booming
-
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా!
ప్రపంచంలోని చాలా దేశాలు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నాయి, ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో మరింత డెవలప్ అయిపోతోంది. నేడు చిన్న చిన్న నగరాల్లో కూడా భూములు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇతరదేశాలతో పోలిస్తే అరబ్ దేశాల్లో ఇది ఒకింత ఎక్కువగా ఉంది. దీనికి కారణమేంటి? కొనుగోలుదారులు ఎందుకు అక్కడే ఆసక్తి చూపుతున్నారనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయ్ అనేది అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి. కావున ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ దేశం ప్రముఖ దేశాలకు నడుమ ఉంది. కావున ఎక్కడికి ప్రయాణించాలన్న కావలసిన సదుపాయాలు ఎక్కువగా ఉండటమే. ఒకప్పటి పాలన మాదిరిగా కాకుండా దుబాయ్‌లో స్వతంత్య్రత బాగా పెరిగింది. దీనితో పాటు భద్రతలు కూడా పెరిగాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి చాలామంది బారులు తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతోంది. 2021లో దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఇండియన్స్ సుమారు 900 కోట్ల దిర్హామ్‌లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే.. బుర్జ్ ఖలీఫాతోపాటు ఆకాశాన్నంటే రీతిలో ఇండ్లు, షాపింగ్ మాల్స్ వంటివి దుబాయ్‌ని టూరిస్ట్ హబ్‌గా నిలపడంతో సహాయపడుతున్న గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రావడం వల్ల పారిశ్రామిక వేత్తల చూపు ఇటువైపు తిరిగింది. రానున్న రోజుల్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మరింత పెరుగుతుంది అంటే ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. -
ఇక ఎయిర్‌టెల్‌లో గూగుల్ రింగ్!
న్యూఢిల్లీ: బూమింగ్‌లో ఉన్న దేశీ మొబైల్ టెలికం రంగంపై ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కన్నేసింది. గతేడాది రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన గూగుల్ భారతీ ఎయిర్‌టెల్‌పైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎయిర్‌టెల్‌లోనూ భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎయిర్‌టెల్‌తో జరుపుతున్న చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఎయిర్‌టెల్‌లోనూ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలు చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయంగా పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ రెండింటిలోనూ గూగుల్ వాటాలు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను గూగుల్ కైవసం చేసుకుంది. ఇందుకు రూ. 33,737 కోట్లు వెచ్చించింది. గూగుల్‌తో డీల్ కుదిరితే ఎయిర్‌టెల్‌కు నిధుల రీత్యా బూస్ట్ లభిస్తుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
సాక్షి, ముంబై: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల చిన్నా చితకా వ్యాపారులతో పాటు బడా వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోయారు. అయితే, కరోనా గడ్డు కాలంలో సైతం రియల్ ఇస్టేట్ రంగం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలో గడచిన ఆరు నెలల కాలంలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయం గణనీయంగా పెరిగింది. నగరంలో రూ. 15 నుంచి రూ. 100 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫాట్ల విక్రయం వల్ల ఏకంగా రూ. 4 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదికలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయనే దానిపై అధ్యయనం చేసి ఆ వివరాలను పొందుపరిచారు. కరోనా కాలంలో స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్లీ ఊపందుకునేలా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్టాంప్ డ్యూటీలో రాయితీ ప్రకటించింది. మార్చి 31 వరకు కొనుగోలుదారులు కేవలం రెండు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీన్ని అదనుగా చేసుకున్న అనేక మంది లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తం 60 శాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు మార్చి 31కి ముందే జరిగాయి. ముఖ్యంగా సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే లగ్జరీ ఫ్లాట్లకే ఎక్కువ ఆసక్తి కనబర్చినట్లు రిజిస్ట్రేషన్ల సరళిని బట్టి తెలిసింది. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అత్యధిక శాతం లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం లావాదేవీల్లో 60 శాతం లోయర్ పరేల్‌లోనే జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదికలో పేర్కొంది. -
రియల్ ఎస్టేట్ మళ్లీ జోరందుకుంది
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ వేగం పుంజుకుంది. లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతుల జారీ ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో రియల్ ఎస్టేట్ లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ దాదాపుగా స్తంభించిపోయింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ నిబంధనల సడలింపుతో గత ఏడాది ద్వితీయార్థం నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అన్నిరకాల అనుమతులను నిర్ణీత కాలంలో జారీచేస్తుండడం కూడా ఇందుకు దోహదపడుతోంది. ఆన్లైన్లో అనుమతులు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు అన్నింటికీ పురపాలక శాఖ ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అత్యంత పారదర్శకంగా అనుమతులు జారీచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ లే అవుట్లకు అయితే 21 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి అనుమతులివ్వాలి. అపార్టుమెంట్లు, ఇతర భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు జారీచేయాలి. ఆ నిర్ణీత గడువు ముగియగానే ‘డీమ్డ్ టు బి అప్రూవ్డ్’గా.. అంటే, అనుమతులు జారీ అయినట్లుగానే పరిగణించేలా కూడా విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇది రియల్టర్లతోపాటు సామాన్య భవన నిర్మాణదారులకు కూడా ఎంతో సానుకూలంగా ఉంది. ►రాష్ట్రంలో 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. 2018–19లో 613 ఎకరాల్లో కేవలం 98 లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అదే.. 2019–20లో 2,777 ఎకరాల్లో 326 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మూడు రెట్లు పెరిగాయి. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక 2020–21లో కరోనా మహమ్మారి ప్రతికూల పరిస్థితులను అధిగమించి మరీ రికార్డు స్థాయిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేయడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నాటికి ఏకంగా 2,633 ఎకరాల విస్తీర్ణంలో 330 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి దాదాపు 500 లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈ ఏడాది లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మొదటిస్థానంలో కొనసాగుతోంది. ►అలాగే, రాష్ట్రంలో 110 పట్టణ స్థానిక సంస్థల్లో.. 44 ప్రధాన మున్సిపాల్టీల్లో 2018–19లో కేవలం 29 లేఅవుట్లకు 150 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలెత్తడంతో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంది. 2019–20లో 65 లేఅవుట్లకు 428 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే, 2020–21లో కరోనా పరిస్థితులను అధిగమిస్తూ జనవరి 21నాటికి 55 లేఅవుట్లకు 317 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 550 ఎకరాల్లో 75 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు అవుతాయని భావిస్తున్నారు. ►గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే తీరులో రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతోంది. 2018–19లో 897 ఎకరాల్లో 175 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు కాగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019–20లో 176 లేఅవుట్లకు 1,284 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. 2020–21లో ఇప్పటికే 73 లేఅవుట్లకు 460 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. భవన నిర్మాణాల్లోనూ విశాఖ, కృష్ణా ముందంజ రాష్ట్రంలో అపార్ట్మెంట్లు, ఇతర భవనాలు, ఇళ్ల నిర్మాణం కూడా ఊపందుకుంది. మున్సిపల్ శాఖ రికార్డు స్థాయిలో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. ►రాష్ట్రంలో 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 2020, జనవరి 20 నాటికి 2,136 భవన నిర్మాణ అనుమతులు జారీచేశారు. ►ఇక రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2020, జనవరి 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,59,574 అపార్టుమెంట్లు, ఇతర భవనాలు, ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1,42,507 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. ►వీటిలో 20,197 అనుమతులతో విశాఖ జిల్లా మొదటిస్థానంలో ఉంది. ►17,247 భవన నిర్మాణ అనుమతులతో ‘కృష్ణా’ రెండో స్థానంలో.. ►15,247 అనుమతులతో పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలో ఉంది. ఆక్యుపెన్సీ రేటూ పెరిగింది రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలోని కొత్త భవన నిర్మాణాల్లో ఆక్యుపెన్సీ కూడా బాగా పెరుగుతోంది. పురపాలక శాఖ అన్ని అనుమతులు ఆన్లైన్ విధానంలో జారీచేస్తుండటం రియల్టర్లు, సామాన్యులకు సౌలభ్యంగా మారింది. వార్డు సచివాలయాలు కేంద్రంగా కార్యకలాపాలు సాగుతుండటంతో నిర్మించిన భవనాలను పరిశీలించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీచేయడం సరళంగా మారింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నాటికి రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల పరిధిలో ఆక్యుపెన్సీ ఫీజుల రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం సమకూరింది. 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రూ.3.703 కోట్లు వసూలైంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ పురపాలక శాఖకు ఆక్యుపెన్సీ ఫీజుల రూపంలో రూ.10.39 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక ఏడాది ముగిసేనాటికి దాదాపు రూ.12కోట్లు సమకూరుతుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. గత నాలుగేళ్లలో ఆక్యుపెన్సీ ఫీజుల్లో ఇదే అత్యధికం. ఆక్యుపెన్సీ దరఖాస్తులకూ అనుమతులు ఇక 2020–21లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం ఇంతవరకు 2,893 దరఖాస్తులు రాగా వాటిలో 2,572 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. తద్వారా రాష్ట్రంలో కొత్తగా 19,242 గృహ యూనిట్లు వాడుకలోకి వచ్చాయి. 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన 112 దరఖాస్తులతో 100 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. తద్వారా కొత్తగా 2,207 గృహ యూనిట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ విషయంలో విశాఖ మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సరళంగా అనుమతుల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో అన్ని రకాల అనుమతులు నిర్ణీత వ్యవధిలో పారదర్శకంగా జారీచేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా మళ్లీ గాడిలో పడింది. దాంతో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు వేగం పుంజుకున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి అన్ని అనుమతులు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తుండటంతో సామాన్యులకు సౌలభ్యంగా ఉంది. – వి.రాముడు, డైరెక్టర్, పట్టణ ప్రణాళిక విభాగం మళ్లీ మంచి రోజులు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. కొత్త వెంచర్లు, అపార్టుమెంట్ల నిర్మాణం ఊపందుకుంటోంది. స్వస్థలాలకు వెళ్లిపోయిన భవన నిర్మాణ కార్మికులు కూడా తిరిగి వస్తున్నారు. రియల్టర్లు చెల్లిస్తున్న లేబర్ సెస్‌ను ‘రెరా’ కార్మికులకు విడుదల చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. నిర్మాణ సామగ్రి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – మద్దులూరి హరి ప్రేమ్‌నాథ్, అధ్యక్షుడు, క్రెడాయ్, ఒంగోలు శాఖ -
ఏజెన్సీలో విజృంభిస్తున్న విషజ్వరాలు
l తూతూమంత్రంగా వైద్య శిబిరాలు l కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ కొత్తగూడ : ఏజెన్సీలో విష ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపుగా అన్ని గ్రామాల్లో ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు. ఏజెన్సీలో విషజ్వరాలు ప్రభలM ýSుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్న పదహేను 104 వాహనాలు, డాక్టర్లను, సిబ్బంది మొత్తం 57 మందిని స్పెషల్ క్యాంపులు నిర్వహించేందుకు డిప్యుటేషన్ వేశారు. ప్రత్యేక (యాంటీ బయాటిక్) మందులు కొనుగోలు చేసి రోగికి అందించాల్సి ఉంది. ప్రతీ గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను సేకరించాలని ఆదేశించారు. కానీ అధికారులు ఇవే ఏమీ చేయడం లేదని ఏజెన్సీ వాసులు ఆరోపిస్తున్నారు. కాగా, ఐటీడీఏ అధికారులు మాత్రం ఆరోగ్య వివరాల కార్డులు ముద్రించి కేటాయించిన 104 వాహనాలు, సిబ్బందిని ఆయా పీహెచ్‌సీలకు పంపిస్తూ ఈ మందులే ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంకేముంది మళ్లీ అవే ఎర్ర, పచ్చ గోళీలు ఇస్తూ వైద్య శిబిరాలను మమ అనిపిస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం చేరకపోగా ఏజెన్సీ వాసులు ప్రైవేట్ వైద్యులపై ఆధారపడాల్సి వస్తోంది. వేలకు వేల రూపాయల మందులకు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాuý శాలలు, గురుకుల విద్యార్థులు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీ వైద్యులు ఇచ్చిన మందులతో తగ్గకపోవడంతో విద్యార్థులను స్థానిక ప్రైవేట్ వైద్యుడికి చూపించడం, తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించే పరిస్థితి నెలకొంది. కాగా, విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ఏజెన్సీ వాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ కూడా ఫాగింగ్ చేయడమే లేదని తెలుపుతున్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ఏజెన్సీ గ్రామాల్లో వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. 30 వేల కుటుంబాలకు సరిపోను ఆరోగ్య వివరాల కార్డులు ముద్రించి వివరాలు పొందు పరుస్తున్నాం. హిమోగ్లోబిన్ శాతం(హెచ్‌పీ), హెచ్ఐవీ, ఆర్డీటీ (మలేరియా) టెస్టులు వైద్య శిబిరాలోనే నిర్వహిస్తున్నాం. మలేరియా తేలిన రోగికి మల్టిడ్రగ్ రెసిస్టెంట్ మందులు అందిస్తున్నాం. సిబ్బంది సమ్మె కారణంగా ఇంటింటి సర్వే చేయలేపోతున్నాం. – అప్పయ్య, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ -
విజృంభిస్తున్న చికున్‌గున్యా
తాడ్వాయి, న్యూస్‌లైన్ : చికున్ గున్యా విజృంభిస్తోంది. దేమికలాన్‌లో 31 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మాత్రం గ్రామాన్ని సందర్శించలేదు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన 12 మంది జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడ్డారు. వారిని కుటుంబ సభ్యులు ఎర్రాపహాడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు చికున్ గున్యా సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వారికి చికిత్స అందించి స్వగ్రామానికి పంపించారు. తాజాగా మరో పందొమ్మిది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. గడ్డ రాజు, దడిగే పోచయ్య, దడిగే భూమవ్వ, లింగవ్వ, చిన్న బాలయ్య, దడిగే గంగాజల, సావిత్రి, పోశవ్వ, నర్సవ్వ, రాజవ్వ, దడిగే ప్రవీణ్, గిద్దె ఆశయ్య, రాపోల్ లక్ష్మి, మెట్టు బాలమణి, ఎర్రోళ్ల నర్సయ్య, ఆశన్నగారి మహీపాల్‌రెడ్డి, బాల సాయిలు, మైశయ్య, మధు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద, డ్రైనేజ్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయిందని, పారిశుధ్య సమస్యను పట్టించుకునేవారు లేరని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.