Flipkart TV Days Sale: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..! | Flipkart TV Days Sale 2022 Start From Feb 6, Best Offers on Smart TVs | Sakshi
Sakshi News home page

Flipkart TV Days Sale: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..!

Published Sun, Feb 6 2022 7:15 PM | Last Updated on Sun, Feb 6 2022 7:41 PM

Flipkart TV Days Sale 2022 Start From Feb 6, Best Offers on Smart TVs - Sakshi

ప్రముఖ ఈ-కామర్స ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్‌తో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో భాగంగా వివిధ ప్రముఖ బ్రాండ్‌ స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ టీవీ డేస్ సేల్ నేటి(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10, 2022వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వివిధ బ్రాండ్ల టీవీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీనితో పాటుగా యూజర్ నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. 

► శామ్ సంగ్ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఈ సేల్‌లో రూ.16,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై 25% తగ్గింపు లభిస్తుంది. దీని మీద నెలకు ₹1,899తో ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ టీవీతో కస్టమర్లు 20వాట్ స్పీకర్‌ను కూడా పొందుతారు.

► వన్ ప్లస్ వై సిరీస్ 80 సెం.మీ(32 అంగుళాల) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈ సేల్‌లో రూ.16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ వినియోగదారులకు 17% తగ్గింపుతో లభిస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలో కస్టమర్‌లు 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు.

► ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో 24 అంగుళాల కొడాక్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,999కే లభిస్తోంది. ఇది కాకుండా, మీరు అడ్సున్ 24 అంగుళాల మోడల్ టీవీని రూ.7,290కు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మార్క్యూ 24 అంగుళాల మోడల్ రూ.7,999కు లభిస్తోంది.

► రియల్ మీ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై 11 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అది వినియోగదారులకు రూ.15,999కి అందుబాటులో ఉంటుంది. ఈ టీవీలో 24వాట్ స్పీకర్ అవుట్‌పుట్ , 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది.

(చదవండి: ఇక పెట్టుబడికి సిద్దం కాండి.. దేశంలో డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement