
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో పెట్టి కాల్ గర్ల్‌గా చిత్రీకరించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో వారు యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు.
దీంతో వారు అతడిని మందలించడంతో బాధితురాలిపై భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరుపు తీయాలని ఉద్దేశంతో యశ్వంత్ షేర్‌చాట్‌లో బాధితురాలి ఫోన్ నంబర్‌ను పెట్టాడు. దీంతో బాధితురాలికి నిత్యం ఫోన్లు రావడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు!
బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment