
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'రణవీర్ సింగ్' (Ranveer Singh) ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న తన రెండు ఫ్లాట్‌లను విక్రయించాడు. ఈ ఫ్లాట్‌లను ఎప్పుడు కొనుగోలు చేసాడు? ఇప్పుడు ఇంతకు విక్రయించాడు? అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
రణవీర్ సింగ్ 2014 డిసెంబర్‌లో ముంబైలోని ఒబెరాయ్ మాల్‌కు సమీపంలో రెండు ఫ్లాట్‌లను కొనుగోలు చేశాడు. ఒక్కొక్క ఫ్లాట్ కోసం సింగ్ రూ.4.64 కోట్లు, స్టాంప్ డ్యూటీల కోసం రూ.91.50 లక్షలు చెల్లించినట్లు ఆన్‌లైన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ IndexTap.com ప్రకారం తెలిసింది.
రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్స్ విస్తీర్ణం 1,324 చదరపు అడుగులు. ప్రతి ఫ్లాట్‌లోనూ ఆరు పార్కింగ్ స్థలాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఫ్లాట్‌లను రూ. 15.25 కోట్లకు అదే గృహ సముదాయానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?
గోరేగావ్ అపార్ట్‌మెంట్‌తో పాటు, రణవీర్ సింగ్‌కి ఇతర హోల్డింగ్‌లు కూడా ఉన్నాయి. 2022 ఈయన బాంద్రా వెస్ట్‌లో 119 కోట్ల రూపాయలకు క్వాడ్రప్లెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసాడు. దీనికి స్టాంప్ డ్యూటీ రూ.7.13 కోట్లు. ఇది మొత్తం 11,266 చదరపు అడుగులు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో టెర్రేస్ ప్రాంతం మాత్రమే 1,300 చదరపు అడుగులు. ఇందులో మొత్తం 19 కార్ పార్కింగ్ స్థలాలతో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment