సాక్షి,ముంబై: దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటి షేర్ చాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపులతోపాటు, షేర్‌చాట్ పేరెంట్ కంపెనీ మొహల్లా టెక్ తన రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను మూసివేసింది. మెగా ఫండింగ్ తరువాత ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
బెంగళూరుకు చెందిన షేర్ చాట్ మొత్తం 100కు పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా కంపెనీగా సక్సెస్ కోసం తమ వ్యూహాన్ని క్రమం తప్పకుండా అంచనా వేసి అవసరమైన మార్పులు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ జీట్11ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. తమ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతంకంటే తక్కువమందిపైనే దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. మొత్తం సంస్థలో 2200 మందికి పైగా ఉద్యోగులున్నారు.
గూగుల్, టైమ్స్ గ్రూప్ , టెమాసెక్ పెట్టుబడిదారుల నుండి 255 మిలియన్ల డాలర్ల విలువైన ఫండింగ్ రౌండ్‌ను కంపెనీ ప్రకటించిన ఐదు నెలల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాగా పరిశ్రమ అంచనాల ప్రకారం 2022 ప్రారంభం నుండి, భారతీయ స్టార్టప్‌లు 16,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
Comments
Please login to add a commentAdd a comment