న్యూఢిల్లీ: హైపర్‌లోకల్ కంటెంట్ సంస్థ సర్కిల్ ఇంటర్నెట్‌ను కొనుగోలు చేసినట్లు దేశీ సోషల్ మీడియా యాప్ ఫేర్‌చాట్ తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించింది మాత్రం వెల్లడించలేదు. ఉచిత్ కుమార్, గౌరవ్ అగర్వాల్, శశాంక్ శేఖర్ (షేర్‌చాట్ మాజీ ఎగ్గిక్యూటివ్) కలిసి 2017లో సర్కిల్ ఇంటర్నె్‌ను ప్రారంభించారు. ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్, వెంచర్ హైవే వంటి ప్రేవేట్ ఈక్విటీ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, కేరళలోని 120 పైగా జిల్లాల్లో యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. సర్కిల్ ఇంటర్కెట్ కొనుగోలుతో అందులోని 15 మంది సిబ్బంది కూడా షేర్‌చాట్‌లో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment