సాక్షి, ముంబై: శాంసంగ్ కొత్త టీవీలను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 43 అంగుళాల 4కే డిస్‌ప్లే, బెజిల్‌లెస్ డిజైన్‌తో శాంసంగ్ శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ బెజిల్‌లెస్ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌తో ఈ స్మార్ట్ టీవీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
గేమింగ్ కోసం ఆటో గేమ్ మోడ్ వంటి హై-ఎండ్ ఫీచర్ కూడా ఇందులో పొందుపర్చింది. ఆడియో కోసం డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో 20వాట్ల స్పీకర్‌ను, అలాగే స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌ను కూడా ఉంచింది, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, బిక్స్‌బీలకు ఈ క్రిస్టల్ 4కే నియో టీవీ సపోర్ట్ చేస్తుంది. దీంతో చానెల్స్ మార్చడం, కంటెంట్ వెతకడం, వాల్యుమ్, ప్లే బ్యాక్‌ను వాయిస్‌తోనే కంట్రోల్ చేయవచ్చు.
ప్రైస్ అండ్ సేల్
ప్రారంభ ఆఫర్‌లో 43 అంగుళాల క్రిస్టల్ 4కే నియో టీవీ ధర రూ.35,990 వద్ద అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభ్యం.
శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ ఫీచర్లు
3,840x2160 పిక్సెల్స్ రెజల్యూషన్
43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్
1.5 ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్
డిస్‌ప్లే HDR10+ కంటెంట్ సపోర్ట్
ప్లే బ్యాక్‌ను వాయిస్ కంట్రోల్
Comments
Please login to add a commentAdd a comment