ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లలో, స్మార్ట్‌టీవీల్లో టైజెన్ (Tizen) యాప్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టైజెన్ యాప్ స్టోర్‌ను 2021 డిసెంబర్ 31నే పూర్తిగా మూసివేసినట్లు శాంసంగ్ తెలిపింది.
ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌కు..!
పాత యూజర్లతో పాటుగా, కొత్త యూజర్లు కూడా టైజెన్ యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని శాంసంగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. GSMArena ప్రకారం..టైజెన్ యాప్ సేవల రిజిస్ట్రేషన్ శాంసంగ్ పూర్తిగా మూసివేసింది. ఈ యాప్ స్టోర్ కేవలం పాత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అందులో కూడా పాత యూజర్లు గతంలో డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌ను మాత్రమే పొందగలరని శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌కు మారాలని శాంసంగ్ సూచించింది.
స్మార్ట్‌టీవీల్లో, వాచ్‌ల్లో..!
శాంసంగ్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఆండ్రాయిడ్‌కు గతంలోనే మారింది. ఆండ్రాయిడ్‌కు ముందుగా స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్లలో టైజెన్ ఒఎస్‌ను శాంసంగ్ వాడింది. కాగా ఇటీవల కాలంలో కొత్త స్మార్ట్‌టీవీలను టైజెన్ ఒఎస్‌తో శాంసంగ్ ఆవిష్కరించింది. ఆయా స్మార్ట్‌టీవీల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తోంది.
అసలు ఏంటి టైజెన్..!
టైజెన్ స్టోర్ అనేది శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్ స్టోర్. ఇది టైజెన్ ప్లాట్‌ఫారమ్ ఆధారిత అప్లికేషన్లను సపోర్ట్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్లే స్టోర్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్టోర్‌లో యూజర్లు అప్లికేషన్‌లను బ్రౌజ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ ఆయా స్మార్ట్‌టీవీలో కూడా ఉంది. ఈ యాప్ అన్ని ప్రముఖ ఆడియో , వీడియో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. ఇది శాంసంగ్ హెల్త్, స్మార్ట్ థింగ్స్, శాంసంగ్ టీవీ ప్లస్ తోపాటుగా అనేక ఇతర గేమింగ్ ఫీచర్‌లను కూడా అనుసంధానిస్తుంది.
చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్‌ఫోన్స్, సోలార్‌పవర్‌తో ఛార్జ్..!
Comments
Please login to add a commentAdd a comment