ShareChat
-
న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..
2023 ప్రారంభం నుంచి మొదలైన లేఆప్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'షేర్‌చాట్' (ShareChat) తన ఉద్యుగులలో సుమారు 15 శాతం మందిని తొలగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో కంపెనీ నష్టాలను చవి చూడటం వల్ల ఖర్చులను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుతం 15 శాతం లేదా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది 4.9 బిలియన్స్ ఉన్న కంపెనీ విలువ ఈ సంవత్సరం 1.5 బిలియన్స్ తగ్గినట్లు సమాచారం. షేర్‌చాట్ తన కార్యకలాపాలను, ఉత్పాదకతను మెరుగుపరచడం, స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, 2024 వార్షిక ప్రణాళికలో భాగంగా.. కంపెనీ వ్యూహాత్మక పునర్నిర్మాణాన్ని వివరిస్తూ షేర్‌చాట్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! ఇండియన్ స్టార్టప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాని వాల్యుయేషన్ సగానికి పైగా తగ్గడంతో నష్టాల్లో సాగింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాంతంలో కూడా ఉద్యోగులను తొలగించి వారికి పెద్ద షాక్ ఇచ్చింది. -
17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం..
అంకుష్ సచ్‌దేవా పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 'షేర్‌చాట్' పేరు మాత్రం అందరికి తెలుసు. ఈ షేర్‌చాట్ వ్యవస్థాపకుడే అంకుష్ సచ్‌దేవా. విజయం సాధించడంలో 17 సార్లు విఫలైమనప్పటికీ ప్రస్తుతం రూ. 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? దీని వెనుక అతని కృషి ఎలా ఉందనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షేర్చాట్తో ఇంతలా పాపులర్ అవ్వడానికి అతడు అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ రోజు షేర్‌చాట్ మారు మూల గ్రామాలకు కూడా పాకింది. ఈ ప్రయాణంలో అతడు 17 సార్లు ఫెయిలయ్యాడు. మొత్తానికి పట్టువదలని విక్రమార్కునిలాగా అనుకున్నది సాధించి సక్సెస్ సాధించాడు. 2015లో ప్రారంభమైన షేర్‌చాట్ ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్‌పురి, ఇంగ్లీష్ సహా మొత్తం 15 భాషలలో అందుబాటులో ఉంది. అంకుష్ సచ్‌దేవా మొదట్లో 17 స్టార్టప్‌లను ప్రారంభించినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత 18వ ప్రయత్నంలో అంకుష్ సచ్‌దేవా అతని ఇద్దరు ఐఐటీ ఫ్రెండ్స్ ఫరీద్ అహ్సన్, భాను సింగ్‌తో కలిసి షేర్‌చాట్ ప్రారంభించాడు. (ఇదీ చదవండి: దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?) 1992 ఘజియాబాద్‌లో జన్మించిన అంకుష్ సచ్‌దేవా తన సీనియర్ సెకండరీ పాఠశాల విద్యను సోమర్విల్లే స్కూల్లో పూర్తి చేసి, తరువాత 2011లో ఐఐటి కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసాడు. ఆ తరువాత 2015లో మైక్రోసాఫ్ట్‌లో కొంత శిక్షణ పొందాడు. (ఇదీ చదవండి: తక్కువ వడ్డీతో లోన్ అందించే టాప్ 10 బ్యాంకులు - ఇవే!) భారతదేశంలో షేర్‌చాట్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీనికి అంకుష్ సచ్‌దేవా సీఈఓగా ఉన్నారు. ఇది ప్రస్తుతం 15 భారతీయ భాషల్లో 350 మిలియన్ల కంటే ఎక్కువ మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ కలిగి ఉంది. ఇందులో సుమారు 2,500 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షేర్‌చాట్ విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 40,000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికల ద్వారా తెలుస్తోంది. -
‘ఉద్యోగాల ఊచకోత’.. వందల మందిని తొలగిస్తున్న షేర్ చాట్!
ద్రవ్యోల్బణం,స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా టెక్ కంపెనీలు కాస్ట్ కటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ షేర్ చాట్ భవిష్యత్‌లో తలెత్తే ఆర్ధిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 20 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్, టెమాసెక్ వంటి టెక్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో బెంగళూరు కేంద్రంగా మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన షేర్‌చాట్, షార్ట్ వీడియో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఆర్ధిక మాద్యం భయాలతో పెట్టుబడి దారులు ప్రకటనలపై వెచ్చించే ఖర్చును భారీగా తగ్గించారు. దీంతో ప్రకటనల మీద ఆదాయాన్ని గడించే మొహల్లా టెక్‌ను నష్టాలు చుట్టుముట్టాయి. ఈ తరుణంలో 5 బిలియన్ల డాలర్ల మార్కెట్ వ్యాల్యూషన్ ఉన్న షేర్‌చాట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, షార్ట్ వీడియో యాప్ మోజ్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 500 మందిని తొలగించే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపుపై ఆ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..‘మా కంపెనీ చరిత్రలో కఠినమైన, బాధాకరమైన నిర్ణయాలను తీసుకునే సమయం ఆసన్నమైంది. సంస్థ ప్రారంభం నుంచి మాతో జర్నీ చేస్తున్న మా అద్భుతమైన, ప్రతిభావంతులైన ఉద్యోగులలో 20శాతం మందిని వదులుకోవాల్సి వచ్చింది. ఖరీదైన మూలధనం (పెట్టుబడులు) కారణంగా కంపెనీలు తమ వైఖరిని మార్చుకోవాలి. లాభదాయకమైన ప్రాజెక్ట్‌లలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి’ అని అన్నారు. డిసెంబర్ 2022లో మొహల్లా టెక్ తన ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ జీత్11ని షట్‌డౌన్ చేసిన దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించిది. తాజాగా మరో సారి ఉద్యోగుల విషయంలో హైర్ అండ్ ఫైర్ పాలసీని అప్లయ్ చేస్తుంది. చదవండి👉 ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’ -
షేర్‌చాట్ ఉద్యోగుల కోత, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ మూత
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటి షేర్ చాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపులతోపాటు, షేర్‌చాట్ పేరెంట్ కంపెనీ మొహల్లా టెక్ తన రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను మూసివేసింది. మెగా ఫండింగ్ తరువాత ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. బెంగళూరుకు చెందిన షేర్ చాట్ మొత్తం 100కు పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా కంపెనీగా సక్సెస్ కోసం తమ వ్యూహాన్ని క్రమం తప్పకుండా అంచనా వేసి అవసరమైన మార్పులు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ జీట్11ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. తమ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతంకంటే తక్కువమందిపైనే దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. మొత్తం సంస్థలో 2200 మందికి పైగా ఉద్యోగులున్నారు. గూగుల్, టైమ్స్ గ్రూప్ , టెమాసెక్ పెట్టుబడిదారుల నుండి 255 మిలియన్ల డాలర్ల విలువైన ఫండింగ్ రౌండ్‌ను కంపెనీ ప్రకటించిన ఐదు నెలల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాగా పరిశ్రమ అంచనాల ప్రకారం 2022 ప్రారంభం నుండి, భారతీయ స్టార్టప్‌లు 16,000 మంది ఉద్యోగులను తొలగించాయి. -
స్టార్టప్స్‌లో పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్ యూనికార్న్ నివేదిక పేరుతో ఓరిస్ వెంచర్ పార్టనర్స్ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం.. టాప్–3 ర్యాంక్.. గతేడాది బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్(బ్లింకిట్), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్ మూడోపెద్ద స్టార్టప్ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం! ఉపాధి సైతం భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్ఏఏఎస్(సాస్) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జులైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది. డెకాకార్న్లు.. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో రూమ్స్ డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్ సంస్థలుండటం గమనార్హం! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్ 6.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం! మహిళలూ.. యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్ఇంజినీర్స్కాగా.. దాదాపు 67 శాతంవరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులున్నారు. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్(నైకా), గజల్ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్), దివ్యా గోకుల్‌నాథ్(బైజూస్), ఘజల్ అలఘ్(మమాఎర్త్), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. -
దూసుకుపోతున్న షేర్‌చాట్, ఇతర స్టార్టప్ కంపెనీలు
ముంబై: భారత్‌లో స్టార్టప్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ క్లబ్‌లోకి చేరగా, ఈ సారి 2021 మొదటి నాలుగు నెలల్లో మరో ఐదు స్టార్టప్ కంపెనీలు యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించాయి. మీషో, గ్రోవ్, షేర్‌చాట్, ఏపీఐ హోల్డింగ్స్, గప్‌షుప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా అవతారమెత్తాయి. ప్రస్తుతం ఈ కంపెనీల వాల్యూ సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు చేరింది. భారత్‌లో కామర్స్ రంగంలో దూసుకుపోతున్న మీషో కంపెనీ ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ నుంచి సుమారు 300 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సేకరించడంతో కంపెనీ వాల్యూ 2.1 మిలియన్ డాలర్లకు చేరింది. 2017లో స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం గ్రోవ్ కంపెనీ టైగర్ గ్లోబల్ నుంచి సుమారు 83 మిలియన్ డాలర్లును సేకరించడంతో కంపెనీ వాల్యూ బుధవారం రోజున ఒక బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌లో 2017లో ప్రారంభమైన గ్రోవ్ 1.5 కోట్లకు పైగా నమోదైన వినియోగదారులతో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది. గ్రోవ్‌లో వినియోగదారులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటిఎఫ్‌లు, ఐపిఓలు, బంగారంలో సరళమైన, ఏలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ ఈజీ ఏపీఐ హోల్డింగ్ వ్యవస్థాపకుడు బుధవారం యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించమని తెలిపారు. ప్రోసస్ వెంచర్స్, టీపీజీ గ్రోత్ నుంచి సుమారు 350 మిలియన్ డాలర్లను సమీకరించిన తరువాత స్టార్టప్ వాల్యూ 1.5 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. మరో మేసేజింగ్ కంపెనీ గప్‌షుప్ గురువారం టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడంతో, కంపెనీ విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరింది. చదవండి: SBI Card: ఎస్బీఐ కార్డ్ లాభాలు రెట్టింపు -
మహిళ నంబర్‌ను షేర్‌చాట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా..
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో పెట్టి కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో వారు యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అతడిని మందలించడంతో బాధితురాలిపై భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరుపు తీయాలని ఉద్దేశంతో యశ్వంత్ షేర్‌చాట్‌లో బాధితురాలి ఫోన్ నంబర్‌ను పెట్టాడు. దీంతో బాధితురాలికి నిత్యం ఫోన్లు రావడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి.. -
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లతో జాగ్రత్త!
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా యుగంలో.. సంతోషమైనా.. విచారమైనా.. విడాకులైనా.. పుట్టుకైనా.. చావైనా.. ఇట్టే ప్రపంచానికి తెలిసిపోవాల్సిందే. చాలా మంది సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టులకు ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి అనే దానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో.. అంత కన్నా ఎక్కువే చెడు జరుగుతుంది. సోషల్ మీడియాలో మంచి వార్తల కన్నా నకిలీ వార్తలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఇలువంటి పోస్టుల ద్వారా మనకు తెలియకుండానే మనం పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. ఏదైనా మితంగా వాడితే మంచిది.. లేకపోతె అనేక అనర్దాలకు దారి తీస్తుంది. అందుకే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రమాదంలో పడకుండా ఉండటానికి కొన్ని విషయాల గురించి మీకు తెలియజేస్తాము. (చదవండి: ఐఫోన్ 12 సిరీస్ తయారీ ఖర్చు ఎంత?) ఇంతకుముందు సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించి పెద్దగా పట్టించుకోని ఆయా సంస్థలు.. తాజాగా ఇలా చేసేవారిమీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అందుకు తగ్గట్టుగా వారి పాలసీలను మార్చుకుంటున్నాయి. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటివి ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరెవరు ఏం పోస్టులు చేస్తున్నారు..? అందులో నిజమెంత..? వంటివన్నీ ఈ బృందాలు పరిశీలిస్తాయి. తరుచూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేసేవారి ఖాతాలను బ్లాక్ చేయడం.. వారు ఇంకా అలాగే చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చేస్తున్నాయి. మీరు ఎప్పటికి కరోనా వైరస్‌కు సంబంధించిన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. ఇవి ఆయా సామాజిక మాధ్యమ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా ఉంటే అవి మీ పై కేసు పెట్టవచ్చు. అలాగే ఇతరులు ఫార్వార్డ్ చేసిన నకిలీ సందేశాలను ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దు. ఇవి కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయొచ్చు. దీని ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. మీరు పని చేసే సంస్థ యొక్క ఫోటోలను కూడా పోస్ట్ చేయవద్దు. ఇలా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాయి. సంస్థకు సంబంధించిన విషయాలు గానీ.. ఫోటోలు గానీ పోస్టు చేయడాన్ని ఆ సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎన్నికలప్పుడు గాని, ఇతర సమావేశాలు నిర్వహించేటప్పుడు రెచ్చగొట్టే పోస్టులు, హింసాత్మక పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అంతే. అలాంటి పోస్టులకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. సోషల్ మీడియా సంస్థలే గాక.. పోలీసులు, నిఘా విభాగం, సైబర్ పోలీసులు వీటి మీద నిఘా వేసి ఉంచుతారు. -
షేర్‌చాట్ చేతికి సర్కిల్ ఇంటర్నెట్
న్యూఢిల్లీ: హైపర్‌లోకల్ కంటెంట్ సంస్థ సర్కిల్ ఇంటర్నెట్ను కొనుగోలు చేసినట్లు దేశీ సోషల్ మీడియా యాప్ ఫేర్చాట్ తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించింది మాత్రం వెల్లడించలేదు. ఉచిత్ కుమార్, గౌరవ్ అగర్వాల్, శశాంక్ శేఖర్ (షేర్‌చాట్ మాజీ ఎగ్గిక్యూటివ్) కలిసి 2017లో సర్కిల్ ఇంటర్నె్ను ప్రారంభించారు. ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, వెంచర్ హైవే వంటి ప్రేవేట్ ఈక్విటీ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, కేరళలోని 120 పైగా జిల్లాల్లో యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. సర్కిల్ ఇంటర్కెట్ కొనుగోలుతో అందులోని 15 మంది సిబ్బంది కూడా షేర్‌చాట్‌లో చేరనున్నారు. -
టిక్‌టాక్ బ్యాన్: ఇది ‘అణచివేత’ చర్య: చైనా
బీజింగ్: చైనా సోషల్ మీడియా దిగ్గజ యాప్‌లైన టిక్‌టాక్, వీచాట్‌లపై అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక 45 రోజుల్లోగా టిక్‌టాక్ సంస్థతో లావాదేవీలను రద్దు చేసుకోవాలని అమెరికా సంస్థలను ట్రంప్ ఆదేశించడం ‘అణచివేత’ చర్య అంటూ చైనా అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినియోగదారులు, కంపెనీల ఖర్చులపై అమెరికా ఆంక్షలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. (చదవండి: టిక్‌టాక్ కొనుగోలు: కీలక ఉత్తర్వులు!) అంతేగాక తరచూ తమ దేశ శక్తిని కించపరిచేలా ట్రంప్ చర్యలు ఉన్నాయని, అమెరికా కానీ సంస్థలను ట్రంప్ ప్రభుత్వం అన్యాయంగా అణచివేస్తోందన్నారు. అగ్రరాజ్యం సంస్థల, వినియోదారుల వ్యయ హక్కులు, ప్రకయోజనాలపై ఏకపక్ష రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇది ట్రంప్ అణచివేతకు ఉదాహరణ అన్నారు. అయితే గ్లోబల్ టెక్నాలజీలో చైనా శక్తిని అరికట్టేందుకే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్‌టాక్, వీచాట్ వల్ల భవిష్యత్‌లో జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థకు ముంపుని ట్రంప్ పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: టిక్‌టాక్ విక్రయం : చైనా వార్నింగ్?) -
దేశీ యాప్స్ హుషారు..
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో దేశీ యాప్స్‌కి ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. షేర్‌చాట్, రొపొసొ, చింగారీ మొదలైన యాప్స్ డౌన్లోడ్లు, యూజర్ సైన్ అప్స్ పెరిగాయి. గడిచిన రెండు రోజుల్లో భారీ వృద్ధి నమోదు చేసినట్లు ప్రాంతీయ భాషల్లోని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్ వెల్లడించింది. నిషేధం విధించిన సోమవారం సాయంత్రం నుంచి గంటకు 5 లక్షల డౌన్లోడ్స్ చొప్పున 1.5 కోటి పైచిలుకు డౌన్లోడ్స్ నమోదయ్యాయని వివరించింది. షేర్‌చాట్ ఉపయోగాల గురించి యూజర్లు విస్తృతంగా తెలుసుకుంటున్నారని, ఇది తమకు మరింత ఊతమివ్వగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఫరీద్ ఎహ్సాన్ తెలిపారు. చైనా యాప్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఒక లక్ష పైగా పోస్టులు, వాటికి పది లక్షల మందికి పైగా యూజర్ల నుంచి లైక్‌లు వచ్చినట్లు పేర్కొన్నారు. 15 ప్రాంతీయ భాషల్లో షేర్‌చాట్‌కు 15 కోట్ల మంది పైగా రిజిస్టర్డ్ యూజర్లు, 6 కోట్ల మంది దాకా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రాకింగ్ రొపొసొ... ఇక, టిక్‌టాక్ యూజర్లలో చాలా మంది తమ యాప్‌వైపు మళ్లుతున్నట్లు షార్ట్ వీడియో యాప్ రొపొసొ వెల్లడించింది. ఇన్మొబీ గ్రూప్‌నకు చెందిన రొపొసొ 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండగా, 6.5 కోట్ల మేర డౌన్లోడ్స్ ఉన్నాయి. 1.4 కోట్ల వీడియో క్రియేటర్లు, ప్రతి నెలా 8 కోట్ల పైచిలుకు వీడియోలు తమ ప్లాట్‌ఫాంపై రూపొందుతున్నాయని రొపొసొ సహ వ్యవస్థాపకుడు మయాంక్ భంగాడియా తెలిపారు. నైపుణ్యాలున్న భారతీయులందరూ వేగంగా వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడాలన్న ఉద్దేశంతో రొపొసొని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అటు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్న చింగారీ యాప్ వినియోగం కూడా కొద్ది వారాలుగా గణనీయంగా పెరిగింది. గడిచిన 10 రోజుల్లో డౌన్లోడ్స్ సంఖ్య 5.5 లక్షల నుంచి ఏకంగా 25 లక్షలకు పెరిగింది. బాక్స్ఎన్గేజ్కు 10 రెట్లు స్పందన.. చైనా యాప్స్‌పై నిషేధం విధించిన 24 గంటల వ్యవధిలో తమ వెబ్సైట్ యాక్టివ్ యూజర్ల సంఖ్య పది రెట్లు పెరిగిందని, ఒక లక్ష పైగా చేరుకుందని బాక్స్ఎంగేజ్డాట్కామ్ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ సమయంలో ఇది ప్రారంభమైంది. వీడియో షేరింగ్, డిజిటల్ సర్వీసులు మొదలైనవి ఈ ప్లాట్‌ఫాం అందిస్తోంది. ప్రస్తుతానికి పోర్టల్‌కు మాత్రమే పరిమితమైనా, త్వరలో మొబైల్ యాప్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక హ్యాప్రాంప్కు చెందిన గోసోషల్ అనే సోషల్ నెట్వర్కింగ్ సొల్యూషన్కి గడిచిన కొద్ది రోజుల్లో యూజర్ల సంఖ్య 20 శాతం ఎగిసింది. ప్రస్తుతం దీనికి 80,000 పైచిలుకు యూజర్లు ఉన్నారు. హ్యాప్రాంప్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇన్వెస్ట్ చేశారు. దేశీ యాప్స్ డౌన్లోడ్లు భారీగా ఎగిసినా ఇది తాత్కాలికం మాత్రమేనని, దీన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టుకునేందుకు వ్యవస్థాపకులు గట్టి ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు శుభేంద్ర విక్రం తెలిపారు. అటు చైనా యాప్స్‌పై నిషేధం విధించిన 24 గంటల్లో సోషల్ మీడియా యాప్ ట్రెల్ ప్లాట్‌ఫాంపై ట్రాఫిక్ 500 శాతం పెరిగింది. అటు డిజిటల్ ఆడియో ప్లాట్‌ఫాం ఖబ్రీ రోజువారీ డౌన్లోడ్స్ 80 శాతం పెరిగింది. దేశీ డెవలపర్లకు మంచి చాన్స్.. టిక్‌టాక్‌పై నిషేధంతో 20 కోట్ల మంది పైచిలుకు భారతీయ యూజర్లు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ సీనియర్ రీసెర్చి డైరెక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు. ‘అలాంటి భారీ ప్లాట్‌ఫాం రూపొందించే దిశగా భారతీయ డెవలపర్లకు ఈ నిషేధంతో మంచి అవకాశాలు దొరికినట్లయింది. ఇలాంటి పలు యాప్స్ ప్రస్తుతం ప్రారంభ స్థాయిలో ఉన్నాయి. భారతీయ వినియోగదారులిక వీటిని మరింత ఉధృతంగా వాడే అవకాశం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక లక్షలకొద్దీ యువ యూజర్లు, బ్రాండ్లను తమ ప్లాట్‌ఫామ్స్‌వైపు ఆకర్షించేందుకు దేశీ సంస్థలకు ఇది మంచి అవకాశమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ దిగ్గజాల్లాగే స్థానిక డెవలపర్లకు కూడా అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నాయి. -
‘గూగుల్లోకి 6 కోట్ల షేర్‌చాట్ యూజర్స్’
ముంబై: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడే యువతకు పరిచయం అక్కర్లేని యాప్ షేర్ చాట్. ప్రస్తుతం షేర్‌చాట్ సంస్థ ఖర్చులను తగ్గించి విస్తృత సేవలను అందించాలని భావిస్తోంది. అందులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ క్లౌడ్‌లోకి తమ యాప్‌కు చెందిన 6 కోట్ల మంది వినియోగాదారులను బదిలీ చేశామని సోమవారం షేర్‌చాట్ ప్రకటించింది. ప్రస్తుతం షేర్‌చాట్ అన్ని రంగాల వారికి ఉపయోగపడుతుంది. కాగా విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగాల వారైనా సరే వారి మనోభావాలు, కళాత్మక నైపుణ్యం, మాటలు, వీడియోలు, సరదా సన్నివేశాలు ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు షేర్‌చాట్ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు 6 కోట్ల మందికి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను బదిలీ చేశామని తెలిపింది. షేర్‌చాట్ తన వ్యాపార వృద్ధిని మరింత విస్తరించడానికి, ఖర్చులను తగ్గించడానికి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఇటీవల షేర్‌చాట్ మెరుగైన సేవల కోసం అత్యాధునిక ఐటి మౌలిక సదుపాయాలపై ఆధారపడుతుంది. దీని వల్ల అధిక డేటా, కంటెంట్, ఎక్కువ వినియోగదారులు ఉపయోగించడం(ట్రాఫిక్ కారణంగా) ఇటీవల కాలంలో షేర్‌చాట్‌కు సమస్యగా మారింది. షేర్‌చాట్ వినియోగదారులలో అధిక శాతం టైర్ 2, టైర్ -3 నగరాలకు చెందినవారు కావడంతో వారు ఇప్పటికీ 2జీ నెట్వర్క్పైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్లో తమ సేవలను వినియోగించే వారికి అత్యుత్తమ సేవలందించేందుకు గూగుల్ క్లౌడ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు షేర్‌చాట్ పేర్కొంది. ప్రస్తుతం సంస్థ వృద్ధి బాటలో కొనసాగుతోందని, కానీ ఖర్చులను తగ్గించి మెరుగైన సేవలందించేందుకు గూగులతో ఒప్పందం కుదుర్చోవడం ఎంతో కీలకమని షేర్ చాట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ రామస్వామి పేర్కొన్నారు. మరోవైపు మెరుగైన సేవల కోసం 6 కోట్ల మంది వినియోగదారులను తమకు బదిలీ చేయడం సంతోషకరమని గూగుల్ క్లౌడ్ ఎండీ కరణ్ బాజ్వా తెలిపారు. (చదవండి: చాటింగ్ తెచ్చిన చేటు) -
బాలికతో షేర్‌చాట్.. విజయవాడకు వచ్చి..!
తాడేపల్లిరూరల్: పదిహేను రోజుల క్రితం ఒక బాలిక (14) అనంతపురంలో నివసించే ఓ యువకుడికి షేర్‌చాట్‌లో మెసేజ్ పంపించింది. అప్పటినుంచి బాలికతో ఆ యువకుడు షేర్‌చాట్‌లో మెసేజ్ చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణపల్లికి చెందిన ఎం.విజయకుమార్ ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక గత 15 రోజులుగా ప్రతిరోజూ షేర్‌చాట్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు. తనను ఇంట్లోంచి తీసుకువెళ్లిపోమని, లేదంటే చనిపోతానని మెసేజ్ పెట్టడంతో విజయకుమార్, అతని సోదరుడు నవీన్ ఆదివారం అనంతపురం నుంచి బయల్దేరి సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌కు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు హోటల్‌కు వెళ్లి యువకులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మెసేజ్ చేసింది బాలిక అనుకోలేదని, తాను డిగ్రీ పూర్తి చేశానని ఆమె తనతో చెప్పిందని విజయకుమార్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కబుర్లు..కాకరకాయలు అమ్మ భాషలో...
సోషల్ మీడియా అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేవి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామే.భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నెటిజన్లు ఫాలో అయ్యేవి ఈ యాప్‌లే. అయితే వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో అటువంటి మరో యాప్ దేశంలో ప్రస్తుతం వేగంగా యువతను ఆకట్టుకుంటోంది. భారతీయ భాషల్లో అందుబాటులోకి రావడం ద్వారా స్వదేశీ ముద్ర వేసుకొని దూసుకుపోతున్న ఆ యాపే ‘షేర్‌చాట్’. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులైన ఫరీద్ అహ్సాన్, భానుసింగ్, అంకుష్ సచ్దేవ్ బెంగళూరు కేంద్రంగా 2015 అక్టోబర్‌లో దీన్ని ప్రారంభించారు. షేర్‌చాట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 భారతీయ భాషల్లో మొత్తం 3 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. అసలేంటీ యాప్? ప్రతి ఒక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుంది. కానీ వారికి వాళ్ల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సరైన వేదికలు దొరకవు. అలాంటి వారి ప్రతిభను, సృజనాత్మకతను తమ మాతృభాషలోనే ప్రదర్శించేందుకు, ఇతరులతో పంచుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతున్నదే షేర్‌చాట్. ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ లేదా షేర్‌చాట్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక యూజర్లు వీడియోలు, ఆడియోలు, జోకులు, జీఐఎఫ్‌లు, ఫొటోలను పంచుకోవచ్చు. వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలోకి తిరిగి షేర్ చేసుకోవచ్చు. అలాగే షేర్చాట్లోని కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలపైనే దృష్టి... దేశంలో ఇంగ్లిష్ మాట్లాడగలిగిన, అర్థం చేసుకోగల సుమారు 15 కోట్ల మంది నెటిజన్లు వాట్సాప్, ఫేస్బుక్ వంటి ఆంగ్ల ప్రధాన సోషల్ నెట్వర్కింగ్ యాప్‌ల యూజర్లుగా ఉన్నట్లు షేర్‌చాట్ నిర్వాహకులు గుర్తించారు. అప్పటికే దూసుకుపోయిన ఆయా యాప్‌ల తరహాలోనే మళ్లీ ఆంగ్ల మాధ్యమంలో కొత్త యూజర్లను ఆకట్టుకోవడం అంత సులభం కాదని గ్రహించారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాల్లోని యూజర్లను సంపాదించుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందుకోసం తొలుత ఇంగ్లిష్‌తోపాటు పలు భారతీయ భాషల్లో షేర్‌చాట్‌ను తీసుకొచ్చారు. వారి ఆలోచన సత్ఫలితాలిచ్చింది. 2015 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య లక్ష షేర్‌చాట్ యాప్ ఇన్స్టాల్స్ నమోదయ్యాయి. అప్పటికి షేర్‌చాట్‌లో ఉన్న సుమారు 70 వేల వాట్సాప్ గ్రూపుల ద్వారా నిత్యం 50 వేల భాగాల కంటెంట్ షేర్ అయ్యేది. యూజర్ల వాడకం ఆధారంగా ఇంగ్లిష్ ఆప్షన్‌ను షేర్‌చాట్ నుంచి ఆ తర్వాత తొలగించారు. ప్రస్తుతం షేర్‌చాట్‌కు 3.5 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు (నెలకు) ఉన్నారు. సగటున రోజుకు 20 నిమిషాలపాటు యూజర్లు షేర్‌చాట్ వాడుతున్నారు. మాతృభాషలో అందుబాటులో... షేర్‌చాట్ ప్రస్తుతం 14 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం, తమిళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, భోజ్‌పురి, హర్యాన్వీ, రాజస్తానీ భాషల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని యూజర్లకు షేర్‌చాట్ ఇస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి ఆగ్నేయాసియా లేదా ఆఫ్రికాలలో కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం షేర్‌చాట్ మార్కెట్ విలువ రూ. 3 వేల కోట్లకుపైగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో షేర్‌చాట్ పెద్దగా ప్రజాదరణ పొందనప్పటికీ గుజరాత్, పశ్చిమ మహారాష్ట్ర, తూర్పు యూపీతోపాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న మలయాళీలు ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఈ యాప్ ద్వారా కూడా తమ ప్రచారం చేసుకుంటున్నారు. పోటీగా మరిన్ని యాప్‌లు దేశీ సోషల్ మీడియాగా షేర్‌చాట్ ప్రఖ్యాతిగాంచడంతో దానికి పోటీగా మరికొన్ని దేశీ యాప్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. వాటిలో డైలీహంట్ (వార్తలు, వీడియోలు), న్యూస్‌డాగ్ (వార్తలు, వైరల్ కంటెంట్), టిక్ టాక్ (వీడియోల ప్రధాన యాప్), క్లిప్ ఇండియా (వీడియో, చాట్ యాప్) ప్రాచుర్యం పొందాయి. అలాగే మాతృభారతి (రచయితలకు స్వీయ ముద్రణ వేదిక కల్పించ డంతోపాటు భారతీయ భాషల్లో ఈ–బుక్స్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించే యాప్), ప్రతిలిపి (భారతీయ భాషల్లో సాహిత్యం, ఈ–బుక్స్ అందుబాటులో ఉంచే యాప్), శబ్దనగరి (హిందీ భాషలో మొట్టమొదటి సోషల్ నెట్వర్కింగ్ సైట్), ప్లానెట్ గోగో (స్థానిక భాషల్లో కంటెంట్ కోసం వెతికే అవకాశం కల్పించే లాక్–స్క్రీన్ యాప్). - సాక్షి, హైదరాబాద్ -
ప్రాంతీయ భాషల్లో ‘షేర్’చాట్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాంతీయ భాషలో పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు వాటిని ఇతరులతో షేర్ చేయడం కోసం వచ్చిన భారతీయ యాప్ ‘షేర్‌చాట్’ ఎంతో ఆదరణ పొందుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సెలబ్రటీలు ఇంగ్లీషు భాషలో తప్ప ఇతర ప్రాంతీయ భాషల్లో ముచ్చటించుకోవడానికి దీన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీషు భాషలో ముచ్చటించుకోవాలన్న ఇందులో కుదరదు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీషు లేదు. మిగతా భారత్‌లోని 14 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఇంగ్లీషులో ముచ్చటించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గ్లోబల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీషు రాకుండా కేవలం ప్రాంతీయ భాష మాత్రమే వచ్చిన ప్రజల సౌకర్యార్థం ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ప్రాంతీయ భాషలతోపాటు ఇందులో కూడా ఇంగ్లీషు భాషను పెట్టినట్లయితే ప్రాంతీయ భాషను చిన్న చూపు చూసినట్లు అవుతుంది. ఆంగ్ల భాషకున్న ఆదరణ కారణంగా ఆ భాష అంతగా రాకపోయినా ఆంగ్లంలో ముచ్చటించేందుకు కొంత మంది ప్రయత్నించవచ్చు. కొంత కూడా ఆ భాషరాని వారు ఇబ్బంది పడవచ్చు. అందుకని 2015, అక్టోబర్ నెలలో ఈ ‘షేర్‌చాట్’ను తీసుకొచ్చారు. గత 18 నెలల కాలంలోనే దీని యూజర్ల సంఖ్య 20 ఇంతలు పెరిగి, రెండున్నర కోట్లకు చేరుకుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే ఉపయోగించిన ఈ చాట్‌ను ఇప్పుడు సెలబ్రీటలతోపాటు వివిధ వర్గాల ప్రజలను ఉపయోగిస్తున్నారని వారు చెప్పారు. మూడు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమత్రులు....చత్తీస్ గఢ్ రమన్ సింగ్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌవాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, భోజ్‌పూరి పాటల గాయకుడు మనోజ్ తివారీ కూడా ఈ షేర్‌చాట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ను ఉపయోగించడంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూకుడును పెంచారు. కాంగ్రెస్ పార్టీగానీ, ఆ పార్టీ నాయకులుగానీ ఈ యాప్‌ను అంతగా ఉపయోగించడం లేదు. చైనా వెంచర్ క్యాపిటర్ ‘షన్వీ కాపిటల్’ ద్యారా ఈ యాప్ గత నెలలో దాదాపు 720 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. 2021 వరకు దాదాపు 53 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్పైకి వస్తారని గూగుల్ నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది.