సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారా? అయితే ఈ మండు వేసవిలో మీకో తీపి కబురు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ 32-అంగుళాల టైజెన్ టీవీ భారీ ఆఫర్ అందిస్తోంది. 38 శాతం తగ్గింపుతో రూ. 13,999 తగ్గింపు ధరకే లిస్ట్ చేసింది. దీంతోపటు పలు డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ద్వారా 23వేల రూపాయల టీవీని కేవలం రూ. 5,000లోపు సొంతం చేసుకోవచ్చు. (Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?)
32 అంగుళాల శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ అసలు ధర దాదాపు రూ. 23,000. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 14వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 2020లో లాంచ్ అయింది.
బ్యాంక్ ఆఫర్లు
ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా 10 శాతం వరకు తగ్గింపు. దీనికి అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీల నుండి 500 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?)
ఎక్స్చేంజ్ ఆఫర్
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ. 5,000లోపు కొనుగోలు చేయాలనుకుంటే, బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11వేల ఎక్స్చేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంది .
శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ ఫీచర్లు
366 x 768 పిక్సెల్‌లతో 80 cm (32-అంగుళాల) LED HD రెడీ స్క్రీన్
డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60 Hz
డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్
ఇంకా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, సోనీ లివ్, ఏరోస్ నౌ, జియో సినిమా, గానా, బిగ్ ఫిక్స్, స్పాటిఫై, సన్ నెక్ట్స్ సహా ఇతర యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.ఇన్‌బిల్ట్ Wi-Fi , 2 Dolby Digital Plus స్పీకర్లు లాంటి ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment