ప్రపంచంలోని చాలా దేశాలు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నాయి, ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో మరింత డెవలప్ అయిపోతోంది. నేడు చిన్న చిన్న నగరాల్లో కూడా భూములు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇతరదేశాలతో పోలిస్తే అరబ్ దేశాల్లో ఇది ఒకింత ఎక్కువగా ఉంది. దీనికి కారణమేంటి? కొనుగోలుదారులు ఎందుకు అక్కడే ఆసక్తి చూపుతున్నారనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.
దుబాయ్ అనేది అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి. కావున ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ దేశం ప్రముఖ దేశాలకు నడుమ ఉంది. కావున ఎక్కడికి ప్రయాణించాలన్న కావలసిన సదుపాయాలు ఎక్కువగా ఉండటమే.
ఒకప్పటి పాలన మాదిరిగా కాకుండా దుబాయ్‌లో స్వతంత్య్రత బాగా పెరిగింది. దీనితో పాటు భద్రతలు కూడా పెరిగాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి చాలామంది బారులు తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతోంది. 2021లో దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఇండియన్స్ సుమారు 900 కోట్ల దిర్హామ్‌లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..
బుర్జ్ ఖలీఫాతోపాటు ఆకాశాన్నంటే రీతిలో ఇండ్లు, షాపింగ్ మాల్స్ వంటివి దుబాయ్‌ని టూరిస్ట్ హబ్‌గా నిలపడంతో సహాయపడుతున్న గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్ ఆధ్వర్యంలో ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రావడం వల్ల పారిశ్రామిక వేత్తల చూపు ఇటువైపు తిరిగింది. రానున్న రోజుల్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మరింత పెరుగుతుంది అంటే ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment