Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు | Samsung launches The Frame TV 2021 customisable bezels | Sakshi
Sakshi News home page

Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు

Published Thu, Jun 10 2021 3:52 PM | Last Updated on Thu, Jun 10 2021 4:15 PM

Samsung launches The Frame TV 2021 customisable bezels - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణకొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ సరికొత్త స్మార్ట్‌టీవీని భారత మార్కెట్‌లో  లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ ది ఫ్రేమ్‌ టీవీ 2021 పేరుతో ఈ స్మార్ట్‌టీవీని విడుదల చేసింది. మునుపటి మోడల్‌ స్మార్ట్‌టీవీల కంటే ఇది 46శాతం సన్నగా ఉంటుంది. 43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో ఈ టీవీ లభించనుంది. విభిన్న కలర్‌ బెజెల్స్‌ను ఎంచుకునే అవకాశంతోపాటు, టీవీని ఏర్పాటు చేసిన ప్లేస్‌లో పరిసరాలకు సరిపోయేలా టీవీ అంచుల డిజైన్లను మార్చుకోవడం ఈ స్మార్ట్‌టీవీ ప్రత్యేకత.


ఫ్రేమ్‌ టీవీ 2021  ఫీచర్లు, ధర 
క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే,100శాతం కలర్‌ వాల్యూమ్‌ను అందిస్తుంది.  శాంసంగ్‌  క్వాంటమ్‌ డాట్‌ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తున్న కొత్త టీవీ మోడళ్లలో యూహెచ్‌డీ క్వాలిటీలో 1,200 ఫొటోలను స్టోర్‌ చేసుకోవడానికి వీలుగా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 500 ఎంబీ నుంచి 6జీబీ వరకు పెంచింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ.61,990గా ఉండనుంది. జూన్‌ 12 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్ల నుంచి  దీన్ని కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ఈఎంఐలపై రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తించనుంది. జూన్‌ 12 నుంచి 21 మధ్య కొనుగోలు చేసిన కస్లమర్టకు కాంప్లిమెంటరీగా 9990 రూపాయల విలువైన  బెజెల్‌ను అందిస్తుంది. 

చదవండి : Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement