shuts down
-
14 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్.. ఆన్లైన్ చాట్ సైట్ షట్‌డౌన్
2009లో మొదలైన వర్చువల్ చాట్ సైట్ 'ఒమెగల్' (Omegle) ఈ రోజు షట్‌డౌన్ అయింది. ప్రస్తుతం ఈ సైట్‌ను యాక్సెస్ చేయాలని చూస్తే ఒక ఫోటో మాత్రమే కనిపిస్తోంది. ఈ చాట్ సైట్ నిలిపివేయడానికి కారణం ఏంటి? ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒమెగల్ ఫౌండర్ 'లీఫ్ కె-బ్రూక్స్' (Leif K-Brooks) ప్రకారం.. ఆపరేటింగ్ సమస్యలు, పెరిగిన ఖర్చుల కారణంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. మనకు ప్రస్తుతం కనిపించే ఫొటోలో సమాధి రాయి మీద బ్రాండ్ లోగో, దాని కింద 2009 - 2023 వంటివి చూడవచ్చు. లీఫ్ కె-బ్రూక్స్ 'ఒమెగల్' గురించి వివరిస్తూ.. కొత్త వ్యక్తులకు పరిచయ వేదికగా పనిచేసిన ఒమెగల్, 14 సంవత్సరాలు సేవలు అందిస్తూ వచ్చింది. యూజర్స్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో అప్డేట్స్ తీసుకువచ్చినప్పటికీ.. కొందరు దీనిని స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. 2023 జూన్ నాటికి ప్రతి రెండు రోజులకు ఒకసారి పిల్లలపై ఆన్లైన్ లైంగిక వేధింపులు వచ్చాయని, అలాంటి వాటికి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొన్ని నియమాలు ప్రవేశపెట్టినట్లు బ్రూక్స్ వెల్లడించారు. అయితే ఒమెగల్ ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవలపై జరిగిన దాడుల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా నిర్వహణ, దీని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒత్తిడి వంటి వాటితో పాటు ఆర్థిక భారాలు పెరగటం వల్ల 14 సంవత్సరాల తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్స్ స్పష్టం చేశారు. Omegle has officially shut down after 14 years. pic.twitter.com/agGJkd65KV — Pop Base (@PopBase) November 9, 2023 -
ఆ స్టార్టప్ కంపెనీ ఇక కనిపించదు! ఉద్యోగులు ఉంటారో.. ఊడతారో..
తన వ్యాపార నైపుణ్యాలతో అనేక రంగాల్లో అగ్రగామిగా రాణిస్తూ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ముఖేష్ అంబానీ గురించి అందరికీ తెలిసిందే. రూ.17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా అనేక స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అలా వాటికి యాజమానిగా ఉన్నారు. ఈ సార్టప్ కంపెనీల్లో మిల్క్‌బాస్కెట్ కూడా ఒకటి. ఇది త్వరలో కనుమరుగు కానుంది. మిల్క్‌బాస్కెట్ అనేది 2015లో ప్రారంభించిన ఒక సబ్స్క్రిప్షన్ ఆధారిత గ్రోసరీ డెలివరీ స్టార్టప్. ఈ కంపెనీలో ముఖేష్ అంబానీ 2021లో 96 శాతం వాటాను కొనుగోలు చేశారు. అలా మిల్క్‌బాస్కెట్ యాజమాన్య సంస్థగా మారిన రిలయన్స్ రిటైల్.. ఆ కంపెనీని తనలో కలిపేసుకోనుంది. తద్వారా మిల్క్‌బాస్కెట్ బ్రాండ్ శాశ్వతంగా కనుమరుగు కానుంది. దీన్ని జియో స్మార్ట్ డైలీ పేరుతో పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి ➤ JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే.. మిల్క్‌బాస్కెట్ కంపెనీని జియోమార్ట్‌తో కలిపేస్తున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నాత్నకంగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థలో ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సేల్స్, హెడ్ ఆఫీస్ టీమ్‌తో సహా దాదాపు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్, నోయిడా, గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాల్లో మిల్క్‌బాస్కెట్ బిజినెస్ టు కస్టమర్ (B2C) స్పేస్‌లో సేవలు అందిస్తోంది. దీనికి పోటీగా కంట్రీ డిలైట్, డైలీ నింజా వంటి సంస్థలు ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్నాయి. -
ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత
నెదర్లాండ్‌కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్‌నకు చెందిన ఓఎల్ఎక్స్ ఆటోస్ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్ఎక్స్ గ్రూప్ టెక్ క్రంచ్ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్స్టర్డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్ఎక్స్ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్‌క్రంచ్ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది. అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
షాకింగ్: ఇండియాలో రెండు ట్విటర్ ఆఫీసులు మూత
సాక్షి,ముంబై: బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తరువాత ఖర్చులు తగ్గించుకునే పనిలో పలు నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ తాజాగా న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసి వేశారు. భారతదేశంలోని తన మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసిన సంస్థ సిబ్బందిని ఇంటినుంచే పనిచేయమని కోరింది. మస్క్ యాజమాన్యంలో ట్విటర్ కోరింది. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగనుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది ఎలాన్‌మస్క్ కంపెనీని చేజిక్కించుకున్నప్పటినుంచి 90 శాతం ఉద్యోగులను తొలగించిన ట్విటర్ ఢిల్లీ, ముంబైలోని తన కార్యాలయాలను మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిలో 90శాతం మందిని తొలగించిన విషయం తెలిసిందే. 2022లో ఉద్యోగుల భారీ తొలగింపుల తరువాత మస్క్ ఇప్పుడు ఆఫీసుల మూతకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగాఉద్యోగుల తొలగింపుల తోపాటు, కార్యాలయాలను మూసివేస్తున్నారు. భారతీయ మార్కెట్‌కు ప్రాధాన్యతనిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విటర్ బెంగళూరులో కార్యాలయాన్ని కొనసాగిస్తోందని, ఇది ప్రధానంగా ఇంజనీర్లతో పని చేస్తుందని వర్గాలు వెల్లడించాయి. -
షేర్‌చాట్ ఉద్యోగుల కోత, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ మూత
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటి షేర్ చాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపులతోపాటు, షేర్‌చాట్ పేరెంట్ కంపెనీ మొహల్లా టెక్ తన రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను మూసివేసింది. మెగా ఫండింగ్ తరువాత ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. బెంగళూరుకు చెందిన షేర్ చాట్ మొత్తం 100కు పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా కంపెనీగా సక్సెస్ కోసం తమ వ్యూహాన్ని క్రమం తప్పకుండా అంచనా వేసి అవసరమైన మార్పులు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ జీట్11ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. తమ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతంకంటే తక్కువమందిపైనే దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. మొత్తం సంస్థలో 2200 మందికి పైగా ఉద్యోగులున్నారు. గూగుల్, టైమ్స్ గ్రూప్ , టెమాసెక్ పెట్టుబడిదారుల నుండి 255 మిలియన్ల డాలర్ల విలువైన ఫండింగ్ రౌండ్‌ను కంపెనీ ప్రకటించిన ఐదు నెలల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాగా పరిశ్రమ అంచనాల ప్రకారం 2022 ప్రారంభం నుండి, భారతీయ స్టార్టప్‌లు 16,000 మంది ఉద్యోగులను తొలగించాయి. -
5G: ఎయిర్టెల్, జియో కీలక నిర్ణయం: చైనాకు షాక్!
సాక్షి, ముంబై: దేశంలో 5జీ సేవలను అందించేందుకు సంబంధించిన 5G నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశీయ దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, జియో చైనా కంపెనీలతో భాగస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో చైనాకు ఇక తలుపులు మూత పడ్డాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకవసరమైన స్పెక్ట్రంను కేటాయింపుల వేలంలో టెల్కోలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. వేలం ప్రక్రియ మూడో రోజు నేడు (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బుధవారం బిడ్డింగ్ ముగిసే సమయానికి జియో రూ. 82,500 కోట్లకు దాదాపు 46,000 కోట్లతో ఎయిర్టెల్, రూ. 19,000 కోట్లతో వొడాఫోన్ ఐడియా బిడ్డింగ్ చేయగా, కొత్తగా వచ్చిన అదానీ డేటా నెట్వర్క్స్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం దాదాపు రూ.900-1,000 కోట్లకు బిడ్ చేసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేలా 700 GHz బ్రాండ్‌ను కొనుగోలు చేయగల ఏకైక టెలికాం జియో మాత్రమేనని విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు 5జీ సేవలకు సంబంధించి జియో ఎయిర్టెల్ భాగస్వామ్యాలు విశేషంగా నిలిచాయి. టెలికాం కంపెనీల 5జీ పార్టనర్షిప్స్ జియో, ఎయిర్టెల్ ఫిన్లాండ్కు చెందిన నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్‌లకు కాంట్రాక్టుల భాగస్వామ్యాల్ని కుదుర్చుకున్నాయి. తద్వారా 5జీ సేవల విషయంలో చైనా కంపెనీలు,హువావే, జెడ్‌టీఈలకు మన దేశంలో అధికారికంగా తలుపులు మూసేసినట్టైంది. కాగా 5జీసేవలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 14 తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను ఆయా కంపెనీలకు కేటాయించనుంది. -
మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
తరాలు మారుతున్న ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు వివక్షలను ఎదుర్కుంటున్నారు. తాజాగా ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళను ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనమతించలేదు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ రెస్టారెంట్‌ని మూసివేశారు. ఈ ఘటన బహ్రెయిన్‌లోని అడ్లియాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అడ్లియాలో ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ను 1987 నుంచి నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒక మహిళ కస్టమర్ ముసుగు ధరించి రెస్టారెంట్‌లోనికి వెళ్తోంది. ఇది గమనించిన రెస్టారెంట్ సిబ్బంది ముసుగు ధరించిన కారణంగా ఆమెను లోనికి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బీటీఈఏ) ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తుకు ఆదేశించింది. ప్రజల పట్ల వివక్ష చూపే ఏ చర్యలైనా తాము అంగీకరించమని, ముఖ్యంగా వారి జాతి వివక్షలాంటివి అసలు సహించమని బీటీఈఏ హెచ్చరించింది. చదవండి: Breast Milk Jewellery: తల్లి పాలతో అలా.. ఏడాది సంపాదన ఏకంగా 15 కోట్ల రూపాయలు!! దర్యాప్తు అనంతరం నిబంధనలు ఉల్లంఘించిందని తేలడంతో ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. రెస్టారెంట్ యాజమాన్యం దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. క్షమాపణ చెప్పడంతో పాటు ఘటనపై విచారం కూడా వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన రెస్టారెంట్ డ్యూటీ మేనేజర్‌ను కూడా తొలగించింది. ఈ అందమైన రాజ్యంలోని అన్ని దేశాలకు చెందిన తమ కస్టమర్లకు 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. -
శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లలో, స్మార్ట్‌టీవీల్లో టైజెన్ (Tizen) యాప్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టైజెన్ యాప్ స్టోర్‌ను 2021 డిసెంబర్ 31నే పూర్తిగా మూసివేసినట్లు శాంసంగ్ తెలిపింది. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌కు..! పాత యూజర్లతో పాటుగా, కొత్త యూజర్లు కూడా టైజెన్ యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని శాంసంగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. GSMArena ప్రకారం..టైజెన్ యాప్ సేవల రిజిస్ట్రేషన్ శాంసంగ్ పూర్తిగా మూసివేసింది. ఈ యాప్ స్టోర్ కేవలం పాత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అందులో కూడా పాత యూజర్లు గతంలో డౌన్లోడ్ చేసిన యాప్స్‌ను మాత్రమే పొందగలరని శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌కు మారాలని శాంసంగ్ సూచించింది. స్మార్ట్‌టీవీల్లో, వాచ్‌ల్లో..! శాంసంగ్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఆండ్రాయిడ్‌కు గతంలోనే మారింది. ఆండ్రాయిడ్‌కు ముందుగా స్మార్ట్‌వాచ్, స్మార్ట్ఫోన్లలో టైజెన్ ఒఎస్‌ను శాంసంగ్ వాడింది. కాగా ఇటీవల కాలంలో కొత్త స్మార్ట్‌టీవీలను టైజెన్ ఒఎస్తో శాంసంగ్ ఆవిష్కరించింది. ఆయా స్మార్ట్‌టీవీల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తోంది. అసలు ఏంటి టైజెన్..! టైజెన్ స్టోర్ అనేది శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ స్టోర్. ఇది టైజెన్ ప్లాట్‌ఫారమ్ ఆధారిత అప్లికేషన్లను సపోర్ట్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ప్లే స్టోర్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్టోర్‌లో యూజర్లు అప్లికేషన్లను బ్రౌజ్ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ ఆయా స్మార్ట్‌టీవీలో కూడా ఉంది. ఈ యాప్ అన్ని ప్రముఖ ఆడియో , వీడియో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. ఇది శాంసంగ్ హెల్త్, స్మార్ట్ థింగ్స్, శాంసంగ్ టీవీ ప్లస్ తోపాటుగా అనేక ఇతర గేమింగ్ ఫీచర్లను కూడా అనుసంధానిస్తుంది. చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్‌ఫోన్స్, సోలార్‌పవర్‌తో ఛార్జ్..! -
డేటా బ్రీచ్ : డా. రెడ్డీస్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: హైదరాబాదుకు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు డేటా షాక్ తగిలింది. సంస్థకు చెందిన సర్వర్లలో డేటాబ్రీచ్ కలకలం రేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లాంట్లను సౌకర్యాలను మూసి వేసింది. సైబర్ దాడి నేపథ్యంలో అన్ని డేటా సెంటర్ సేవలను వేరుచేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల అందించిన సమాచారంలో డా.రెడ్డీస్ తెలిపింది. సైబర్ దాడిని గుర్తించిన నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో అన్ని సేవలను పునఃప్రారంభించాలని ఆశిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ముఖేష్ రతి తెలిపారు. ఇది తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్) ఇండియా సహా, అమెరికా, యూకే, బ్రెజిల్, రష్యాలోని ప్లాంట్లు ప్రభావితమైనాయని డా.రెడ్డీస్ వెల్లడించింది. భారతదేశంలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ 2-3 దశల హ్యూమన్ ట్రయల్స్ నిర్వహణకు డా.రెడ్డీస్ కు డీజీసీఐ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించిన కొన్నిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళన రేపింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ షేర్ 4 శాతం కుప్ప కూలింది. మరోవైపు గత కొంతకాలంగా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్ అందించిన ఫార్మా షేర్లు గురువారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అరబిందో ఫార్మా, సిప్లా భారీగా నష్టపోతున్నాయి. దీంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.29 శాతం నష్టంతో ట్రేడవుతోంది. -
భారత్‌కు ‘హార్లే’ గుడ్‌బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్‌లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్‌లు భారత మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్‌లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్‌లో బైక్‌ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్‌ఫామ్‌లు: 6 (స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్‌లో వైదొలగాలని నిర్ణయం -
‘రీడ్ అండ్ టేలర్’ కన్నీటి కథ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తల పరంపరలో భారత్‌లో చోటుచేసుకున్న మరో కీలక పరిణామం మరుగున పడి పోయింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన, జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రాస్నన్ వాణిజ్య ప్రకటనలతో భారతీయులందరికి సుపరిచితమైన ‘రీడ్ అండ్ టేలర్’ బ్రాండ్ కంపెనీ మే 14వ తేదీన భారత్‌లో శాశ్వతంగా మూతపడింది. పర్యవసానంగా కంపెనీలో పనిచేస్తోన్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. (లాక్డౌన్: తొలి ఐదు వారాలు చితక్కొట్టారు!) స్కాట్లాండ్లో దాదాపు 190 ఏళ్ల చరిత్ర కలిగిన ‘రీడ్ అండ్ టేలర్’ వస్త్రాల కంపెనీకి భారత్‌లో 22 ఏళ్ల చరిత్ర ఉంది. మైసూర్ కేంద్రంగా 1998లో భారత్‌లో వెలిసిన ఈ కంపెనీని ‘రీడ్ అండ్ టేలర్ ఇండియా లిమిటెడ్ (ఆర్ఎల్ఊఎల్)’గా మంచి గుర్తింపు పొందింది. మగవారి పాయింట్లు, చొక్కాలు, సూట్లు, జాకెట్లు, టై దుస్తులతో ధనిక, మధ్యతరగతి భారతీయులను ఎంతోగానో ఈ బ్రాండ్ ఆకట్టుకుంది. దీన్ని భారత్‌లో స్థాపించిన మాతృ సంస్థ ఎస్ కుమార్స్గా పేరుపొందిన ఎస్ కుమార్స్ నేషన్వైడ్ లిమిటెడ్ (ఎస్‌కేఎన్‌ఎల్)’ కంపెని. (ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్!) రీడ్ అండ్ టేలర్ పుట్టుపూర్వోత్తరాలు స్కాట్లాండ్లో రకారకాల ఉన్నితో వస్త్రాలను తయారు చేసే అలెగ్జాండర్ రీడ్‌కు మంచి పేరుండేది. ఆయన తన వస్త్ర వ్యాపారాన్ని విస్తరించడం కోసం జోసఫ్ టేలర్ అనే బాగా డబ్బున్న ఫైనాన్సియర్‌ను పట్టుకొని ఇద్దరి పేర్లు స్ఫురించేలా ‘రీడ్ అండ్ టేలర్’ బ్రాండ్ పేరుతో బట్టల కంపెనీని ఏర్పాటు చేశారు. ఇదే కంపెనీ బ్రాండ్ భారతీయులకు పరిచయం చేయడం కోసం అప్పటికే భారత్‌లో గుర్తింపున్న ఎస్ కుమార్స్ 1997లో రీడ్ అండ్ టేలర్‌తో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా 1998లో ‘రీడ్ అండ్ టేలర్ ఇండియా లిమిటెడ్’ పేరిట కంపెనీనీ ఏర్పాటు చేశారు. (లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే...) స్కాట్లాండ్లోని మాతృసంస్థ ‘రీడ్ అండ్ టేలర్’ తరహాలో మొదట జేమ్స్ బాండ్ హీరో యాడ్‌ను కొనసాగించిన ఎస్‌కేఎన్‌ఎల్, 2003లో బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ను తీసుకొచ్చి వాణిజ్య ప్రకటనలను ఇప్పించడంతో బ్రాండ్ పేరు దేశమంతా తెల్సిపోయింది. అప్పటికే మార్కెట్లో అమితాబ్‌కు మంచి డిమాండ్ ఉండడంతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనకు బాగా రాయల్టీ చెల్లించాల్సి వచ్చింది. 2008 సంవత్సరంతో ‘రీడ్ అండ్ టేలర్’ కంపెనీని తన ఉప సంస్థగా ఎస్ కుమార్స్ ప్రకటించింది. అందులోని 25.4 శాతం వాటాను సింగపూర్‌లోని జీఐసీ కంపెనీకి 900 కోట్ల రూపాయలకు అమ్మేసింది. దాంతో ‘రీడ్ అండ్ టేలర్’ బ్రాండ్ విలువ 3,540 కోట్ల రూపాయలకు చేరుకోగా, మాత సంస్థ అయిన ఎస్ కుమార్ విలువ 2,240 కోట్ల రూపాయలుగా ఉండింది. 2012 మార్చి నెలలో దాదాపు 470 కోట్ల రూపాయల లాభాన్ని ఎస్ కుమార్ చూపించింది. అప్పటి నుంచి ‘రీడ్ అండ్ టేలర్’కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఆ కంపెనీ తరఫున వెయ్యి కోట్ల రూపాయల పబ్లిక్ ఫండింగ్‌ను సేకరించాలని 2011లోనే ఎస్ కుమార్స్ వ్యూహ రచన చేసింది. ఆ డబ్బుతో దేశవ్యాప్తంగా 15 ఫ్గాగ్షిప్ కార్యక్రమాలు నిర్వహించి 160 ప్రత్యేక షోరూమ్‌లను తెరవాలని ‘రీడ్ అండ్ టేలర్’ నిర్ణయించింది. ఆశించిన పబ్లిక్ ఫండ్‌కు ఆస్కారం లేకపోవడంతో కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు స్వస్తి చెప్పింది. (42 మందికి కరోనా: నోకియా ప్లాంట్ మూత) కంపెనీ నష్టాలవైపు నడుస్తున్న విషయాన్ని గమనించిన ఆర్థిక సంస్థలు 2012 సంవత్సరంలో ఆ కంపెనీలో తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. అదే సమయంలో ఐడీబీఐ బ్యాంక్ తన 14.57 శాతం వాటాను తీసేసుకొని అమ్మేసింది. 2013, మార్చి నెలనాటికి ‘రీడ్ అండ్ టేలర్ ఉప కంపెనీతో సహా ఎస్ కుమార్ కంపెనీ’ అప్పులు 4,484 కోట్ల రూపాయలుగా తేలింది. వాటిలో ఎక్కువ శాతం అప్పులు రీడ్ అండ్ టేలర్ కంపెనీ పేరుతోనే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సహా కంపెనీకి అప్పులిచ్చిన వారంతా కంపెనీకి వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఓ పక్క కోర్టు వ్యవహారాలు కొనసాగుతుండగానే 2018 సంవత్సరానికి కంపెనీ అప్పులు ఐదువేల కోట్ల రూపాయలు దాటి పోయాయి. చివరకు క్రెడిటర్లంతా ఓ కమిటీగా ఏర్పడి కంపెనీ ‘లిక్విడేషన్’కు ఆర్జి పెట్టుకున్నారు. ఆ సమయంలో కొత్త ప్రమోటర్‌ను వెతికి తీసుకరావడం ద్వారా కంపెనీని రక్షించేందుకు 200 మంది సభ్యులు గల ‘రీడ్ అండ్ టేలర్ ఇండియా లిమిటెడ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్’ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. 2019, ఫిబ్రవరి నెలలో ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్’ జోక్యం చేసుకొని ఆర్‌టీఐఎల్ ‘లిక్విడేషన్’కు ఆదేశించింది. ఆస్తులను అమ్మేసి వచ్చిన సొమ్మును క్రెడిటర్లకు పంచడాన్ని లిక్విడేషన్ అంటారు. ‘కంపెనీని రక్షించేందుకు గత 14 నెలలుగా నేను శత విధాల కషి చేశాను. లాభం లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో లిక్విడేషన్ చేయక తప్పలేదు’ అని లిక్విడేటర్‌గా వ్యవహరించిన రవి శంకర్ దేవరకొండ మీడియాకు తెలియజేశారు. వాణిజ్య ప్రకటనలకు, సెలబ్రిటీలకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల కంపెనీ దివాలా తీసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు
న్యూఢిల్లీ / శ్రీనగర్: భారత్–పాకిస్తాన్ల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యం ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధనసహాయం అందడంతో పాటు నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. -
విప్రో మైసూరు యూనిట్ మూత
బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీం ప్రేమ్ జీ ఆధర్వంలోని విప్రో కార్యాలయాన్ని మూసి వేసింది. ఎల్ఈడీ ఉత్పత్తులకు పెరుగుతున్న భారీ డిమాండ్ కారణంగా తమ మైసూరు ఆఫీసును మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. హూటాగల్లీ ఇండస్ట్రీ ఏరియాలో సుమారు 7.5 ఎకరాల్లో విస్తరించిన ఉన్న యూనిట్‌కు సోమవారం లాకౌట్ నోటీసులు అతికించింది. దీంతో కంపెనీ కార్మికుల భవితవ్యం ఆందోళనలో పడింది. మైసూరులోని లైటింగ్ తయారీ యూనిట్‌ను మూసివేశామని విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పేర్కొంది. ఎల్ఈడీ ఉత్పత్తుల ప్రాధాన్యత పెరగడంతో తమ సీఎఫ్ఎల్ ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత రెండేళ్ళలో డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని కంపెనీ తెలిపింది. పరిస్థితి మెరుగుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలించినప్పటికీ ఏడాదికి పైగా ఉత్పత్తి క్షీణించడంతో ఆర్థిక భారం భరించలేనిదిగా మారిందని తెలిపింది. అలాగే ఈ ప్లాంట్ ను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు రెండునెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారాఅన్ని రెగ్యులేటరీ అవసరాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 84 మంది శాశ్వత కార్మికులు, 66గురు కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రతిపాదించినట్టు వెల్లడించింది. మరోవైపు కంపెనీ లాకౌట్ పై కార్మికులు సోమవార రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. నిరవధిక ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కంపెనీ తమకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. -
తైవాన్‌కు అప్పుడే దడపుట్టిస్తున్న 'మెగి'
తైవాన్: తైవాన్ను మరోసారి టైఫూన్ చుట్టేస్తోంది. రెండు వారాల్లో మూడోసారి దాడి చేయనుంది. ఈ భయంతో వేలమంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వందల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతానికి శరవేగంతో దూసుకొస్తున్న తైపూన్'మెగి' రేపు సరిగ్గా తైవాన్ తీరాన్ని తాకనుంది. దీరి ప్రభావంతో ఇప్పటికే బలమైన గాలులు వీస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. ఐలాండ్ కు సమీపంగా మెగి వచ్చిన నేపథ్యంలో దాదాపు ధ్వంసం చేసేంత ప్రభావాన్ని చూపిస్తోంది. అధికారులంతా అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా 5వేలమంది ప్రజలు తీర ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తైవాన్ కేంద్ర అత్యవసర సేవల నిర్వహణా సంస్థ తెలిపింది. టైఫూన్ కారణంగా 36 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 575 అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను నిలిపేసినట్లు చెప్పారు. మరో 109 విమానాల సర్వీసులు ఆలస్యం అవుతాయన్నారు. ప్రస్తుతం భీకరగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే వేలమంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్
ప్రధానమంత్రి అభ్యర్థిగా రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ చాయ్ పే చర్చా అన్నీ వార్తపత్రికల్లో బ్యానర్‌గా నిలిచింది. ఈ క్యాంపెయిన్‌తో పాటు మోదీ మొదటిసారి ఎక్కడైతే చాయ్ పే చర్చను ప్రారంభించారో ఆ టీ స్టాల్కూ ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం ఆ స్నాక్ అవుట్‌లెట్‌ను మున్సిపల్ అధికారులు మూసేశారట. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఈ టీ స్టాల్ ఉండటంతో పాటు, సరియైన భవన వాడక అనుమతులు లేకపోవడంతో దీన్ని సీజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ ఇస్కోన్ గాంతియా టీ స్టాల్‌తో పాటు మొత్తం ఎనిమిది స్నాక్ అవుట్లెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దుకాణాలకు సరియైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో పాటు హైవే అంతా కస్టమర్లతో గందరగోళంగా మారుతోంది. దీనిపై అహ్మదాబాద్ మున్సిపల్ అథారిటీలు వివిధ నోటీసులు పంపినప్పటికీ ఈ అవుట్లెట్లు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయలేదు. నోటీసులు పంపినా స్పందించని అవుట్లెట్లపై సీరియస్ అయిన మున్సిపల్ అధికారులు వీటిని సీజ్ చేశారు. చట్టాలను అతిక్రమించి ఈ అవుట్లెట్లను రన్ చేస్తున్నారని, అవసరమైన భవన వాడక అనుమతులు లేవని మున్సిపల్ అథారిటీలు పేర్కొన్నారు. ఈ స్నాక్ అవుట్లెట్లోనే ప్రధాని అభ్యర్థిగా మోదీ మొదటిసారి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాయ్ పే చర్చ అనంతరం ఆ టీ స్టాల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు కుప్పలు తెప్పలుగా విచ్చేస్తున్నారు. దీంతో హైవేపై గందరగోళ వాతావరణం నెలకొంది. -
పార్లే జీ బిస్కట్ల ఫ్యాక్టరీ మూసివేత
ముంబై: ముంబైలోని ప్రముఖ బిస్కట్ల తయారీసంస్థ పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఓ ఫ్యాక్టరీ మూతపడింది. అది కూడా అక్కడిది, ఇక్కడిది కాదు.. పార్లే పేరుమీదే ముంబైలో ఉన్న ప్రముఖ జంక్షన్ విల్లెపార్లె ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ. ఇది 87 సంవత్సరాల నాటిది. విశేష ఆదరణ పొందిన ఈ ఫ్యాక్టరీ గేట్లు మూతపడ్డాయి. తక్కువ ఉత్పాదకత కారణంగా ఫ్యాక్టరీని మూసివేసిందని మిడ్-డే నివేదించింది. గత కొన్నేళ్లుగా ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ యజమానులు చివరకు దాని తలుపులు మూసేశారు. అయితే ఈ ఒక్క ఫ్యాక్టరీ మూసివేతతో పార్లే బిస్కట్ల ఉత్పత్తి మొత్తం ఆగిపోదు. ఈ సంస్థకు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో ఇంకా చాలా ఫ్యాక్టరీలున్నాయి. వాటి నుంచి పార్లే జీ బిస్కట్లు వస్తాయి. కేవలం ముంబై విలె పార్లె ప్రాంతంలో ఉన్న అత్యంత పాత ఫ్యాక్టరీ ఒక్కదాన్ని మాత్రమే పార్లే సంస్థ మూసేసింది. కానీ ఈ వార్తతో ట్విట్టర్ సందేశాలు వెల్లువెత్తాయి. ముంబై లోకల్ రైల్లో ప్రయాణించే సమయంలో విలే పార్లే ప్రాంతంలే వచ్చే అద్భుతమైన అరోమా పరిమళాలు ఇక లేనట్టేనా... పార్లే ఫ్యాక్టరీ లేని విల్లే పార్లే లేదు.. మూసివేసింది ఫ్యాక్టరీనే కానీ.. ఉత్పత్తుల్ని కాదంటూ భిన్న స్పందనలొచ్చాయి. కాగా 1929లో విలే పార్లేలో ఈ ఐకానిక్ పార్లే కంపెనీ తన ఉత్పత్తులను ప్రారంభించింది. శక్తినిచ్చే ప్రత్యేక గ్లూకోజ్ బిస్కట్లతో అప్రతిహతంగా దూసుకుపోయింది. పిల్లలు, పెద్దలు, అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్ రారాజు సునీల్ గవాస్కర్ ఇటీవల 67వ వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే గవాస్కర్ కు అత్యంత ఇష్టమని ఆయన సోదరి నూతన్ గవాస్కర్ చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పార్లే గ్లూకోజ్ బిస్కట్స్, కుకీస్ అంటే ఒకపుడు భారతదేశంలో అంతటి క్రేజ్ ఉండేది. #Mumbai’s Vile Parle factory, which gave us ‘iconic’ #ParleG bicsuits, shuts down pic.twitter.com/aE56UMJz7U — Amam Shah (@amamsshah) July 30, 2016 Vile Parle is just vile without Parle. #ParleG — Mild Sunshine (@RichPurelyRich) July 28, 2016