నెదర్లాండ్‌కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్‌ఎక్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్‌నకు చెందిన ఓఎల్‌ఎక్స్ ఆటోస్ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్‌ఎక్స్ గ్రూప్ టెక్ క్రంచ్ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్‌స్టర్‌డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది.
‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్‌ఎక్స్ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్‌క్రంచ్ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది.
అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్‌ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్‌ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు!
Comments
Please login to add a commentAdd a comment