటే... అది కేవలం కాకరకాయ తినడం వల్ల మాత్రమే అదుపులో ఉండడమన్నది జరగదు. డయాబెటిస్ రోగులు కాకరకాయ కూర తింటున్నా చక్కెరను నియంత్రించే మందులు తీసుకోవాల్సిందే. కాకపోతే కాకరలో ఇంకా అద్భుతమైన గుణాలున్నాయి. ఆరోగ్యాన్ని సమకూర్చి పెట్టే కాకరలో పోషకాలు చాలా ఎక్కువ. పీచు పుష్కలం. క్యాలరీలు చాలా తక్కువ. పోషకాల విషయానికి వస్తే విటమిన్ బి1, బి2, బి3, సి లతో పాటు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఫైబర్‌తో పాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. కాకర గింజలు కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. అలా గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. సి విటమిన్ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో అది దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆ ప్రక్రియతో మాలిగ్నంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) తొలగిపోయి... క్యాన్సర్లు నివారితమవుతాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. చదవండి : కరోనా వచ్చిన తర్వాత నిద్రలేమా?.. ఇలా చేయండి! -
బీపీ పెరిగిపోతోంది, ‘షుగర్’ పేరుకుపోతోంది.. ఏం చేయాలి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జీవన శైలి జబ్బులైన బీపీ, షుగర్లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 20.5 శాతం మంది షుగర్ బాధితులున్నారు. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండెజబ్బులకు గురవుతున్నారు. నియంత్రణకు చర్యలు ► జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ►వారానికోసారి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎన్సీడీ(జీవనశైలి జబ్బులు) స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. ►104 వాహనాల ద్వారా కూడా స్క్రీనింగ్ నిర్వహించి ఉచితంగా మందులిస్తోంది. ►30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ వయసు దాటిన వాళ్లు తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం లేకే ఈ దుస్థితి ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. –డా.విద్యాసాగర్, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాల -
మధుమేహ నియంత్రణకు కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: మధుమేహాన్ని నియంత్రించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గా న్ని ఆవిష్కరించారు. ఊబకాయం వల్ల మధుమేహం వచ్చిన వారిలో ఇన్సులిన్ పనిని సెక్రెటాగోగిన్ అనే ప్రొటీన్ ఎక్కువ చేస్తున్నట్లు డాక్టర్ యోగేంద్ర శర్మ, ఆనంద్ శర్మ, రాధిక ఖండేల్వాల్, అమృతా చిదానందలు గుర్తించారు. ఈ ప్రొటీన్ అతుక్కుపోవడం వల్ల ఇన్సులిన్‌కు రక్షణ కలుగుతోందని, స్థిరంగా ఉండేలా చేయడం ద్వారా పనితీరును మెరుగుపరుస్తోందని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. మధుమేహుల్లో ఈ ప్రొటీ న్ చాలా తక్కువగా ఉంటుంది. ఊబకాయంతో ఉన్న ఎలుకలకు ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు కొవ్వు తగ్గడంతోపాటు రక్తంలో తిరుగుతున్న అదనపు ఇన్సులిన్‌ను తొలగించింది. అంతేకాకుండా ఈ ప్రొటీన్‌ను అందుకున్న ఎలుకల్లో హానికారక ఎల్డీఎల్ కొవ్వు కూడా తగ్గిపోయిందని, కాలేయ కణాల్లో కొవ్వులు పేరుకుపోవడమూ తగ్గిందని డాక్టర్ యోగేంద్ర శర్మ తెలిపారు. సాధారణంగా మధుమేహం, మతిమరుపు మధ్య సంబంధం ఉంటుందని, అల్జీమర్స్ రోగుల మెదళ్లలో ఈ సెక్రెటాగోగిన్ప్రొటీన్ తక్కువ మోతాదుల్లో ఉండటాన్ని బట్టి తాము కొన్ని ఇతర ప్రయోగాలు చేశామని ఆయన వివరించారు. సెక్రెటాగోగిన్ప్రొటీన్ అల్జీమర్స్ వంటి అనేక నాడీసంబంధిత సమస్యలకు కారణమయ్యే ఆల్ఫా సైనూక్లియన్ ప్రొటీన్ ఫిబ్రిల్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తున్నట్లు ఈ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. మధుమేహ నియంత్రణకు ఈ ప్రొటీన్ సరికొత్త మార్గం కాగలదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించారు. -
సు‘ఘర్’కీ కహానీ!
సాక్షి, హైదరాబాద్ : ఆమె పేరు అమృతారావు... హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు మెడికల్ కన్సల్టెన్సీలో కీలక పోస్టులో ఉన్నారు. ఆమె భర్తకు డయాబెటిస్ ఉంది. దీంతో ఆమె కూడా తన ఆహార అలవాట్లను భర్తకు అనుగుణంగా మార్చుకుంది. రోజూ ఇద్దరూ వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు తక్కువున్న ఆహారం తీసుకోవడం చేస్తున్నారు. స్వీట్లు ఇంట్లో తయారు చేయడాన్ని పూర్తిగా ఆపేసింది. అలా తన భర్తకు అనుగుణంగా పూర్తిగా ఆహారపు అలవాట్లు మార్పు చేసుకుంది. డయాబెటిస్ నివారణలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండా లని ప్రపంచ డయాబెటిస్ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు అమృతరావు ఈ అలవాట్లు చేసుకుంది. నవంబర్ 14 ప్రపంచ డయాబెటిస్ నివారణ దినాన్ని పురస్కరించుకొని ఆ సమాఖ్య గతేడాది ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు ఆ థీమ్‌ను ప్రచారం చేస్తుంది. డయాబెటిస్‌ను కుటుంబ సమస్యగా పరిగణించాలని స్పష్టం చేసింది. డయాబెటిస్ రాకుండా చూసుకోవడం, ఒకవేళ వస్తే దాన్ని సకాలంలో గుర్తించడం, ఆ తర్వాత నియంత్రించడంలో కుటుంబ సభ్యు లు కీలకపాత్ర పోషించాలని ప్రపంచ డయాబెటిస్ సమాఖ్య పేర్కొంది. అంటే కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, ఇతర సభ్యులు సహకరించాలని పేర్కొంది. వారి ఆహారం, వ్యాయామం, ఇతర జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చేలా మసలుకోవాలని కోరుతోంది. అంతేకాదు కుటుంబ సభ్యుల్లో ఇతరులకు రాకుం డా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని ప్రచారం చేస్తుంది. ఈ థీమ్ ప్రజల్లో విస్త్రృతంగా ప్రచారం జరగ లేదని నిమ్స్‌కు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ అంటున్నారు. సాధారణ స్థితికి రావొచ్చు.. ప్రీడయాబెటిస్ ఉంటే సాధారణ స్థితికి రావడం సాధ్యమే. నిత్యం వ్యాయా మం చేయడం, కార్బోహైడ్రేట్లు తక్కువగా తినడం, కూరగాయలు భుజించడం, నిద్ర సక్రమంగా పోవడం ద్వారా ప్రీడయాబెటిస్ నుంచి సాధారణానికి రావొచ్చు. రాష్ట్రంలో డయాబెటిస్ ఉన్న వారిలో దాదాపు 50% మం దికి తమకు డయాబెటిస్ ఉన్నట్లే తెలియదు. -డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్ డయాబెటిస్ ఎలా లెక్కిస్తారంటే? ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా డయాబెటిక్ అసోసియేషన్ల ప్రకారం.. ఉదయం ఏమీ తినకుండా షుగర్ టెస్టు చేస్తే 126 ఎంజీ/డీఎల్ పైగా ఉంటే వారికి షుగర్ వ్యాధి ఉన్నట్లే లెక్కగడతారు. అలాగే ఆ తర్వాత ఏదైనా టిఫిన్ లేదా భోజనం చేశాక 2 గంటల సమయం గడిచాక మళ్లీ పరీక్షిస్తే 200 ఎంజీ/డీఎల్ పైగా ఉంటే కూడా డయాబెటిస్‌గానే పరిగణిస్తారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏమీ తినకుండా చేసే పరీక్షలో 110 నుంచి 125 వరకు మధ్య, అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం 100 నుంచి 125 మధ్య ఉంటే ప్రీడయాబెటిస్‌గా లెక్కిస్తారు. భోజనం లేదా టిఫిన్ అనం తరం 2 గంటల తర్వాత చేసే పరీక్షలో 140 నుంచి 199 ఎంజీ/డీఎల్ ఉంటే ప్రీడయాబెటిస్‌గా రెండు సంస్థలూ పరిగణిస్తాయని నిమ్స్ వైద్యురాలు డాక్టర్ బ్రియాటిన్ ఆని అంటున్నారు. మన దేశం మాత్రం అమెరికా డయాబెటిస్ అసోసియేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని అంటున్నారు. ఇదిలావుంటే 3 నెలల సరాసరి నికర షుగర్‌ను లెక్కలోకి తీసుకొని చేసే పరీక్షే‘హెచ్‌బీఏ1సీ’. ఈ పరీక్షలో 6.5 పైగా రక్తంలో షుగర్ శాతం ఉంటే అప్పు డు కూడా డయాబెటిస్‌గానే పరిగణిస్తారు. 5.7 శాతం నుంచి 6.5 శాతం మధ్య ఉంటే ప్రీడయాబెటిస్ అంటారు. ఇక ప్రీడయాబెటిస్ అంటే డయాబెటిస్ ప్రమాదపు అంచున ఉన్నట్లు లెక్క. అంటే బోర్డర్ లైన్లో ఉన్నట్లు పరిగణించాలి. ప్రభుత్వాలు డయాబెటిస్ లెక్కల్లో ప్రీడయాబెటిస్‌ను లెక్కలోకి తీసుకోరు. ప్రీడయాబెటిస్‌లో ఉన్నవారు జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, రెగ్యులర్ వ్యాయామాలు చేయడం ద్వారా సాధారణ స్థితిలోకి రావొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలో డయాబెటిస్, బీపీలపై ప్రజలను పరీక్షించింది. మొత్తం 95.54 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 3.77 లక్షల మంది డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. అలాగే 7.05 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులదే కీలకపాత్ర.. డయాబెటిస్‌ను కుటుంబ సమస్యగానే చూడాలి. కుటుంబ సభ్యుల సహకారం లేకుండా డయాబెటిస్‌ను నియంత్రిం చడం గానీ, ఇతరులకు రాకుం డా కానీ చేయలేం. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. డయాబెటిస్ ఉన్నవారు, ప్రీడయాబెటిస్‌లో ఉన్నవారు తప్పనిసరిగా కనీసం రోజుకు అరగంట నడవాలి. కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న భోజనం చేయాలి. – డాక్టర్ బ్రియాటిన్ ఆని, ఎండోక్రైనాలజిస్ట్, నిమ్స్ -
మధుమేహులకు మందుల కంటే ఇవే బెటర్
లండన్ : ఆహార నియమాలు, నిత్యం వ్యాయామం టైప్ టూ డయాబెటిస్ నియంత్రణకు మెరుగ్గా పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. మందుల కంటే ఇవే మధుమేహులకు ఉపకరిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి కలిగిన టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 1500 మంది రోగులను శారీరకంగా యాక్టివ్‌గా లేని రోగులతో గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు పోల్చిచూశారు. నిత్యం వ్యాయామం చేస్తూ మెరుగైన మానసిక ఆరోగ్యం కలిగిన వారు తేలిగ్గా బరువు తగ్గినట్టు గుర్తించారు. కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం మందులు తీసుకోవడం కన్నా సమర్ధవంతంగా పనిచేసినట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. 16 వారాల పాటు చురుకైన జీవనశైలి కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు తమ డయాబెటిస్ మందుల మోతాదు మించకపోవడం, మరోవైపు వారు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. మూడేళ్లలో వీరిలో బ్లడ్ ఘుగర్ లెవెల్స్ తగ్గినట్టు కూడా గుర్తించారు. మందుల కంటే కూడా మెరుగైన ఆహారపు అలవాట్లతో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచవచ్చని ఈ అథ్యయనంలో వెల్లడైంది. యాక్టివ్ లైఫ్‌స్టైల్ సెషన్లో పాల్గొన్న పలువురికి టైప్ టూ డయాబెటిస్ పూర్తి అదుపులోకి వచ్చింది. మరికొందరు ఇన్సులిన్ తీసుకోవడం కూడా మానివేశారని పరిశోధకులు పేర్కొన్నారు. -
నత్తల ఇన్సులిన్...సూపర్ ఫాస్ట్!
డయాబెటిస్ నియంత్రణకు ఇన్సులిన్ వాడటం తెలిసిందే.. అయితే వాడిన 15 నిమిషాలకు కానీ దాని ప్రభావం కనిపించదు. కానీ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ అర్లింగ్టన్ (యుటా) శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం త్వరలోనే వేగంగా పనిచేసే ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఓ రకమైన నత్తలు తమ శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇన్సులిన్ వంటి రసాయనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని వారు గుర్తించారు. ఇది సాధారణ ఇన్సులిన్‌కు మూడు రెట్లు ఎక్కువ వేగంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు కాలేయం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ తక్కువైనపుడు కృతిమ ఇన్సులిన్‌ను తీసుకుంటాం. అయితే ఇది శరీరంలోకి చేరాక అందులోని ఆరు రసాయన అణువులు విడిపోయేందుకు కొంత సమయం పడుతుంది. అంటే అప్పటి వరకు దాని ప్రభావం కనిపించదన్నమాట. మానవుల్లో అయితే ఇది జరిగేందుకు 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. నత్తలు ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఉండదని, దీంతో 5 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని పరిశోధకులు వివరించారు. నత్తల ఇన్సులిన్ వంటి దాన్ని కృత్రిమంగా తయారు చేస్తే మానవులకు ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. -
చిరాయువు చిక్కేనా!
దీర్ఘాయువు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు - సరికొత్త సాంకేతికతలతో ముందుకొస్తున్న పరిశోధకులు - మందులు, అవయవాల మార్పిడి వంటి పద్ధతులతో సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు ఆయురారోగ్యాలతో వందేళ్ల పాటు జీవించాలని కోరుకోని వారుంటారా.. వయసును జయించేందుకు ఎన్నో ఏళ్లుగా మానవుడు చేయని ప్రయత్నం లేదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. మరణాన్ని జయించడం, వయసుతో పాటు వచ్చే అనేక సమస్యలను అధిగమించడం వంటి లక్ష్యాలతో సాగుతున్న పరిశోధనల తీరు తెన్నులివిగో.. - సాక్షి, హైదరాబాద్ మందులతో వయసుకు చెక్ మధుమేహ నియంత్రణకు మెట్ఫార్మిన్ మాత్రలు వేసుకునే వారి ఆయువు కొంత పెరుగుతుందట. ఇది వార్ధక్య లక్షణాలను తగ్గిస్తూ జీవితకాలాన్ని కనీసం 50 శాతం మేర పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే సూక్ష్మజీవులపై చేసిన ఈ పరిశోధనలు మానవులపై ఎంతమేర పనిచేస్తుందో ప్రశ్నార్థకమే. జీవితకాలంపై మెట్ఫార్మిన్ చూపే ప్రభావాన్ని కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ సమస్యను అధిగమించగలిగితే దీర్ఘాయువుకు దోహదపడుతుందని అంచ నా. ‘గెరో’ వంటి ఫార్మా కంపెనీలు మెట్ఫార్మిన్తోపాటు రాపమైసిన్, కార్నోసైన్ వంటి రసాయనాలతో శరీర కణజాలాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సఫలీకృతమైతే మానవుడు సులువుగా 110 నుంచి 120 ఏళ్లు బతికేయవచ్చునని అంచనా. అవయవాల ఎక్స్చేంజ్... వయసు పెరిగే కొద్ది శరీరంలోని అవయవాలు బలహీనపడటం, పనిచేయకపోవడం జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు ఈ అవయవాలను మార్చుకోగలిగితే ఎక్కువ కాలం బతకొచ్చు. అమెరికాలోని వేక్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీజెనరేటివ్ మెడిసిన్ ఇప్పుడు ఇదే పనిలో ఉంది. మూల కణాల ద్వారా పరిశోధనశాలలో అవయవాలను తయారు చేస్తోం ది. ఇంక్జెట్ ప్రింటర్ వంటి పరికరంతో ఈ సంస్థ ఇప్పటికే మూత్రాశయాన్ని తయారు చేసి ఓ రోగికి విజయవంతంగా అమర్చింది. టెక్నాలజీ మరింత అభివృద్ది చెందితే సమీప భవిష్యత్తులోనే శరీరం మొత్తాన్ని క్లోనింగ్ చేసి అందులో మెదడులోని సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవచ్చు. అంటే ఒక శరీరాన్ని వదిలి మరోదాంట్లోకి వెళ్లిపోవచ్చన్న మాట. నానో రోబోలతో.. పాడైన అవయవాల స్థానంలో కొత్త వాటిని అమర్చడం ఓ మార్గమైతే.. ఉన్నవాటిని ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకోవడం ఇంకో పద్ధతి. అమెరికాలోని సెంటర్ ఫర్ నానోటెక్నాలజీ ఇన్ సొసైటీ రెండో పద్దతిపై దృష్టి సారించింది. అతి సూక్ష్మమైన రోబోల సాయంతో శరీర అవయవాలను మరమ్మతు చేసుకోవచ్చని ఈ సంస్థ చెబుతోంది. అంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు, అనవసర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ రోబోలు పనికొస్తాయన్న మాట. మనిషినే కొత్తగా తయారు చేస్తే.. శరీరంలోని చాలా అంశాలు జన్యు క్రమంపై ఆధారపడి ఉంటాయని తెలిసిన విషయమే. దీంతో వయసుతో పాటు సమస్యలను అధిగమించేందుకు, దీర్ఘాయువు సాధించేందుకు జన్యుక్రమాన్ని ఆసరాగా చేసుకోవాలని కొన్ని పరిశోధక సంస్థలు ఆలోచిస్తున్నాయి. జన్యు క్రమ నమోదులో కీలక పాత్ర పోషించిన క్రెయిగ్ వెంటర్ వంటి శాస్త్రవేత్తలు ఇప్పటికే కృత్రిమ పద్ధతుల్లో కణాలు, కొన్ని సూక్ష్మజీవులను సృష్టించిన విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న జన్యుక్రమ సమాచారం ఆధారంగా పరిశోధన శాలలోనే మానవ కణాన్ని అభివృద్ది చేయాలని జార్జ్ చర్చ్ వంటి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆరోగ్యంతో పాటు, మంచి రూపురేఖలున్న పిల్లల అభివృద్ధికి దారితీస్తుందని అంచనా. -
‘తెలంగాణ సోన’కు త్వరలో గుర్తింపు
♦ మధుమేహాన్ని నియంత్రించే బియ్యంపై రైతుల ఆసక్తి ♦ వచ్చే కేంద్ర విత్తన కమిటీ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోన’ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత అక్టోబర్‌లో విడుదల చేసిన మధుమేహ నియంత్రణ ఆర్ఎన్ఎస్-15048 రకం వరికి త్వరలో కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించనుంది. ఈ మేరకు తెలంగాణ విత్తన ఏజెన్సీ కేంద్రానికి ప్రతిపాదించింది. విత్తన కమిటీ గుర్తింపు లభిస్తే దేశవ్యాప్త మార్కెట్లో దాన్ని వాణిజ్యపరంగా విక్రయించేందుకు అవకాశాలుంటాయి. వ్యవసాయ వర్సిటీ అధికారికంగా విడుదల చేయకముందే ఈ రకం వరిని ఇప్పటికే రాష్ట్రంలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పంట కాల వ్యవధి 125 రోజులే ఉండటం, సాధారణ వరి కంటే ఎకరాకు 8 క్వింటాళ్లు అధిక దిగుబడి ఉండటంతో రైతులు దీనిపట్ల ఆసక్తి చూపుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి మధుమేహ నియంత్రణ బియ్యం వచ్చిందని పేర్కొంటున్నారు. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున మధుమేహ రోగుల్లో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరగకుండా చేస్తుంద ని, రోజుకు మూడు నాలుగుసార్లు ఈ బియ్యం తో వండిన అన్నం తీసుకోవచ్చంటున్నారు. కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించాలంటే కనీసం రెండు రాష్ట్రాల్లో నిర్ధరించిన కనీస విస్తీర్ణంలో ఈ పంట సాగు చేపడుతూ ఉండాలి. ఈ పంట దిగుబడిపై రైతులు సంతృప్తి చెందాలి. వీటన్నింటినీ కేంద్ర విత్తన కమిటీలోని డెరైక్టర్లు, శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి గుర్తింపునిస్తారు. హైదరాబాద్‌లో వచ్చే కమిటీ సమావేశాల్లో దీనికి గుర్తింపు వస్తుందని తెలంగాణ విత్తన సంస్థ అధికారులు చెబుతున్నారు. గ్లైసీమిక్ ఇండెక్స్ సూచిక 51.6.. సాధారణ రకాల బియ్యాల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ సూచిక 55 పైనే ఉంటుందని, ‘తెలంగాణ సోన’ బియ్యంలో మాత్రం కేవలం 51.6 ఉంటుందని ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్.జగదీశ్ ‘సాక్షి’కి చెప్పారు. అందువల్ల మధుమేహంతో బాధపడే రోగులు ఎన్నిసార్లు తిన్నా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఈ రకం వరికి, బియ్యానికి కర్ణాటకలో అధిక డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో పెద్దగా ప్రచారం లేకపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. -
స్వీట్ కిడ్స్
చిన్నపిల్లల్లో డయాబెటిస్ డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతుడడంతో ఈ వ్యాధి ఒక చర్చనీయాంశమైంది. ఈ రోగుల సంఖ్య ఒక సామాజిక ఉపద్రవంగా మారుతుండటం కలవరం కలిగిస్తోంది. క్రితం తరంతో పోలిస్తే ఈ తరంలో మరీ చిన్న వయసు పిల్లల్లోనూ డయాబెటిస్ కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. అయితే పెద్దల్లోని డయాబెటిస్పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది తప్ప... దీనిపై అంతగా దృష్టిసారించడం లేదు. ఇప్పటికీ అదృష్టవశాత్తు పెద్దవయసులో డయాబెటిస్ వచ్చే రోగులతో పోలిస్తే చిన్న వయసులో డయాబెటిస్ వచ్చే రోగుల సంఖ్య తక్కువగానే ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. కానీ... చిన్నపిల్లల్లో డయాబెటిస్ వస్తే తక్షణం దాన్ని నిర్ధారణ చేసుకొని, రక్తంలో పెరిగే చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే అది చాలా తీవ్రమైన, ఆందోళనకరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో ఇన్సులిన్ లోపం వల్ల ఆహారాన్ని శక్తిగా మార్చుకునే ప్రక్రియల్లో తేడాలు వస్తాయి. పిల్లల్లో స్థూలకాయం ఉన్నవారిలో ఇన్సులిన్ తన కార్యకలాపాలను సక్రమంగా కొనసాగించలేదు. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్. చిన్నపిల్లల్లో డయాబెటిస్... చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్ సాధారణంగా టైప్-1కు చెందుతుంది. దీనిలో పిల్లలు తమ జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధాపడాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో పూర్తిగా ఇన్సులిన్ లోపం ఏర్పడటం వల్లనే ఇది వస్తుంది. మన శరీరంలో పాంక్రియాస్ అనే ఒక గ్రంథిలోని బీటా-సెల్స్ అనే కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తయారు చేస్తాయి. ఈ హార్మోన్ రక్తంలో చక్కెరపాళ్లు ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూస్తుంది. పిల్లల్లో ఇది ఏ వయసులోనైనా రావచ్చు. చిన్నపిల్లల్లోని డయాబెటిస్ నియంత్రణ ఎలా... పిల్లల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌ను నియంత్రించడానికి చర్మం కింది పొర అయిన సబ్‌క్యుటేనియస్ పొరలోకి ఇన్సులిన్ ఎక్కించాలి. ఇక ఆహారం విషయానికి వస్తే చక్కెర పాళ్లు అస్సలు లేకుండా అన్ని రకాల పోషకాలూ అందేలా సమతులాహారం ఇవ్వాలి. చికిత్స విజయవంతం కావాలంటే... ప్రతి చిన్నారికీ... అతడి లేదా ఆమె పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా ఆహారం, వ్యాయామం, మందుల పాళ్లను నిర్ణయించాల్సి ఉంటుంది. రోగి రక్తంలో తగినంత చక్కెరపాళ్లు మాత్రమే ఉండేలా చేయడమే చికిత్స ప్రధాన ఉద్దేశం. దీనిలో జాప్యం జరిగితే అది చిన్నారి మూత్రపిండాలు, నరాలు లేదా కనుచూపునకు సంబంధించిన సమస్యలకు దారితీసే అవకాశాలుంటాయి. సిరంజీ ద్వారా తగిన మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడం వల్ల రోగికి అవసరమైనంత మేరకే రక్తంలో చక్కెర పాళ్లు ఉండేలా చేయడం జరుగుతుంది. ఇలా చేయడంలో రోగి తీసుకునే ఆహారమూ, అతడికి/ఆమెకు ఇవ్వాల్సిన ఇన్సులిన్ పాళ్లూ, రోగి చేసే వ్యాయామం ఎంతో పరిగణనలోకి తీసుకొని ఆహారం, మందుల మోతాదులను సరిగ్గా నిర్ణయించాల్సి ఉంటుంది. రక్తంలోని చక్కెరపాళ్లు ఎప్పుడూ అవసరమైనంతే ఉంటూ నిర్ణీతమైన రేంజిలోనే ఉండేలా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌లు చూస్తుంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ అతడు/ఆమె పెరుగుదల ఆధారంగా చిన్నారి తీసుకునే మందుల మోతాదులతో పాటు అతడి ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఎంతెంత ఉండాలో నిర్ణయిస్తారు. చికిత్స విషయంలో భవిష్యత్తు ఆశలు... ప్రస్తుతానికి చిన్నారుల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌కు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మాత్రమే ప్రధాన చికిత్సగా ఉన్నా... ఈ అంశంపై విశేషంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో ఆశాజనకమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తునికి మాత్రం సర్జరీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు చిన్న పిల్లల విషయంలో సిఫార్సు చేయడం లేదు. ఇక టైప్-2 డయాబెటిస్ అనేది పెద్దల్లో వచ్చే సమస్య. ఆధునిక నాగరికత పేరిట ఆహారం, విహారాల విషయంలో పెరుగుతున్న మన అనారోగ్యకరమైన జీవనశైలి దీన్ని మరింతగా ప్రేరేపిస్తోంది. మన శరీరంలోకి వెలువడే అదనపు చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ తగినంతగా విడుదల అయినా... పెద్దవారిలో (అడల్ట్స్‌లో) ఉండే కొవ్వు ఆ ఇన్సులిన్ పనితీరుకు ప్రతిబంధకంగా మారుతుంది. దాంతో ఈ తరహా వ్యక్తుల్లో మెడ వెనక భాగంలోనూ, బాహుమూలాల వద్ద, తొడల వద్ద నల్లటి చారలను ఏర్పరుస్తుంది. మనలో ఇన్సులిన్ సరిగా పనిచేయడం లేదనే విషయానికి ఇది ఒక భౌతికంగా కనిపించే గుర్తు. ఇక స్థూలకాయం ఉండే పిల్లల్లో టైప్-2 డయాబెటిస్ కూడా ఉందేమో చూడాలి. కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్న పెద్దవారికి మెడపై ఈ పిగ్మెంటేషన్ ఉంటే... వారి పిల్లల్లో డయాబెటిస్ రావడంతో పాటు అమ్మాయిల్లో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్), రుతుక్రమం సరిగా రాకపోవడం, శరీరంపై అవాంఛిత రోమాలు కనిపించడం, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్ష, మూత్రపరీక్షల వంటివి చేసి పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో మందులు, న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఆహారంతో పాటు బిహేవియర్ స్పెషలిస్ట్ సలహా, సూచనలతో వ్యాధిని అదుపులో పెట్టడం ఎలాగో తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లలు అన్ని రకాలుగా బాగానే ఉండి, అతడిలో కేవలం టైప్-2 డయాబెటిస్ వచ్చే లక్షణాలు కనిపిస్తుంటే... అప్పుడు ఆ చిన్నారుల జీవనశైలి, ఆహారం, వ్యాయామాలు, బరువును అదుపులో పెట్టుకోవడం ఎలా అనే అంశాలపై అవగాహన కలిగించాలి. ఇవన్నీ అతడి రక్తంలోని చక్కెరపాళ్లను అదుపు చేయలేకపోతే అప్పుడు నోటి ద్వారా మందులు ఇవ్వడమో లేదా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడమో చేయాలి. ఆ వయసు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి, ఎన్ని సార్లు ఎంతెంత మోతాదుల్లో (పోర్షన్స్)తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలి. ఇలాంటి పిల్లలు రోజుకు కనీసం ఒక గంటసేపైనా శారీరకమైన శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలున్న పిల్లలను గుర్తించి వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావడం వల్ల డయాబెటిస్‌ను సాధ్యమైనంతగా నివారించవచ్చ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. కానీ టైప్-1 డయాబెటిస్ నివారణ సాధ్యం కాదు. కాబట్టి వారి విషయంలో అత్యవసరంగా వైద్యనిపుణుల సలహా తీసుకోవాలి. లక్షణాలు... చిన్నపిల్లల్లో డయాబెటిస్ వచ్చాక ఆ చిన్నారిలో కొద్ది రోజులు లేదా వారాల్లోనే దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అవి... చాలా ఎక్కువగా దాహం వేస్తుండటం ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుండటం ఒక్కోసారి నిద్రలో పక్క తడపడం క్రమంగా బరువు తగ్గుతుండటం ఎప్పుడూ అలసటగా ఉండటం. ఈ దశలోనే తల్లిదండ్రులు గమనించి వ్యాధి నిర్ధారణ చేయించాలి. వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు, లవణాలను ఎక్కువ పరిమాణంలో కోల్పోవడం), కడుపునొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి లక్షణాలు కనపడవచ్చు. అప్పుడు రక్తనాళంలోకి సెలైన్‌తో పాటు ఇన్సులిన్ ఎక్కించాల్సి రావచ్చు.