విజృంభిస్తున్న చికున్‌గున్యా
Published Wed, Sep 4 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
తాడ్వాయి, న్యూస్‌లైన్ : చికున్ గున్యా విజృంభిస్తోంది. దేమికలాన్‌లో 31 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మాత్రం గ్రామాన్ని సందర్శించలేదు. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన 12 మంది జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడ్డారు. వారిని కుటుంబ సభ్యులు ఎర్రాపహాడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు చికున్ గున్యా సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వారికి చికిత్స అందించి స్వగ్రామానికి పంపించారు. తాజాగా మరో పందొమ్మిది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.
గడ్డ రాజు, దడిగే పోచయ్య, దడిగే భూమవ్వ, లింగవ్వ, చిన్న బాలయ్య, దడిగే గంగాజల, సావిత్రి, పోశవ్వ, నర్సవ్వ, రాజవ్వ, దడిగే ప్రవీణ్, గిద్దె ఆశయ్య, రాపోల్ లక్ష్మి, మెట్టు బాలమణి, ఎర్రోళ్ల నర్సయ్య, ఆశన్నగారి మహీపాల్‌రెడ్డి, బాల సాయిలు, మైశయ్య, మధు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద, డ్రైనేజ్‌ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయిందని, పారిశుధ్య సమస్యను పట్టించుకునేవారు లేరని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Advertisement