2023 ప్రారంభం నుంచి మొదలైన లేఆప్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'షేర్‌చాట్' (ShareChat) తన ఉద్యుగులలో సుమారు 15 శాతం మందిని తొలగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2023లో కంపెనీ నష్టాలను చవి చూడటం వల్ల ఖర్చులను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుతం 15 శాతం లేదా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది 4.9 బిలియన్స్ ఉన్న కంపెనీ విలువ ఈ సంవత్సరం 1.5 బిలియన్స్ తగ్గినట్లు సమాచారం.
షేర్‌చాట్ తన కార్యకలాపాలను, ఉత్పాదకతను మెరుగుపరచడం, స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, 2024 వార్షిక ప్రణాళికలో భాగంగా.. కంపెనీ వ్యూహాత్మక పునర్నిర్మాణాన్ని వివరిస్తూ షేర్‌చాట్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు!
ఇండియన్ స్టార్టప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాని వాల్యుయేషన్ సగానికి పైగా తగ్గడంతో నష్టాల్లో సాగింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాంతంలో కూడా ఉద్యోగులను తొలగించి వారికి పెద్ద షాక్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment