ఏజెన్సీలో విజృంభిస్తున్న విషజ్వరాలు
-
l తూతూమంత్రంగా వైద్య శిబిరాలు
-
l కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
కొత్తగూడ : ఏజెన్సీలో విష ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపుగా అన్ని గ్రామాల్లో ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారు.
ఏజెన్సీలో విషజ్వరాలు ప్రభలM ýSుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్న పదహేను 104 వాహనాలు, డాక్టర్లను, సిబ్బంది మొత్తం 57 మందిని స్పెషల్ క్యాంపులు నిర్వహించేందుకు డిప్యుటేషన్ వేశారు. ప్రత్యేక (యాంటీ బయాటిక్) మందులు కొనుగోలు చేసి రోగికి అందించాల్సి ఉంది. ప్రతీ గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను సేకరించాలని ఆదేశించారు. కానీ అధికారులు ఇవే ఏమీ చేయడం లేదని ఏజెన్సీ వాసులు ఆరోపిస్తున్నారు.
కాగా, ఐటీడీఏ అధికారులు మాత్రం ఆరోగ్య వివరాల కార్డులు ముద్రించి కేటాయించిన 104 వాహనాలు, సిబ్బందిని ఆయా పీహెచ్‌సీలకు పంపిస్తూ ఈ మందులే ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంకేముంది మళ్లీ అవే ఎర్ర, పచ్చ గోళీలు ఇస్తూ వైద్య శిబిరాలను మమ అనిపిస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం చేరకపోగా ఏజెన్సీ వాసులు ప్రైవేట్ వైద్యులపై ఆధారపడాల్సి వస్తోంది. వేలకు వేల రూపాయల మందులకు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాuý శాలలు, గురుకుల విద్యార్థులు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్‌సీ వైద్యులు ఇచ్చిన మందులతో తగ్గకపోవడంతో విద్యార్థులను స్థానిక ప్రైవేట్ వైద్యుడికి చూపించడం, తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించే పరిస్థితి నెలకొంది. కాగా, విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ఏజెన్సీ వాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ కూడా ఫాగింగ్ చేయడమే లేదని తెలుపుతున్నారు.
వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం
ఏజెన్సీ గ్రామాల్లో వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. 30 వేల కుటుంబాలకు సరిపోను ఆరోగ్య వివరాల కార్డులు ముద్రించి వివరాలు పొందు పరుస్తున్నాం. హిమోగ్లోబిన్ శాతం(హెచ్‌పీ), హెచ్‌ఐవీ, ఆర్‌డీటీ (మలేరియా) టెస్టులు వైద్య శిబిరాలోనే నిర్వహిస్తున్నాం. మలేరియా తేలిన రోగికి మల్టిడ్రగ్ రెసిస్టెంట్ మందులు అందిస్తున్నాం. సిబ్బంది సమ్మె కారణంగా ఇంటింటి సర్వే చేయలేపోతున్నాం.
– అప్పయ్య, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ