Samsung Launched Galaxy Z Fold 5 and Z Flip 5 Smartphones - Sakshi
Sakshi News home page

Samsung Galaxy Z Fold 5, Flip 5: శాంసంగ్‌ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్‌..అదిరిపోయే ఆఫర్‌తో...

Published Thu, Jul 27 2023 1:45 PM | Last Updated on Thu, Jul 27 2023 2:14 PM

Samsung Galaxy Z Fold 5 Z Flip 5 Tab 9 tablets check price and offers - Sakshi

Samsung Galaxy Z Fold 5 and  Z Flip 5: స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్‌లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌5 , గెలాక్సీ జెడ్‌  ఫ్లిప్‌ 5 పేరుతో  రెండు ఫోల్డబుల్‌ స్మార్ట్‌పోన్లను తీసుకొచ్చింది.

అలాగే గెలాక్సీ వాచ్‌ 6 సిరీస్‌,   గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌9   సిరీస్‌ను  కూడా  ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్‌లో మూడు మోడల్స్‌తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌ 9 అల్ట్రా  మోడల్స్‌ను లాంచ్‌ చేసింది.   ('ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్‌ గెలాక్సీ  వాచ్‌ 6..యాపిల్‌కు షాకే!)

ప్రీమియం సెగ్మెంట్‌లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన  షావోమి, ఒప్పో  లాంటి  కంపెనీలకు  గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్‌ అన్ని డివైస్‌లు  ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి.  Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్‌తోపాటు  Z Flip 5 డిస్‌ప్లేకి కొన్ని అప్‌గ్రేడ్‌లను కూడా చేసింది.  (మారుతి జిమ్నీని సింగిల్‌ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్‌ వీడియో)

కొత్త ఫోల్డబుల్‌  స్మార్ట్‌ఫోన్లు, ధరలు
గెలాక్సీ జెడ్‌  ఫ్లిప్‌ 5  (8 జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌): రూ 99,999
గెలాక్సీ జెడ్‌  ఫ్లిప్‌ 5  (8జీబీ ర్యామ్‌ + 512 జీబీ స్టోరేజ్‌): రూ 1,09,999
 గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌5  (12 జీబీ ర్యామ్‌  + 256జీబీ స్టోరేజ్‌ ): రూ 1,54,999
 గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌5  (12జీబీ ర్యామ్‌  + 512 జీబీ స్టోరేజ్‌): రూ 1,64,999
 గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌5  (12జీబీ ర్యామ్‌ + 1టీబీ స్టోరేజ్‌): రూ 1,84,999

ప్రీ-బుకింగ్ కస్టమర్‌లు రూ. 23,000 (జెడ్‌ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని  శాంసంగ్‌ వెల్లడించింది.  ఇందులో   క్యాష్‌బ్యాక్  అప్‌గ్రేడ్ బోనస్‌లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17  లైవ్‌  సేల్‌,  ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement