ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు వచ్చే 3–4 ఏళ్లలో 30–35 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని జోడించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విస్తరణకు ర.20,000 కోట్ల వ్యయం చేయనున్నారని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడింంది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అమ్మకాలు బాగా పుంజుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. 17 నగరాల్లోని 28 మాల్స్ నుంచి సేకరించిన సవచారం ఆధారంగా ఈ నివేదిక రపుదిద్దుకుంది. లీజుకు ఇవ్వగలిగే 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి విస్తరించాయి.
‘రిటైల్ మాల్ ఆపరేటర్ల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో మూడింట ఒక వంతు నతనంగా తోడు కానుంది. కొత్తగా తోడయ్యే స్థలంలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉంటుంది. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల వెలుపల డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మాల్స్ ఆదాయం మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే 125 శాతం ఉండనుంది’ అని నివేదిక వివరించింది.
స్థిరంగా క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్..
‘మాల్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల ఆసక్తి ఉంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ ఈక్విటీ, గ్లోబల్ పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి 15–20 శాతం నిధులు వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతం వృద్ధిని సాధించిన తరువాత మాల్ యజమానులు 2023–24లో 7–9 శాతం ఆదాయ వృద్ధితో వరుసగా రెండవ సంవత్సరం అధిక పనితీరును కనబరిచే అవకాశం ఉంది.
ఈ బలమైన పనితీరు మాల్స్ 95 శాతం ఆరోగ్యకర ఆక్యుపెన్సీని కొనసాగించడంలో సహాయపడింది. కస్టమర్ల రాక విషయంలో మల్టీప్లెక్స్‌లు సాధారణంగా మాల్స్‌కు బలమైన పునాది. మెరుగైన కంటెంట్ లభ్యతతో ఈ విభాగం ఆరోగ్యకర పనితీరును కనబరుస్తోంది’ అని నివేదిక తెలిపింది. సౌకర్యవంత బ్యాలెన్స్ షీట్స్‌తో పాటు గణనీయంగా పెట్టుబడి ప్రణాళికలు ఉన్నప్పటికీ మాల్ యజమానుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. 28 మాల్స్‌కు మొత్తం రూ.8,000 కోట్ల రుణాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment