లండన్ : ఆహార నియమాలు, నిత్యం వ్యాయామం టైప్ టూ డయాబెటిస్ నియంత్రణకు మెరుగ్గా పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. మందుల కంటే ఇవే మధుమేహులకు ఉపకరిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో అథ్యయనం పేర్కొంది. చురుకైన జీవనశైలి కలిగిన టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 1500 మంది రోగులను శారీరకంగా యాక్టివ్‌గా లేని రోగులతో గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు పోల్చిచూశారు.
నిత్యం వ్యాయామం చేస్తూ మెరుగైన మానసిక ఆరోగ్యం కలిగిన వారు తేలిగ్గా బరువు తగ్గినట్టు గుర్తించారు. కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం మందులు తీసుకోవడం కన్నా సమర్ధవంతంగా పనిచేసినట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. 16 వారాల పాటు చురుకైన జీవనశైలి కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు తమ డయాబెటిస్ మందుల మోతాదు మించకపోవడం, మరోవైపు వారు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. మూడేళ్లలో వీరిలో బ్లడ్ ఘుగర్ లెవెల్స్ తగ్గినట్టు కూడా గుర్తించారు.
మందుల కంటే కూడా మెరుగైన ఆహారపు అలవాట్లతో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచవచ్చని ఈ అథ్యయనంలో వెల్లడైంది. యాక్టివ్ లైఫ్‌స్టైల్ సెషన్‌లో పాల్గొన్న పలువురికి టైప్ టూ డయాబెటిస్ పూర్తి అదుపులోకి వచ్చింది. మరికొందరు ఇన్సులిన్ తీసుకోవడం కూడా మానివేశారని పరిశోధకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment